Begin typing your search above and press return to search.

అందుకే.. జ‌గ‌న్ పాల‌న‌పై అంత చ‌ర్చ‌..!

By:  Tupaki Desk   |   10 Sept 2022 8:00 AM IST
అందుకే.. జ‌గ‌న్ పాల‌న‌పై అంత చ‌ర్చ‌..!
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు భారీగానే ఆశ‌లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత‌.. కూడా ఆయ‌న ఏదైనా అద్భుతాలు చేసి చూపిస్తార‌ని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న ఏ ఒక్క అద్భుతాన్నీ ఆవిష్క‌రించ‌లేక పోయా రు. ఇప్ప‌టికి మూడేళ్లు గ‌డిచిపోయాయి. మ‌రో ఏడాదిన్న‌ర మాత్ర‌మే ఆయ‌న‌కు స‌మ‌యం ఉంది. చివ‌రి ఆరు మాసాలు కూడా.. ఎన్నిక‌ల‌కు కేటాయించే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. దీంతో ఆ స‌మ‌యం ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు.

అయితే.. ఇప్పుడు మిగిలిన స‌మ‌యంపై ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టెంత‌? అనేది ఇప్పుడు చ‌ర్చకు దారితీస్తోంది. భ‌విష్య‌త్తుపై ఏమాత్రం ఆయ‌న‌కు ధ్యాస లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో పింఛ‌న్ల‌ను ఠంచ‌నుగా 1వ తారీకునే ఇంటింటికీ పంపించారు.

అదేసమ‌యంలో అప్పులు చేసైనా సంక్షేమ ప‌థ‌కాలు ఆప‌డం లేదు. కానీ, ఈ అప్పులు తీర్చేది ఎవ‌రు? అనేదానికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ఇక‌, జ‌గ‌న‌న్న ఇళ్లు ఇచ్చినా.. నిధులు లేవు. దీంతో భ‌విష్య‌త్తు లో రాష్ట్ర ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఎక్క‌డా కూడా ఈ విష‌యా న్ని జ‌గ‌న్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం.. చేస్తున్న అప్పుల విష‌యంలో జ‌రుగుతున్న ర‌గ‌డ‌ను ప్ర‌స్తావించి.. త‌మ‌కు ఒక విజ‌న్ ఉంద‌ని.. అప్పులు తామే తీరుస్తామ‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రూ ఎలాంటి చింతా అవ‌స‌రం లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. ఇక‌, పారిశ్రామికంగా రాష్ట్రం ప‌ది అడుగుల మేర‌కు వెన‌క్కి వెళ్లిపోయింది. క‌రోనాకు ముందు.. త‌ర్వాత‌.. రాష్ట్ర ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఖ‌చ్చితంగా ఇది ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే అవుతుంది.

ఉపాధి, నిరుద్యోగ స‌మ‌స్య‌లు ఏపీని అల్లాడిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు యాగీ చేస్తున్నాయ‌నే వాద‌నను ప‌క్క‌న పెట్టినా.. వాస్త‌వం లో క‌నిపిస్తున్న‌ది కూడా అదే. దీనిపై కూడా సీఎం ఎలాంటి స్పందనా వ్య‌క్తం చేయ‌డం లేదు. రాష్ట్రానికి ఒక ద‌శ‌, దిశ నిర్దేశించామ ని.. దాని ప్ర‌కారం ముందుకు సాగుతామ‌ని.. ఆయ‌న ఎవ‌రికీ భ‌రోసా క‌ల్పించ‌లేక పోతున్నారు. అస‌లు జ‌గ‌న్ విజ‌న్ ఏంటో ప్ర‌జ‌ల‌కు వివ‌రించే నాయ‌కులు క‌న్ను పొడుచుకున్నా క‌నిపించ‌డం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.