Begin typing your search above and press return to search.
కేసీఆర్ దారిలో జగన్ !
By: Tupaki Desk | 31 July 2022 1:30 AM GMTఇప్పటిదాకా భూముల రీ సర్వే తో అంతా మంచే జరుగుతుందని ఓ వాదన వినిపించింది. కానీ భూముల రీ సర్వే తో తరువాత జ రగబోయే పరిణామాలే ఆందోళన కలిగిస్తున్నాయని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇది సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆవేదన. కొన్ని చోట్ల సర్వేల పేరిట రెవెన్యూ శాఖ అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారట. వివరాల నమోదులో తాత్సారం చేస్తూ వస్తున్నారట.
మరికొన్ని చోట్ల రెవెన్యూ అధికారుల ఆడిందే ఆట, పాడిందే పాట.. అన్న విధంగా ఉందని జనసేన నేతలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అంతేకాకుండా రీ సర్వే తరువాత ప్రభుత్వ భూమి లెక్క ఒకటి తేలిపోవడం ఖాయం.
అటుపై సర్కారు వాటిని తమకు ఇష్టం వచ్చిన వారికి కేటాయించడమో లేదా తనఖా పెట్టి రుణాలు తేవడమో లేదా అమ్మేయడమో చేస్తారని తెలుగుదేశం ప్రజలను హెచ్చరిస్తోంది. అంటే తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సర్కారే దగ్గరుండి ప్రభుత్వ భూములను అమ్మకాలు చేసేందుకు సిద్ధం అవుతుందన్న మాట !
వాస్తవానికి సరిగా ఆదాయం లేని ఏపీకి అటు మద్యంతో అయినా, ఇటు భూముల అమ్మకంతో అయినా ఖజానాకు కాసులు చేరాలి. అందుకే ఇప్పటి కొత్త బార్ల లైసెన్సుల పేరిట డబ్బులు వెనకేసుకునేందుకు సిద్ధం అయింది. కేవలం దరఖాస్తుల రూపేణ 100 కోట్లకు పైగానే ఆర్జించింది.
ఇదే సమయాన భూముల అమ్మకానికీ సిద్ధం అవుతోంది. అంటే రీ సర్వే తరువాత విలువైన భూముల లెక్క తేలాక అటుపై రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకటి ప్రభుత్వం తరఫునే మొదలు కానుందా అన్న అనుమనాలను ప్రతిపక్షం వ్యక్తంచేస్తోంది. ఈ దశలో రీ సర్వేను వేగవంతం చే యాలని కలెక్టర్ల పై ఏపీ సర్కారు పెద్దలు ఒత్తిళ్లు తెస్తున్నారు.
రీ సర్వే తరువాత విలువైన భూములు పెద్దల ఖాతాలోకి చేరిపోవడం ఖాయం అని జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. వివరాలు రాయడంలో పారదర్శకత అన్నది లేనేలేదని, సర్వేయర్లే అంతా తామై కథ ఒకటి నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.