Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌ను చివ‌ర‌కు వాళ్లు కూడా న‌మ్మ‌ట్లేదా....!

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
జ‌న‌సేన‌ను చివ‌ర‌కు వాళ్లు కూడా న‌మ్మ‌ట్లేదా....!
X
ఇటీవ‌ల జ‌రిగిన ఒక ప‌రిణామం.. రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను కీల‌క‌మ‌లుపు తిప్పేస్తుంద‌ని అంద‌రూ అను కున్నారు. అంతేకాదు, ఆ రోజు రాత్రి అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు కూడా.. కాపు సామాజిక (సీమ లో బ‌లిజ‌)వ‌ర్గం నాయ‌కులు భేటీ అయ్యారు. జ‌న‌సేన‌ను బ‌ల‌పేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి కార‌ణం జ‌నసేన బీజేపీతో తెగ‌తెంపులు చేసుకుని, టీడీపీతో చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మైంద‌నే సంకేతాలు రావ‌డ‌మే.

అంతేకాదు, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ పేరిట రెండు పార్టీలూ కూడా భవిష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు కూడా ముందు కు వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి జ‌న‌సేన ఇక‌, బీజేపీతో ఉండ‌ద‌నే సంకేతాలు దాదాపు వ‌చ్చేశాయి. ఫ‌లితంగా చాలా మంది యువ‌త కూడా జ‌న‌సేన వైపు ఆక‌ర్షితుల‌య్యారు. మీడియా కూడా.. ఈ ప‌రిణామాన్ని స్వాగ తించింది. అయితే, ఇంత‌లోనే ప‌వ‌న్ ఢిల్లీకి వెళ్ల‌డం, బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుసుకున్నారు.

ఆ వెంట‌నే ప్ర‌ధాని మోడీ విశాఖ‌కు రావ‌డం, ఆయ‌న‌తోనూ ప‌వ‌న్ భేటీ కావ‌డంతో ప‌రిణామాలు వెంట‌వెం ట‌నే మారిపోయాయి. ఇక‌, ఈ భేటీ త‌ర్వాత‌.. అటు చంద్ర‌బాబు కానీ, ఇటు ప‌వ‌న్ కానీ, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌పై నోరు మెద‌ప లేదు. క‌లిసి ఉద్య‌మాలు చేస్తామ‌ని చెప్పిన నాయ‌కులు మౌనంగా ఉన్నారు. ఈ ప‌రిణామంతో న‌ష్ట‌పో యింది జ‌న‌సేనేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

``టీడీపీకి ఎలాంటి న‌ష్టం లేదు. ఎందుకంటే కొత్త‌గా చేరేవారికి జ‌న‌సేనలోనే ఖాళీలున్నాయి. అయితే, ఈ పార్టీపై విశ్వ‌సనీయ‌త రావ‌డం లేదు. లేక‌పోతే, పార్టీ ఇప్ప‌టికి బ‌లోపేతం అయ్యేది. ఏదేమైనా.. ఎన్నిక‌ల ముందు వ‌రకు ఇలానే ఉంటే క‌ష్టం`` అని కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు చెబుతున్నారు. సో, ఎలా చూసుకున్నా ఈ ఒక్క ప‌రిణామంతో వారంతా దెబ్బ‌కు వెన‌క్కిత‌గ్గార‌నేది వాస్త‌వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.