Begin typing your search above and press return to search.

చంద్రబాబుని దగ్గరుండి గెలిపిస్తున్నారా...?

By:  Tupaki Desk   |   8 Jan 2023 12:30 AM GMT
చంద్రబాబుని దగ్గరుండి గెలిపిస్తున్నారా...?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాళ్ళకు బలంపం కట్టుకుని ఏపీ అంతా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అంటూ ఒక ఎమోషనల్ కార్డ్ ని కూడా ఆయన ఒక దశలో వాడారు. ఏపీలో 2024 ఎన్నికలు తెలుగుదేశానికి అతి ముఖ్యమైనవి. ఈసారి గెలుపు పిలుపు అందుకోకపోతే తెలుగుదేశానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి.

దాంతో గతానికి భిన్నంగా బాబు కొత్త వ్యూహాలతో జనాలలోకి వెళ్తున్నారు. ఆయన టూర్లలో జనాలు బాగా వస్తున్నారు అన్న ప్రచారం ఒక వైపు ఉంది. అయితే ఇరుకు సందులలోకి జనాలకు తీసుకువెళ్ళి బాబు అక్కడ డ్రోన్ కెమెరా షాట్స్ ని తీసి అనుకూల మీడియా ద్వారా జనాలను మభ్యపెడుతున్నారు అని వైసీపీ అభియోగం. ఇక కందుకూరు, గుంటూరు సభలలో మొత్తం పదకొండు మంది దాకా ప్రజలు బాబు సభలకు వచ్చి ప్రాణాలను కోల్పోయారు.

దాంతో వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1 పేరిట ఏపీలో రోడ్ షోలను వద్దు అంటూ రద్దు చేసింది. ఎవరైనా సభలను మైదానాలలో పెట్టుకోవాలని సూచించింది. దీని మీద ఇపుడు రాజకీయ రగడ సాగుతోంది. ఈ టైంలో చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఆయన ప్రచార రధంలోకి కుప్పం వస్తే పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు వెనక్కి తగ్గుతారా.

తనను జనంతో కలవనీయడంలేదని చెప్పి ఏకంగా గడప గడపకూ పాదయాత్ర చేపట్టారు. తాను సొంత నియోజకవర్గం ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వస్తే తనను కట్టడి చేస్తున్నారు అని వాపోయారు. దాంతో కాలి నడకన బాబు కుప్పం వీధులలో తిరగడంతో ఆయనకు ఎక్కడలేని సానుభూతి వచ్చి పడుతోంది. బాబు పాదయాత్రల ఎత్తుగడ ద్వారా నేరుగా ప్రతీ గడపకూ రీచ్ అవుతున్నారు.

ఇది వైసీపీ సర్కార్ ఊహించని సంఘటన కావడంతో ఖంగు తిన్నట్లు అయింది. ఇక ఎన్నడూ లేనిది కాలి నడకన బాబు తమ వీధులకు రావడంతో జనాలు పోటెత్తారు. అంతే కాదు ఆయనకు సానుభూతి కూడా పెరిగింది. దీంతో కావాలనె వైసీపీ ప్రభుత్వం బాబుని కుప్పంలో దగ్గరుండి గెలిపిస్తోందా అని అంటుననరు. నిజానికి కందుకూరు, గుంటూరులలో జరిగిన మరణాలతో చంద్రబాబు మీద ఆయన పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది.

కానీ సరైన సమయంలో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేని వైసీపీ సర్కార్ జీవో నంబర్ 1 ని తెచ్చి మొత్తం పోగొట్టుకుంది. అదే విధంగా బాబు టూర్ ని పోలీసులు కట్టడి చేస్తున్నారు అన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. దాంతో చంద్రబాబుకు సింపతీ బాగా వచ్చేసింది. ఇలాగే కనుక వైసీపీ సర్కార్ వ్యవహరిస్తే బాబుకు సింపతీ టాప్ రేంజిలో పెరగడం ఖాయమని అంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ చంద్రబాబు మరిన్ని పర్యటనలను కూడా చేపడతారు అని అంటున్నారు.

అపుడు కూడా ఇలాగే చేస్తే ఆయన్ని జనాల వద్దకు నేరుగా చేరువ చేసే బాధ్యతను వైసీపీ స్వీకరించినట్లు అవుతుంది అంటున్నారు. అలా కాకుండా బాబు మానాన ఆయన్ని వదిలేస్తే టూర్ చేసుకుని వెళ్ళిపోయేవారు అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు ట్రాప్ లో వైసీపీ సర్కార్ చిక్కుకుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.