Begin typing your search above and press return to search.
జనసేన నాలుగు స్తంభాలాట.. సక్సెస్ రేటు చెప్పుగురూ..!
By: Tupaki Desk | 4 Oct 2022 1:30 AM GMTవచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న జనసేన వ్యూహం ఏంటి? ఎలా ముందు కు సాగాలని నిర్ణయించుకుంది? అనుసరించే మార్గం ఏంటి? ఇదీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం. సోమవారం(అక్టోబరు 3) నుంచి జిల్లాల స్తాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రివ్యూలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు జనసేన ఎలా ముందుకు సాగుతుందనే విషయాలు ఆసక్తిగా మారాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం.. పవన్.. అక్టోబరు 5 దసరా నాటి నుంచి బస్సు యాత్ర ప్రారంభించి జోష్ నింపాలని అనుకున్నారు.
కానీ, కారణం లేకుండానే ఆయన బస్సు యాత్ర వాయిదా వేసుకుని.. జిల్లాల స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయిం చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం నుంచి జిల్లాల స్థాయి సమీక్షలకు రెడీ అయ్యారు. తొలుత మంగళగిరి నుంచే ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా.. వివిధ కారణాలతో హైదరాబాద్‌లోనే దీనిని నిర్వహించనున్నారు. అయితే.. ఇక్కడ సీనియర్లు చెబుతున్న వాదన ఒకటి తెరమీదికి వచ్చింది. కేవలం నాలుగు.. జిల్లాలపై గట్టి పట్టు పెంచుకుని.. మిగిలిన జిల్లాలను చూచాయగా డెవలప్ చేసుకుంటే సరిపోతుందనేది వారి వాదన.
మరికొందరు ఉమ్మడి జిల్లాల్లోని 7 జిల్లాలను ఎంపిక చేసుకుని.. పార్టీని డెవలప్ చేసుకుంటే పరిస్థితి మెరుగవుతుందని.. పార్టీ అధినేత దూకుడు క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని చెబుతున్నారు. సరే.. తొలిగా చెబుతున్న నాలుగు జిల్లాలను చూస్తే.. ఉమ్మడి పశ్చిమ, తూర్పు, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి విశాఖ.
ఈ నాలుగు జిల్లాల్లో 10 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని.. ముందుకు సాగాలని.. సీనియర్లు చెబుతున్నారు. అయితే.. మరికొందరు ఈ జిల్లాలకు తోడు.. ఉమ్మడి కృష్నా, గుంటూరు, చిత్తూరు జిల్లాలను కూడా కలపాలని.. అక్కడ కూడాపార్టీకి అభిమానులు మెండుగా ఉన్నారని అంటున్నారు.
దీంతో ఈ ఏడు జిల్లాలపైనా గట్టి ఫోకస్ పెట్టాలనే గళాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. నాలుగు జిల్లాల్లో అయినా.. గట్టి పట్టు పెంచాలని కోరుతున్నవారు కూడా ఉన్నారు. కనీసం 10-15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎటూ పోవు.. అన్న ధీమా వస్తే చాలని.. రెండు పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటే.. ఇక, పార్టీకి తిరుగులేదని.. మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం నుంచి జరగనున్న సమీక్షల పర్వానికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. సీనియర్లు ఎవరూ కూడా.. ఇతమిత్థంగా.. ఇదీ అని చెప్పుకుండా.. నిర్ణయాన్ని పవన్‌కే వదిలేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.