Begin typing your search above and press return to search.
ఈ సారీ.. వీరికి టికెట్ సారీనే.. చేజేతులా చేసుకున్నారే..!
By: Tupaki Desk | 8 Jan 2023 2:30 AM GMTగత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. కోరుకున్న స్థానంలో అవకాశం లేదని తేలిపోవడంతో పార్టీలపై అలిగారు. ఎవరికివారు.. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారారు. అయితే.. ఇప్పుడు ఇలాంటి వారి పరిస్థితి ఏమైనా మెరుగైందా? కనీసం వచ్చే 2024 ఎన్నికల్లో అయినా.. టికెట్ లభిస్తుందా? అంటే.. ఉత్త చేతలే కనిపిస్తున్నాయి. దీనికి కారణం..ఇప్పుడు కూడా వీరి పరిస్థితి అంతే.. అలానే ఉండడం.
వారే.. విజయవాడకు చెందిన కీలకమైన నాయకులు.. వంగవీటి రాధా, యలమంచిలి రవి, ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన అత్తర్ చాంద్ బాషా వంటివారు.. గత ఎన్నికల్లో పార్టీ మారారు. ముఖ్యంగా రాధా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తే.. రవి.. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. అయితే.. ఇద్దరికీ గత ఎన్నికల్లో టికెట్ రాలేదు. అంతేకాదు.. తర్వాత కూడా ఎలాంటి హామీ దక్కలేదు.
ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల విషయానికి వస్తే.. అదే పరిస్థితి కొనసాగుతోంది. విజయవాడ సెంట్రల్ కోరుకున్న రాధా.. వైసీపీ ఇవ్వననేసరికి.. టీడీపీ బాటపట్టారు. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ దక్కే పరిస్థితి లేదు. ఇక, రవి.. తూర్పు కోరుకున్నారు కానీ టీ డీపీ కుదరదనేసరికి వైసీపీ బాట పట్టారు. ఇప్పుడు ఇక్కడ దేవినేని అవినాష్‌కు ఖరారు చేశారు. సో.. ఎటూ కాకుండా పోయారు.
ఇక, కదిరి ఎమ్మెల్యేగా ఉన్న చాంద్ బాషా 2017-18 మధ్యటీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కలే దు. ఇక, ఇప్పుడు కూడా టీడీపీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈయన పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే మారింది. ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ.. అప్పట్లో మంచి ఫైర్ అయిన నాయకుల్లో వీరు ఉన్నారు. దీంతో వీరి విషయం మరోసారి చర్చకు వస్తోంది. మరి వీరి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.