Begin typing your search above and press return to search.

ఆమంచితనమే అనుకుంటే వైసీపీకి షాకిస్తారా...?

By:  Tupaki Desk   |   22 Dec 2022 11:30 PM GMT
ఆమంచితనమే అనుకుంటే వైసీపీకి షాకిస్తారా...?
X
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడిగా ఆమంచి క్రిష్ణ మోహన్ ఉన్నారు. ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 నాటికి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి కూడా ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మాత్రం వైసీపీ వేవ్ ఉన్నా ఓడిపోయారు. చీరలలో పట్టున్న నేతగా ఆమంచి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయన వైసీపీలో ఇపుడు రగులుతున్నారని అంటున్నారు. ఆమంచితనాన్నే ఇంతదాకా చూశారు. ఇపుడు రెండవ వైపు కూడా చూస్తారు అని ఆయన అనుచరులు అంటున్నారుట.

నిజానికి ఆమంచి క్రిష్ణమోహన్ వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఆయన 2019 ఎన్నికలో ఓడిపోగానే టీడీపీ నుంచి సీనియర్ నేత కరణం బలరాం వచ్చి చేరారు. ఆయనకు ఈయనకూ మధ్య అసలు పడదు, దాంతో నాటి నుంచే క్రిష్ణమోహన్ పార్టీలో ఇబ్బందిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఏడున్నర పదుల వయసులో ఉన్న కరణం బలరాం తన రాజకీయ వారసుడు కరణం వెంకటేష్ కి చీరాల టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

వైసీపీ అధినాయకత్వం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆమంచి క్రిష్ణమోహన్ని పర్చూరు వెళ్లమని పార్టీ సూచిస్తోంది అని అంటున్నారు. పర్చూరు తాను ఎందుకు వెళ్లాలని, అక్కడ తనకు ఏమీ లేదని ఉన్న పలుకుబడి అంతా చీరాలలోనే ఉంది అని ఆమంచి తన అనుచరులతో అంటున్నట్లుగా భోగట్టా. దాంతో ఆయన చీరాల నుంచే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గట్టిగా చెబుతున్నారుట.

ఇక చీరాల వైసీపీలో ముచ్చటగా మూడు వర్గాలు ఉనాయి. ఎమ్మెల్సీ అయిన పోతుల సునీతది మరో వర్గంగా ఉంది. ఆమె సైతం వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్ధి అని ప్రచారం చేసుకుంటున్నారుట. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న ముగ్గురూ బలవంతులే మరి ఈ ముగ్గురికీ మధ్య టికెట్ తంటా ఉంది. ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన వారు పనిచేస్తారా అని కాదు పార్టీలో ఉంటారా అన్నదే డౌట్ గా ఉందిట.

ఇక ఆమంచి విషయం తీసుకుంటే బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన తన పట్టుని చాటుకోవడానికే చూస్తారని అంటున్నారు. అవసరం అయితే 2014లో మాదిరిగా ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగి సత్తా చాటుకుంటారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే చీరాల టికెట్ కరణం ఫ్యామిలీకి ఇవ్వడానికి అధినాయకత్వం చూస్తూండడంతో ఆమంచి వైసీపీకి గట్టి షాక్ ఇస్తూ ఇతర పార్టీల వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

ఆయన జనసేనలోకి వెళ్తారని కూడా టాక్ నడుస్తోంది. మరి టికెట్ దక్కకపోతే పోతుల సునీత తిరిగి టీడీపీలోకి వెళ్తారా అన్న ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి ముగ్గురూ కలసికట్టుగా ఉంటే ఇక్కడ వైసెపీకి విజయావకాశాలు ఉంటాయి. ఎవరి దారి వారిదే అయితే ఫ్యాన్ తిరగడం కష్టమే అంటున్నారుట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.