Begin typing your search above and press return to search.
మూడుకు ముహూర్తం....21న టీవీలకు అతుక్కోవాల్సిందే...?
By: Tupaki Desk | 18 March 2022 8:06 AM GMTఏపీలో మూడు రాజధానుల మీద సర్కార్ మూడ్ మారిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయి ఇప్పటికి పది రోజులు గడచినా ఆ ఊసు లేకపోవడం కొద్ది రోజుల్లో సభ ముగియడంతో అమరావతికే జై కొడుతున్నారని అంచనా వేశారు. కానీ ఇపుడు సడెన్ గా కొత్త ప్రచారం ఊపందుకుంది. మూడు రాజధానుల విషయంలో తగ్గేది లే అన్న తీరున సర్కార్ ఉందని తెలుస్తోంది.
అందుకే ఈ నెల 21న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది అని వార్తలు వస్తున్నాయి. నిజానికి మూడు రాజధానుల విషయంలో ఈ మధ్యనే హై కోర్టు తీర్పు వెలువరించింది. అమరావతి రాజధాని విషయంలో కొత్త చట్టం చేయడానికి వీలులేదని, ఒక వేళ చేయాలనుకుంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాల్సిందే అని కూడా పేర్కొంది.
ఇక హైకోర్టు తీర్పు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రులు, వైసీపీ కీలక నేతలు అంతా కూడా మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకున్నారు. ఈ విషయంలో ఏం చేస్తారు అన్నది మాత్రం ఎవరూ వెల్లడించకపోయినా మూడు రాజధానుల విషయంలో వైసీపీ గట్టి పట్టుదల మీద ఉందని కూడా వారు మాటలను బట్టి తెలుస్తోంది.
ఇవన్నీ ఇలా ఉండగా ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్ ని మూడు రాజధానుల విషయమై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సహా ఇతర కీలక నేతలు కలసినపుడు ప్రభుత్వం ఈ నెల 21న బిల్లు ప్రవేశపెడుతుందన్న మాట అయితే ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం మరో మారు హీటిక్కడం ఖాయం అంటున్నారు.
అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు తేవడం తో పాటు హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నదని అంటున్నారు. మొత్తానికి చూస్తే బడ్జెట్ సమావేశాలు పెద్దగా కీలకమైన అంశాలు లేకుండానే ముగుస్తాయా అని అంతా అనుకుంటున్న తరుణంలో మూడు రాజధానుల బిల్లు ఈ నెల 21న అన్న వార్త ఇపుడు తెగ వైరల్ అవుతోంది. అదే కనుక జరిగితే ఈ నెల 21న ఏపీ జనాలు మొత్తం మరో మారు టీవీలకు అతుక్కుపోవాల్సిందే అంటున్నారు.