Begin typing your search above and press return to search.
ఆరు నెలలలోనే వైసీపీ గ్రాఫ్ డౌన్.... మ్యాటరేంటంటే...?
By: Tupaki Desk | 8 Sep 2022 2:30 AM GMTఏపీలో ఇపుడు ఎన్నికలు అంటూ లేవు. కానీ ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ ఓడుతుంది అన్నదే చర్చ. ఇక సర్వేలు ఎవరివి వారివి వస్తున్నాయి. రాజకీయ పార్టీలు సొంతంగా ఏజెన్సీలను పెట్టుకుని సర్వేలు చేయించుకుంటున్నాయి. అవి కాన్ఫిడెన్షియల్ అని చెబుతున్నా తమకు ఏమైనా ఆశావహంగా ఫలితాలు ఉంటే వారే లీక్ చేస్తున్నారు. అయితే ఏ సర్వే అయినా చేయించిన వారికి ఎంతో కొంత ఫేవర్ గానే ఫలితాన్ని చెబుతుంది. అది కూడా ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల టైం ఉంది. ఈ ప్రభుత్వంతో పని చాలా ఉంది.
అందువల్ల సర్వేలలో జనాలు ఇపుడు చెప్పిన మాటలు ఎన్నికల టైం కి ఉండవు అని కూడా చెబుతూ ఉంటారు. 2024 జనవరి ఫిబ్రవరి మధ్య నెలలలో కనుక సర్వేలు చేస్తే అవే కచ్చితమైన నివేదికలు ఇస్తాయి అన్నదే వాస్తవం. అప్పటికి అధికార పార్టీలోని వారు కూడా గటగటా నిజాలు చెప్పేస్తారు. ఎందుకంటే ఒక వైపు ఎన్నికలకు టైం దగ్గరపడిపోతుంది కాబట్టి. ఇదిలా ఉంటే సర్వేలు అని కాదు కానీ జనాలు వారి మాటలు వారి నిర్వేదం నిరాశ వంటివి చూస్తే ప్రభుత్వం మీద వారి అభిప్రాయం ఏంటి అన్నది ఎంతో కొంత తెలుస్తుంది.
అలా కనుక అనుకుంటే ఏపీలో వైసీపీ సర్కార్ మీద జనాల ఆలోచనలు వేరేగా ఉన్నాయని అనుకోచ్చు. ఏపీలో వైసీపీ ఏదో చేస్తుంది అన్న ఆశలు అయితే మొదట్లో ఉన్నాయి. దానికి తగినట్లుగా హైప్ అయితే క్రియేట్ అయింది. తొలి ఆరు నెలలు తమను కొట్టే మొనగాడు ఎవరూ లేడు అన్నట్లుగానే వైసీపీ సర్కార్ ఆర్భాటంగా అనేక పధకాలు ప్రవేశపెట్టింది. దాంతో అపుడు అంతా ఫీల్ గుడ్ అనే అనుకున్నారు
అయితే కరోనా వచ్చాక సీన్ కొంత చేంజి అయింది. అయినా సరే ఇది విశ్వ విపత్తు. దాంతో ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించారు. ప్రభుత్వం కూడా తమకు తోచిన విధంగా కరోనా టైం లో చేసింది. ఆ విషయంలో సంక్షేమానికి కొన్ని ప్లస్ పాయింట్లే వచ్చాయి. ఇలా రెండేళ్ళ పాటు కరోనా తినేసింది. చూస్తూండగానే మూడవ ఏడాది వచ్చింది. దాంతో పాటు కరోనా ప్రభావం కూడా తగ్గింది
అపుడు అభివృద్ధి అన్నది జనాలకు గుర్తుకు వచ్చింది. ఈ మధ్యలో ఏపీ రాజధాని వివాదం కూడా గుర్తుకు వచ్చింది. ఇంకో వైపు పేరుకుపోయిన అప్పులు కొత్తగా తెస్తున్న అప్పులు కూడా జనాలలో చర్చకు వచ్చాయి. పాడైన రోడ్లు, గుంతలు పడిన రహదారులు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపించాయి. దానికి తోడు విపక్షాలు జనాలలోకి వెళ్ళడంతో కొంత ప్రజల మూడ్ బయటకు వచ్చింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయంగా మరో ఎత్తు ఏంటి అంటే మంత్రివర్గాన్ని మార్చడం.
గతంలో ప్రభుత్వం ఎన్ని చేసినా వాటి మీడియాకు మంచి మేత పెట్టే బ్యాచ్ మంత్రులలో ఉండేదన్న అభిప్రాయం ఉంది. కనీసంగా అరడజన్ మంది మంత్రులు గట్టిగా ఉండేవారు. దాంతో పాటు విపక్షం చేసే విమర్శలను ఖండించే వారు కూడా ఎక్కువగా ఉండేవారు. ఈ విధంగా చేయడం వల్ల విపక్షం వాదన పూర్తిగా జనాలలోకి పోకుండా నిలువరించేవారు. కానీ ఆరు నెలలుగా చూస్తే సీన్ మారింది.
అధికార పక్షం వాయిస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. కొత్త మంత్రులుగా పాతిక మంది ఉన్నారు. కానీ ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు ఒకరిద్దరు తప్ప. ఇక దీంతో పాటు మాజీలు అయిన వారు ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇంకో వైపు మూడేళ్ల పాలన తరువాత సొంత పార్టీ మీద క్యాడర్ నుంచి కూడా అసంతృప్తి బాగా వ్యక్తం అవుతోంది. వారిని సర్దిపుచ్చి ముందుకు నడిపించేవారు లేరు. పార్టీ పదవులు పంచినా బాధ్యతలు స్వీకరించిన వారు అయితే గట్టిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు.
మొత్తానికి మంత్రివర్గ విస్తరణ విషయంలో వైసీపీ హై కమాండ్ చేసిన కొన్ని తప్పులు పొరపాట్ల వల్ల నోరున్న మంత్రులు లేకుండా పోయారు అన్నది వినిపిస్తోంది. అదే టైం లో విపక్షం కూడా గట్టిగా పుంజుకుంది. ఇంకో వైపు కేంద్రంలోని బీజేపీ కూడా సమయం చూసి ఏపీలో తన గేమ్ స్టార్ట్ చేసింది. గతంలో మాదిరిగా అప్పులు తెచ్చుకోవడానికి వెసులుబాటు కూడా లేదు అన్నదీ ఉంది. ఇక ఏపీలో విపక్షాలు అన్నీ ఏకం అయితే వైసీపీ గద్దె దిగడం ఖాయం అన్న భావన అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. తరచూ వస్తున్న పొత్తుల వార్తలు కూడా సంచలనం రేకెత్తిస్తున్నాయి.
ఇక ఏపీలో మూడేళ్ళు దాటిన వైసీపీ పాలన చూస్తే కొత్తగా మెరుపులు మెరిపించడానికి ఏమీ లేదని తేలిపోవడంతో కూడా అన్ని వైపుల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది అంటున్నారు. దాంతో సర్వేలు పక్కన పెడితే గడచిన ఆరు నెలల కాలమే వైసీపీ ఇమేజిని డ్యామేజి చేసింది అని అంటున్నారు. మరి ఈ పరిస్థితిని అధికార పక్షం ఎలా సర్దుకుంటుందో అన్నదే ఇపుడు చర్చగా ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.