Begin typing your search above and press return to search.

అమరావతిపై ఉన్న పట్టు హోదాపై లేదా... వైసీపీకి కొత్త కౌంటర్

By:  Tupaki Desk   |   16 Sept 2022 8:00 AM IST
అమరావతిపై ఉన్న పట్టు హోదాపై లేదా... వైసీపీకి కొత్త కౌంటర్
X
నిజ‌మే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఆ పార్టీ నాయ‌కులు .. తాము చెబుతున్న మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నార‌నేది క‌ళ్ల‌కు క‌నిపిస్తున్న వాస్త‌వ‌మే. మ‌రి.. ఇదే స‌మ‌యంలో వైసీపీ ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా.. అనేక హామీలు ఇచ్చింది. అనేక ప్ర‌క‌ట‌న‌లు చేసింది. మ‌రి వాటి విష‌యం మాటేంటి? అనేది ఇప్పుడు ప్ర‌స్తావ‌నార్హం. ఎందుకంటే.. ప్ర‌త్యేక‌హోదా, పోల‌వ‌రం నిధులు.. వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి నిధులు.. ఇలా.. అనేక హామీలు గుప్పించారు.

ఇక‌, ఉద్యోగుల‌కు సీపీఎస్ ర‌ద్దు అనే సంచ‌ల‌న హామీ కూడా ఇచ్చారు. వీటివిష‌యాన్ని మ‌రిచిపోయిన‌.. వైసీపీ నాయ‌కులు.. 2020లోరాత్రికిరాత్రి వ‌చ్చిన మూడు రాజ‌ధానుల క‌ల‌ను సాకారం చేసుకునేందుకు మాత్రం ప‌ట్టుబ‌డుతుండ‌డమే ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌కు దారితీస్తోంది. జ‌గ‌న్ ఒక సంద‌ర్భంలో ఎన్నిక ల‌కు ముందు.. ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రం స‌ర్వతోముఖాభివృద్ధికి.. ప‌రుగులు పెట్ట‌డానికి.. ప్ర‌త్యేక హోదానే సంజీవ‌ని అని ప్ర‌క‌టించారు.

మ‌రిఇది నిజ‌మైన ప‌క్షంలో.. మూడు రాజ‌ధానుల‌తో ప‌నేముంది? అనేది ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే.. హోదా ఒక్క‌టి సాధిస్తే.. ఆటోమేటిక్‌గా.. ఎ వ‌రికీ.. ఇబ్బంది లేకుండా.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట‌లో ప‌య‌నించేలా చేయొచ్చుక‌దా! అంతేకాదు.. మూడు ప్రాంతాల్లోనూ డెవ‌ల‌ప్ మెంట్ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉందిక‌దా.. అంటున్నారు. అయితే... ఈ విష‌యాన్ని మ‌రిచిపోయారు. ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా చ‌ర్చించాలి.

మూడు రాజ‌ధానుల విష‌యంలో ప్ర‌జ‌లు ఎలా ఉన్నార‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అమ‌రావ‌తి రైతులు.. పాద‌యాత్ర గా వ‌స్తుంటే.. హార‌తులు ప‌డుతున్న ప్ర‌జ‌లు.. మూడు రాజ‌ధానుల డిమాండ్‌తో వ‌స్తున్న వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డా హార‌తులు ప‌ట్ట‌డం లేదు. పైగా విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. అంతేకాదు.. ఒక‌ప్పుడు.. ప్ర‌త్యేక హోదా కోసం.. పిలుపునిస్తే.. యువ‌త క‌దిలి వ‌చ్చారు. కానీ, మూడు రాజ‌ధానులు అంటే.. ఎవ‌రూ కిమ్మ‌న‌డం లేదు. క‌నీసం.. ప‌ట్టుమని వంద మంది కూడా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి.. జ‌గ‌న‌న్న‌కు జై అని చెప్ప‌డం లేదు.

ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. హోదాపై ఉన్న సెంటిమెంటు.. ఆశ‌లు ప్ర‌జ‌ల‌కు.. మూడు పై లేవు. మ‌రి .. దానిని సాధిస్తే.. స‌రిపోయేదానికి.. లేనిపోని.. మూడు రాజ‌ధానులను నెత్తినేసుకుని.. రాష్ట్రాన్ని రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌నేది నెటిజ‌న్ల ఆవేద‌న‌. మ‌రి ఇప్ప‌టికైనా.. త‌మ పంథా మార్చుకుంటారా? లేదా? అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.