Begin typing your search above and press return to search.
ప్రత్యేక రాష్ట్రం... ధర్మాన వైసీపీని ముంచుతున్నారా...?
By: Tupaki Desk | 11 Jan 2023 4:30 PM GMTసీనియర్ మంత్రి ఆయన. ఇప్పటికి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన నాయకుడు. ఎన్నో సార్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు ఇపుడు జగన్ క్యాబినేట్ లో మరోసారి మంత్రి అయ్యారు. ఆయనకు కీలకమైన శాఖనే ఇచ్చారు. రెవిన్యూ మంత్రిగా టాప్ రేంజి పోర్ట్ ఫోలియోలో ధర్మాన వారు చేయాల్సింది చాలానే ఉంది.
కానీ గత కొన్ని నెలలుగా ఈ సీనియర్ మంత్రి మాత్రం తన శాఖ సంగతి పక్కన పెడితే ఉత్తరాంధ్రాకే తాను మంత్రిని అన్నట్లుగా మారిపోయారు అని అంటున్నారు. విశాఖ రాజధాని కావాలి అని కోరడం వరకూ ఒకే కానీ అమరావతిని రాజధానిగా చేస్తే మాకు ఉత్తరాంధ్రాను ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వాలని డిమాండ్ చేయడమేంటి అని అంటున్నారు.
అసలే ఏపీ విభజనతో చితికిపోయి అతీ గతీ లేకుండా ఉంది. ఈ టైం లో ఉత్తరాంధ్రా మూడు జిల్లాలతో కొత్త రాష్ట్రమేంటి మహానుభావా అని అంటున్నారు. పైగా ఈ విభజన రాజకీయాలు ఏంటి మహాప్రభో అని గట్టిగా తగులుకుంటున్నారు కూడా. నిన్నటికి నిన్న సీపీఐ నాయకుడు రామకృష్ణ అయితే ధర్మానను మంత్రి పదవి నుంచి తప్పించాలని కోరారు.
ఇపుడు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం నినాదం కేవలం ధర్మాన వారిదా లేక వైసీపీ అజెండానా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ వైసీపీ వారి నినాదం అదే అయితే అపుడు ఏపీ మొత్తం ప్రమాదంలో పడినట్లే అని ఆయన అంటున్నారు.
అలా కాదు ధర్మనా వారిదే ఆ నినాదం అయితే ఆయనను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయరని డిమాండ్ చేశారు. నిజానికి ధర్మాన పదే పదే ఈ డిమాండ్ చేస్తున్నారు. పోని ఒకసారి తడబాటో పొరపాటో అనుకుంటే అబ్బే అలాంటిదేమి లేదు నా వాయిసే ఇది. నా విధానమే ఇది అని అంటున్నారు.
పైగా నా గొంతు నొక్కినా పదవులు వదిలేసినా ఇదే నినాదం చేస్తూ పోతాను అని అంటున్నారు. అంటే మంత్రి గారు ఫిక్స్ అయిపోయే ఈ మాటలు అంటున్నారు అన్న మాట. తొలిసారి అంటే లైట్ తీసుకోవచ్చు కానీ ఆయన వరసబెట్టి ఇదే రకమైన స్టేట్మెంట్ ఇస్తూంటే మాత్రం ఆలోచించాలి కదా అని అన్న వారూ ఉన్నారు.
ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం చూసీ చూడనట్లుగా ఊరుకుంటే కచ్చితంగా అది వైసీపీ ప్రభుత్వ నినాదం అని కూడా అంతా భావిస్తారు అని బీజేపీ నేతలు అంటున్నారు. మరో వైపు చూస్తే ధర్మాన ప్రసాదరావు తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలను, భూ కబ్జా ఆరోపణలను మళ్ళించడానికి జనాల ఫోకస్ వేరేగా మార్చడానికే ఈ రకమైన వివాదాన్ని కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ కూడా ఏమీ తక్కువ తినలేదని అంటున్నారు. మూడు రాజధానుల పేరిట వైసీపీ ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తోందని అంటున్నారు. దానికి ఇపుడు తోడు అన్నట్లుగా ప్రత్యేక రాష్ట్రం నినాదాన్ని కూడా ముందుకు తెస్తోందని అంటున్నారు. మూడు రాజధానులకు జనాల నుంచి స్పందన రాకపోవడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం అంటున్నారు అని కూడా అనుమానిస్తున్నారు.
ఇక ధర్మాన ప్రత్యేక రాష్ట్రం దాకా వెళ్ళినా వైసీపీ అధినాయకత్వం ఏ మాత్రం మందలించకపోవడం, హెచ్చరించ్కపోవడం బట్టి చూస్తూంటే వైసీపీ కూడా మద్దతు ఇస్తొందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ధర్మాన అంటున్నా లేక వైసెపీఎ లైట్ తీసుకునా కొంప మునిగేది మాత్రం వైసీపీకే అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.