Begin typing your search above and press return to search.
చంద్రబాబు తడబడుతున్నారా? ఇలా అయితే ఎలా?
By: Tupaki Desk | 20 Nov 2022 4:30 AM GMTఔను.. టీడీపీ అధినేత చంద్రబాబు తడబడుతున్నారా? ఇప్పుడు ఈ చర్చ జోరుగా సాగుతోంది. మూడు రోజులువరుసగా కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకు అనూహ్యమైన స్వాగతాలు.. సత్కారాలతో పాటు అంతే రేంజ్‌లో నిరసన కూడా వ్యక్తమైంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపై అక్కడి న్యా యవాదులు చంద్రబాబును ప్రశ్నించారు. అయితే, దీనిపై ఎలాంటి సమాధానం చెప్పాలో చంద్రబాబు ఒకింత ఇబ్బంది పెడ్డారనే అనుకోవాలి.
అయితే.. ఈ క్రమంలోను.. తర్వాత కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆయన తడబడుతున్నారా? అనే చర్చకు దారితీస్తున్నాయి. పత్తికొండలో మాట్లాడిన చంద్రబాబు తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలన్నారు. ఇదే ఆఖరి ఎన్నికలని కూడా చెప్పారు. దీనిపై గ్రామీణ స్థాయిలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇది అంతో ఇంతోసెంటిమెంటును కలబోస్తుందని అనుకుంటున్న సమయంలో సడెన్‌గా చంద్రబాబు మాట మార్చారు.
టీడీపీని గెలిపించకపోతే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవారు ఎవరూ లేరన్నారు. ఇలా ఎందుకు ఆయన అన్నా రో కానీ, ఒకింత ఆవేశ పడ్డారనే వాదన అయితే వినిపిస్తోంది. ఎందుకంటే, ఒక పార్టీని, ఒక విధానా న్ని, ఒక వ్యక్తిని నమ్ముకుని ఏ రాష్ట్రంలోనూ ప్రజలు ఉండరు. అలా అనుకుంటే దేశంలో ఒకే పార్టీ ఉండాలి. ఒకే వ్యక్తి ఉండాలి. కాబట్టి.. ప్రజలు ఏ పార్టీని ఆదరించాలన్నా వ్యక్తులను ఆదరించాలన్నా విధానాలపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ క్రమంలో చంద్రబాబు విధానపరమైన పోరాటం ఎంచుకుని ప్రజల్లోకి వెళ్లడం వదిలేసి ఆవేశపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రయోజనం కన్నా ఇబ్బందే ఎక్కువగా ఉంటుందనేది పరిశీలకుల మాట. ఇక, చంద్రబాబు చేసిన లాస్ట్ ఛాన్స్ కామెంట్ విషయానికి వస్తే దీనిపై రావాల్సిన సింపతీ అయితే, ఇప్పటి వరకు రాలేదు.
ముఖ్యంగా పట్టణాల్లో దీనిపై చర్చిస్తున్నా, అనుకున్న సింపతీ రావడానికి సమయం పట్టేలా కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా ఎన్నికలకు సమయం ఉంది కనుక సంయమనం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.