Begin typing your search above and press return to search.
జగన్ పాడిందే పాడారా...వాట్ నెక్స్ట్...?
By: Tupaki Desk | 15 Sept 2022 10:10 PM ISTఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మూడు రాజధానుల ఆవశ్యకత గురించి మాట్లాడారు. అన్ని ప్రాంతాలు తనకు సమానమే అని చెప్పుకున్నారు. అమరావతి మీద కోపం లేదు, విశాఖ మీద ప్రేమ అంతకంటే లేదు అని పవర్ ఫుల్ డైలాగు ఒకటి ఆయన వాడారు. ఇక అమరావతి అంతా కొందరి కనుసన్నలలోనే ఉందని, వారి పెత్తందారీతనమే సాగుతోందని చెప్పుకొచ్చారు.
ఇందులో నిందలే ఉన్నాయి. నిజాలు అయితే ఉన్నాయో లేవో దేవుడికే తెలియాలి. ఈ మాట ఎందుకు అంటే మూడేళ్ల క్రితం ఇవే మాటలను జగన్ అసెంబ్లీ సాక్షిగా చెబితే ఏపీ అంతా నోరు వెళ్లబెట్టుకుని చూసింది. కళ్ళు పత్తికాయల్లా చేసుకుని ఆర్పకుండా అంతా ఆలకించింది. అయితే గత మూడేళ్లుగా అమరావతి మీద అవినీతి ఆరోపణలు చేయడమే తప్ప ఒక్కటీ కూడా వైసీపీ ఎక్కడా నిరూపించలేకపోయారు.
పైగా వైసీపీ నేతలు విపక్షంలో ఏమీ లేరు. ఫుల్ మెజారిటీతో పవర్ ఫుల్ గా ఉన్నారు. అయినా సరే అక్కడ వైసీపీ వారు చెబుతున్నట్లుగా జగన్ స్వయంగా చెబుతున్నట్లుగా ఏదీ రుజువు అయితే చట్టప్రకారం అయితే కాలేదు. ఏమో జగన్ చెప్పినట్లుగా అమరావతి లో భారీ కుంభకోణం జరిగి ఉండవచ్చు అని తొలినాళ్ళలో జనం కూడా ఆసక్తిని ప్రదర్శించారు. కానీ ఆ తరువాత మాత్రం అది కాస్తా సన్నగిల్లింది.
ఇంకో వైపు అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు అంటే ఏపీలో చాలా మంది ఇదేదో బాగుంది అనుకున్నారు. ఇక విశాఖ రాయలసీమ వాసులు అయితే మా ఊరికే రాజధాని నడచి వచ్చిందని భావించారు. కానీ మూడేళ్ళుగా ఈ వ్యవహారం అంతా పడుతూ లేస్తూ సాగింది. చివరికి ప్రభుత్వం చట్టం కూడా తెచ్చి దాన్ని కోర్టు పరీక్షకు నిలువక ముందే రద్దు చేసుకుంది.
మరో వైపు హైకోర్టు సైతం అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్పు ఇచ్చింది. దాని మీద అయినా రివ్యూ పిటిషన్ వేయలేదు. సుప్రీం కోర్టులో ఈ తీర్పుని సవాల్ చేయలేదు ఇపుడు తాపీగా సుదీర్ఘమైన స్పీచ్ ని జగన్ కానీ మంత్రులు కానీ మూడు రాజధానుల గురించి వాటి ఆవశ్యకత గురించి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంది అన్న చర్చ వస్తోంది.
నిజానికి జనాలకు ఇపుడు ఎలాంటి ఆసక్తి ఈ విషయంలో లేదనే అంటున్నారు. ఏదో ఒక రాజధాని అని జనాలను విసిగించేలా రాజకీయం సాగడమే ఇక్కడ జరిగింది. దాంతో ప్రజలు చిర్రెత్తుకుని పోయారు. ఏది ఏమైనా అమరావతి విషయంలో వైసీపీ అకారణమైన ద్వేషంతో ఉందనే భావననే జనం నుంచి మూటకట్టుకున్నారు. ఇంకో వైపు అమరావతి వద్దు అని చెబుతున్నారు కానీ మూడు రాజధానులను ఎలా పట్టాలెక్కించాలో చెప్పడంలేదు. ఇలా నేల విడిచి సాము చేసే వైఖరి వల్ల వైసీపీకి రాజకీయంగా లాభం కంటే నష్టమే ఉందని అంటున్నారు.
దానికి బదులు హై కోర్టు తీర్పును గౌరవించి నాడే ఊరుకుంటే అమరావతి రైతుల్లో ఎంతో కొంత శాతం అయినా సానుభూతి దక్కేది అన్న మాట ఉంది. పోనీ రేపటి వ్యూహాలు ఏమైనా ఉంటే వాటిని దాచుకుని గమ్మున ఉన్నా కూడా వేరేగా కధ ఉండేది. కానీ గత ఏడాది మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరిచుకుంటూ జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్లనే రైతులు చట్టాన్ని రద్దు చేసినా తమకు భవిష్యత్తు భయాలు ఉన్నాయని చెప్పి కోర్టుల ద్వారా పోరాడారు.
మళ్లీ కొత్త చట్టం తెస్తామని జగన్ చెప్పడం వల్లనే పరిస్థితి ఈ రోజుకు ఇలా వచ్చింది అని అంటున్నారు. చివరికి హై కోర్టు తుది తీర్పు వచ్చేసింది. వైసీపీకి ఏం చేయడానికి కూడా లేకుండా ముకుతాడు పడింది అన్న భావన అయితే ఉంది. ఏది ఏమైనా ఇపుడు విపక్షమే కాదు స్వపక్షంలో కూడా వినిపిస్తున్న మాట ఏంటి అంటే ఏలిన వారు పాత పాటనే పదే పదే పాడుతున్నారని, దీని వల్ల అన్ని చోట్లా రాజకీయం చెడితే బాధ్యత ఎవరితో జవాబు తెలుసుగా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.