Begin typing your search above and press return to search.
వైసీపీ పక్కా వ్యూహం... గ్రామం దాకా భారీ సైన్యం
By: Tupaki Desk | 31 Aug 2022 3:30 PM GMTఅధికారంలోకి ఒకసారి వస్తే మళ్లీ మళీ కొనసాగాలని ఉంటుంది. ఇపుడు వైసీపీ కూడా అలాగే ఆలోచిస్తోంది. ఒక్క చాన్స్ అని పవర్ పట్టేసిన వైసీపీ రెండవ చాన్స్ కోసం కూడా తనదైన వ్యూహాలను రూపొందిస్తోంది. ఇందుకోసం పాత కొత్త వ్యూహాలను మేళవించి మరీ పార్టీని పరుగులు తీయించాలనుకుంటోంది.
ఏపీలో వైసీపీకి గ్రాస్ రూట్ లెవెల్ దాకా క్యాడర్ చాలా ఉంది. అయితే ట్రెడిషనల్ పొలిటికల్ వార్ ఇపుడు కుదరదు, గత మూడు ఎన్నికల నుంచి సీన్ మొత్తం మారింది. సోషల్ మీడియాదే ఇపుడు పై చేయి. దాంతో తన క్యాడర్ ని ఆ దిశగా కన్వర్ట్ చేసే అతి పెద్ద పనిలో పార్టీ ఇపుడు ఉంది. పార్టీకి ఉన్న కార్యకర్తలను సోషల్ మీడియా వైపుగా నడిపించడం ద్వారా మరోసారి అద్భుతమైన ఫలితాలను అందుకోవాలని చూస్తోంది.
ఇక వైసీపీకి సోషల్ మీడియా చేసిన మేలు ఇంతా అంతా కాదు, 2019 ఎన్నికల్లో పార్టీకి అసలైన ప్రచారం అంతా సోషల్ మీడియాలోనే జరిగింది. చేతిలో ఫోన్ ఉన్న ప్రతీ వారి బుర్రలోకి వైసీపీని సోషల్ మీడియా యాక్టివిస్టులు జొరబెట్టేశారు. ఇపుడు కూడా అదే రకంగా పార్టీని జనాలలో ఉంచాలని, తాము ప్రభుత్వంలో ఉంటూ చేసిన కార్యక్రమాలను కూడా జనంలో ఉంచాలని చూస్తోంది వైసీపీ.
అందుకోసం సోషల్ మీడియా సైన్యాన్ని ఏపీ అంతటా భారీ ఎత్తున తయారు చేయడానికి చూస్తోంది. ప్రతీ జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. అలాగే వారికి సహాయకులుగా నలుగురేసి వంతున జిల్లాలలో కో సమన్వయకర్తలను నియమించనున్నారు. ఈ మేరరకు పార్టీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది అని అంటున్నారు.
అంతే కాదు ప్రతీ నియోజకవర్గం నుంచి అలాగే ప్రతీ గ్రామం నుంచి కూడా సోషల్ మీడియాలో వైసీపీ ప్రాతినిధ్యం ఉండేలా చర్యలను తీసుకుంటున్నారు. అంటే అతి పెద్ద సైన్యమే ఇపుడు వైసీపీ తరఫున రంగంలోకి దిగుతుంది అన్న మాట. దీని ద్వారా పార్టీ గురించి ప్రభుత్వం గురించి సానుకూలంగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకుపోవడం ద్వారా వైసీపీకి మరోసారి విజయాన్ని దక్కించుకోవడానికి పార్టీ ఈ ప్లాన్ వేసింది అంటున్నారు.
మరో వైపు చూస్తే సోషల్ మీడియాలో ఇప్పటికే టీడీపీ దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ ఎటూ సినిమా నటుడు, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దది. సోషల్ మీడియాలో జనసేన కెవ్వు కేక అనిపించే లెవెల్ లోనే సాగుతోంది. ఇపుడు వైసీపీ కూడా తన వాటాను అందుకోవాలని చూస్తోంది. అయితే గతంలో జరిగినట్లుగా ఈసారి జరుగుతుందా అంటే ఎవరూ చెప్పలేరు అనే అంటున్నారు.
అప్పట్లో టీడీపీ మీద వ్యతిరేకత కాస్తా వైసీపీకి వరం అయింది. దాంతో వైసీపీ సోషల్ మీడియా ఎంత దూకుడు చేసినా దానికి తగినంతనా ఫలితమూ దక్కింది. ఈసారి అధికారంలో ఉన్న పార్టీ రంగంలోకి దిగుతోంది. సోషల్ మీడియాలో ఎంతలా చెలరేగినా దానికి తగిన కౌంటర్లూ పంచులు కూడా రెడీగా ఉంటాయి. మరి దాన్ని కూడా ఎదుర్కొనేలా వైసీపీ సైన్యం సిద్ధంగా ఉంటేనే ఆ పార్టీకి ఏమైనా రాజకీయ లాభం కలుగుతుంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.