Begin typing your search above and press return to search.

ప‌ల్లెల్ని ప‌ల‌క‌రించ‌ని తెలుగుదేశం.. క‌ష్టమేనా..?

By:  Tupaki Desk   |   1 Oct 2022 3:30 PM GMT
ప‌ల్లెల్ని ప‌ల‌క‌రించ‌ని తెలుగుదేశం.. క‌ష్టమేనా..?
X
ఒక‌ప్పుడు.. టీడీపీ అంటే.. పట్ట‌ణాలు.. న‌గ‌రాలుతో పాటు.. ప‌ల్లెలు కూడా పార్టీ జాబితాలో ఉండేవి. ఇది.. పార్టీకి క‌ల‌సి వ‌చ్చింది. ముఖ్యంగా అన్న‌గారు టీడీపీని ప్రారంభించిన‌ప్పుడు.. చైత‌న్య ర‌థాన్ని ప‌ల్లెప‌ల్లె ల‌కు తిప్పారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రించారు. ఫ‌లితం ఏంటో తెలిసిందే. అయితే.. ఇప్పుడు అంత అవ‌స‌రం లేకున్నా.. గ్రామీణ స్థాయిలో నాయ‌కుల‌ను చైత‌న్యం చేస్తే.చాలు. కానీ, చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. నాయ‌కులు ప‌దే ప‌దే వ‌దిలేస్తున్నారు.

``మీనియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తిగ్రామంలోనూ.. మన పార్టీ జెండా ఎగ‌రేలా.. చూడాలి. దీనికి మీరు ఏం చేస్తా రో.. నాకు.. తెలియ‌దు.. కానీ.. జ‌రిగితీరాలి!`` ఇదీ.. ఈ ఏడాది మ‌హానాడు సంద‌ర్భంగా..చంద్ర‌బాబు చేసిన దిశానిర్దేశం.. అంత‌కు మించిన ఆదేశం కూడా.

కానీ, ఎంత మంది నాయ‌కులు పాటించారంటే.. చెప్ప‌డా నికి చాన్సే లేదు. దీంతో గ్రామీణ స్థాయిలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌.. ఏంటంటే.. వ‌చ్చే నెల‌లో జ‌గ‌న్ ఏ ప‌థ‌కం ఇస్తున్నాడు?

వ‌చ్చే నెల‌ల‌తో త‌మ పింఛ‌న్లు పెరుగుతాయా? ప్ర‌స్తుతం అమ‌లు చేసిన‌ప‌థ‌కం నీకు వ‌చ్చిందా? లేదా? ఇదీ.. ఈ త‌ర‌హా మాటలే.. ప్ర‌జ‌ల మ‌ధ్య చర్చ‌కు వ‌స్తున్నాయి. ఇది ముమ్మాటికీ నిజం. ఎవ‌రు కాద‌న్నా.. ఇదే నిజం. ఎందుకంటే.. గ్రామీణ స్థాయికి వైసీపీని తీసుకువెళ్ల‌డంలో జ‌గ‌న్ సంపూర్ణంగా స‌క్సెస్ అయ్యా రు. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. `అరె.. నీకు భ‌రోసా వ‌చ్చిందా?` అనో.. ``ఇదిగో అమ్మాయ్‌.. అమ్మ ఒడి డ‌బ్బులు ఏం చేశావ్‌`` అనో.. చ‌ర్చే జ‌రుగుతోంది త‌ప్ప‌..మ‌రొక‌టి క‌నిపించ‌డం లేదు.

ఇంత‌గా వేళ్లూనుకుపోయి.. టీడీపీ ఓటు బ్యాంకును దోచేసుకుంటున్న వైసీపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు.. టీడీపీలో మ‌చ్చుకు కూడా క‌నిపించ‌డం లేదు. ఒక్క పరుచూరు.. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావు.. రైతుల‌కు కొంత మేలు చేస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మాట అక్క‌డ వినిపిస్తోంది త‌ప్ప‌.. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేల గ్రామాల్లో ఎక్క‌డా టీడీపీ జెండా క‌నిపించ‌డం లేదు.. వారిఊసు వినిపించ‌డం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.