Begin typing your search above and press return to search.
ఛోటా రాజన్ మరణ వార్త నిజం కాదట!
By: Tupaki Desk | 7 May 2021 12:09 PM GMTఅండర్ వరల్డ్ మాఫియా డాన్ రాజేంద్ర నికల్జే ఉరఫ్ ఛోటా రాజన్ మృతిచెందాడని వస్తున్న వార్తలు నిజం కాదని తెలుస్తోంది. కొవిడ్ తో బాధపడుతున్న ఛోటా రాజన్.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచాడని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే.. కాసేపటి తర్వాత ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ మరో వార్తను వెల్లడించింది. ఛోటా రాజన్ మరణించలేదని, అతడు సజీవంగానే ఉన్నాడని తెలిపినట్టు సమాచారం. ఎయిమ్స్ ప్రతినిధిని ఉటంకిస్తూ ఈ వార్తను ప్రసారం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఛోటా రాజన్ చనిపోయినట్టు వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రాజన్ కు కరోనా చికిత్స అందిస్తున్నామని మల్హోత్రా చెప్పినట్టు తెలుస్తోంది.