Begin typing your search above and press return to search.
లేపేదెలా సామీ : హైప్ వచ్చినట్లే వచ్చి...?
By: Tupaki Desk | 15 July 2022 12:30 AM GMTఏపీలో చూస్తే దగ్గరలో ఏ ఎన్నిక కూడా లేదు. షెడ్యూల్ ప్రకారం తీసుకున్నా సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా 20 నెలలు ఉంది. దాంతో అధికార పక్షం సంగతి పక్కన పెడితే విపక్షాలు బండి ఎలా లాగాలీ అన్న బెంగతో ఉన్నాయి. ఆ మధ్యదాకా సైలెంట్ గా ఉన్న విపక్ష శిబిరంలో నెమ్మదిగా కలకలం రేగింది. బాదుడే బాదుడు అంటూ మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రారంభించిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు అదే జోరు కంటిన్యూ చేస్తూ మహానాడు నిర్వహిస్తే అది బ్రహ్మాండమైన హిట్ అయి కూర్చుంది.
ఇక మనమే వచ్చేస్తున్నాం, తిరుగులేదని టీడీపీ భావించింది. దానికి ధీటుగా వైసీపీ తాజాగా ప్లీనరీని గుంటూరులో నిర్వహించింది. ప్లీనరీకి మహనాడుకు రెట్టింపు జనాలు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల దాకా వచ్చారని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఈ లెక్క ఎవరూ కట్టకపోయినా ప్లీనరీకి మంచి స్పందన లభించింది. జనమే జనంగా ఎక్కడ చూసినా కనిపించారు. దాంతో టీడీపీ జోరుకి అలా వైసీపీ వ్యూహాత్మకంగా బ్రేకులు వేసిందనుకోవాలి.
దాంతో మళ్లీ కధ మొదటికి వచ్చింది. ఏపీలో వైసీపీకి బలం చెక్కుచెదరలేదని, క్యాడర్ వానలో సైతం గంటల తరబడి నిలబడి మరీ ప్లీనరీ స్పీచులను విందని, ఇది చాలదా తమ కమిట్మెంట్ చాటుకోవడానికి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో ఎపుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ విజయం ఖాయం అని కూడా వారు ఢంకా భజాయిస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో రాజకీయంగా మార్పు ఉందా లేదా అని ఆలోచించే నేతలు, జంపింగ్ జఫాంగులు కూడా ప్లీనరీ తరువాత సైలెంట్ అయిపోయారు. వైసీపీలో కొంత అసంతృప్తి ఉంది అన్న మాట అయితే ఇప్పటిదాకా వినిపించింది. అయితే వారు సైతం కాస్తా ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది అంటున్నారు.
మొత్తానికి చూస్తే ఇదే కన్ ఫర్మ్ కాకపోయిన టీడీపీకే ఏపీలో మొగ్గు వచ్చేది మా సర్కారే అని గర్జించిన పసుపు దళానికి ప్లీనరీ నోటికి అడ్డం పడింది అని అంటున్నారు. దీంతో ఏపీలో వైసీపీ గ్రాఫ్ తగ్గింది అని చూపించడానికే కొన్ని సర్వేలు వదిలారు అని అంటున్నారు. అయితే ఈ సర్వేల విశ్వసనీయత మీద వైసీపీ లేవనెత్తిన ప్రశ్నకు కొంత లాజిక్ గానే ఉన్నాయి.
పట్టుమని పదిరోజులు కూడా సీఎం కుర్చీలో కూర్చోని షిండేకి దేశంలో పనిమంతుడైన ముఖ్యమంత్రిగా అత్యుత్తమ ర్యాంకింగ్ రావడం పైన వైసీపీ సంధించిన ప్రశ్నతో సర్వే విషయంలో చర్చ మొదలైంది. ఇక ఈ సర్వే చేసిన సంస్థ మీద కూడా వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ గ్రాఫ్ తగ్గలేదు అని వైసీపీ చెప్పుకుంటోంది. అదే టైమ్ లో రానున్న రోజుల్లో ఇలాంటి సర్వేలు మరిన్ని రావచ్చు అని అంటున్నారు.
ఏపీలో వైసీపీ పని అయిపోయింది అని చెప్పే సర్వేలు అవతల వైపు నుంచి వస్తే దానికి ధీటుగా ఇవతల వైపు నుంచి వచ్చేది మేమే వైసీపీకి అంతా బాగుంది అనే సర్వేలు కూడా పోటీగా వస్తాయని అంటున్నారు. ఇక ఈ సర్వేల యుద్ధం అయితే మొదలైపోయినట్లే. ఇక ఇంకో వైపు అధికార వైసిపీ, విపక్ష టీడీపీలు తమకే వేవ్ ఉంది అన్న దాన్ని ఇపుడు ఎలా నిలబెట్టాలి ఈ టెంపోని ఎలా కంటిన్యూ చేయాలి అన్నదే అతి పెద్ద సమస్యగా మారింది.
ఈ సవాల్ ని కనుక ధీటుగా ఎదుర్కోని ముందుకు సాగితేనే ఏపీలో పొలిటికల్ గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏది ఏమైనా జనాలు వచ్చినా అది కొలమానం కాదు, సర్వేలు చెబితే అవి భోగస్ అని అంటారు. ఇంకో వైపు చూస్తే ఎవరికి వారు మేమే బలవంతులమని జబ్బలు చరుస్తారు. మరి జనాభిప్రాయం ఎలా తమ వైపునకు మళ్ళించుకోవడం అంటే కొత్త టెక్నిక్కులు కనిపెట్టడమే. అవి ఏమిటన్నవి రాను రానూ పోనూ పోనూ ఏపీ జనాలే చూస్తారు మరి.