Begin typing your search above and press return to search.

గుజరాత్ సర్వే: బీజేపీకి 'ఆప్' షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:30 PM GMT
గుజరాత్ సర్వే: బీజేపీకి ఆప్ షాక్ తప్పదా?
X
గుజరాత్ లో.. దేశంలో పట్టపగ్గాల్లేకుండా గెలుపు గుర్రాలు ఎక్కుతున్న దేశంలోని ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులు ప్రధాని మోడీ.. కేంద్రహోంమంత్రి అమిత్ షాలు.. 2014 నుంచి వీరు పట్టిందల్లా బంగారమైంది. ప్రతీ చోట గెలుపు సాగిలపడింది. కానీ ఇప్పుడు వీరి సొంత రాష్ట్రంలో అంత ఈజీ కాదని తేలింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ జన్మించిన గడ్డ.. రాజకీయంగా ఎదుగుదలకు కారణమైన గుజరాత్ లో ఇప్పుడు బీజేపీకి గడ్డు పరిస్థితులు తప్పవన్న చర్చ సాగుతోంది.

గుజరాత్ లో ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ ను తోసిరాజని ఆమ్ ఆద్మీ పార్టీ తూసుకొస్తోంది. కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పార్టీని బలంగా తయారు చేస్తున్నారు. పంజాబ్ లో అధికారంలోకి వచ్చినట్టే మరింత ఆత్మవిశ్వాసంతో గుజరాత్ లో కేజ్రీవాల్ తమ పార్టీని విస్తరిస్తున్నారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు.

మోడీ -షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్ ను తమ చేతుల్లోంచి ఆమ్ ఆద్మీ పార్టీలోకి జారకుండా వ్యూహాత్మకంగా కదులుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లపై నజర్ పెట్టారు. అయితే సర్వేలు మాత్రం కొంత బీజేపీని కలవరపెడుతున్నాయి.

తాజాగా ఏబీపీ-సీ ఓటర్ ఒపినీయన్ పోల్ ఫలితాలు షాకిచ్చాయి. గుజరాత్ లోని 182 అసెంబ్లీ స్థానల్లో ఆమ్ ఆద్మీ కీలకంగా మారుతోంది. ఆప్ సీట్ల కంటే చీల్చే ఓట్లపైనే పలు రకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఆప్ సింగిల్ డిజిట్ లోనే సీట్లు సాధించినా.. బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతానికి గండి కొడుతుందని తేల్చారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 46.8 శాతం ఓట్లు , కాంగ్రెస్ కు 32.3 శాతం ఓట్లు వస్తే.. బీజేపీకి 135 నుంచి 143 సీట్లు వస్తాయని ఏబీపీ సర్వే తేల్చింది. కాంగ్రెస్ కు 36-44 స్థానాలు వస్తాయని తేలింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు పార్టీల నుంచి గణనీయంగా ఓట్లు చీలుస్తుందని.. తద్వారా బీజేపీ, కాంగ్రెస్ గెలుపోటములను నిర్ధేశిస్తుందని తేలింది. మరి ఇది జరిగితే బీజేపీకి మరోసారి అధికారంలోకి రావడం కష్టమని చెప్పొచ్చు. పంజాబ్ లలోగా ఏకపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ప్రజలు గుద్దినా మోడీ షాల ఆధిపత్యానికి గుజరాత్ లో తెరపడడం ఖాయమంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.