Begin typing your search above and press return to search.

ముందస్తే బెటర్... లేకపోతే జగన్...?

By:  Tupaki Desk   |   4 Nov 2022 8:00 AM IST
ముందస్తే బెటర్... లేకపోతే జగన్...?
X
జగన్ సీఎం కావాలన్న కోరిక అయితే తీరింది. మూడు దశాబ్దాల పాటు తానే సీఎం అని అని ఆయన పాదయాత్ర వేళ ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్స్ నెరవేరుతాయా లేదా అన్నదే జగనన్న భక్తులకు పట్టి పీడిస్తున్న సమస్య. జగన్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దానికి గానూ ఆయన ఖజానా సామర్ధ్యం కానీ ఏపీ ఆర్ధిక పరిస్థితిని కానీ ఎక్కడా చూసుకోలేదు. పైగా జగన్ సీఎం అయ్యాక రెండేళ్ల పాటు కరోనా వచ్చి అతి పెద్ద దెబ్బ తీసింది.

ఇలా ఎన్నో ఇబ్బందుల మధ్య ఆయన మూడున్నరేళ్ల పాటు సంక్షేమ పధకాలను అమలు చేసి చూపించారు. అయితే తన హామీలను నెరవేర్చుకోవడానికి తన రాజకీయం చూసుకోవడానికి ఆయన చెల్లించిన మూల్యం ఎంత అంటే ఏపీ భవిష్యత్తు. ఏపీలో ఏ వైపు చూసినా అప్పుల కుప్పగా కనిపిస్తోంది. ఎక్కడ లేని డబ్బులు తెచ్చి ప్రజల ఖాతాలలోకి నేరుగా జగన్  జమ చేస్తున్నారు.

ఆ విధంగా ఆయన తాను మాట తప్పని సీఎం అనిపించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఖజానాకు చిల్లుపడుతోందని గ్రహించేలోపే బోలెడు నష్టం జరిగిపోయింది. ఇపుడు ఆస్తుల అమ్మకం కూడా పూర్తి అవుతోంది. ఎక్కడ లేని ప్రభుత్వ  భూములను తెచ్చి విక్రయించి మరీ అప్పులు తెస్తున్నారు. అయితే ఈ ముచ్చటకూ కొద్ది రోజులలోనే తెర పడబోతోంది అని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ క్రిష్ణా రావు అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ఇక మీదట అప్పులు అయితే దొరికే సీన్ లేదని ఆయన అంటున్నారు.

ఇక తన హామీలను జగన్ నెరవేర్చే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించడంలేదు అని చేదు నిజాన్ని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ సంక్షేమ అజెండాతో ఏపీ ఖజానాకు కోలుకోలేని చిల్లు పడిందని కూడా ఐవైఆర్ క్రిష్ణరావు ఆరోపించారు. ఇక జగన్ కి మిగిలింది అచ్చంగా ఏణ్ణర్ధం కాలం. ఈ కాలానికి కూడా అప్పులు పుడతాయి అనుకుంటే పొరపాటే అని ఆయన కుండబద్ధలు కొట్టారు.

అన్ని తలుపులూ మూసేసిన చోట. అన్ని రకాలుగా అప్పులు చేసేసిన వేళ జగన్ కి ఉన్న ఏకైన మార్గం ఏమిటి అంటే తొందరగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవడమే అని ఐవైఆర్ సలహా ఇచ్చారు. అలా అయితేనే ఆయన ఈ అప్పుల బాధ నుంచి తాను బయటపడి ఎంతో కొంత ఏపీకి కూడా మేలు చేసిన వారు అవుతారు అని అంటున్నారు. జగన్ అదృష్టం ఏంటి అంటే ఆయన ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఇన్నేసి అప్పులు చేయకపోవడం, ఇలా భూములను అమ్మకానికి పెట్టకపోవడం అని ఆయన సెటైర్లు వేశారు.

దాని ఫలితంగానే జగన్ కి ఈ రోజు అప్పులు చేయడానికి అవి అందుకువచ్చాయని అన్నారు. అయితే ఆ అవకశాలు కూడా నిండుగా దండిగా వాడేసుకున్న జగన్ కి ఇక ఏ ఆప్షన్ లేదని ఐవైఆర్ అంటున్నరు. అందువల్ల ముందస్తుకు పోతేనే జగన్ కి బెటర్ అని అన్నారు. మొత్తానికి జగన్ని సెటైరికల్ గా విమర్శిస్తూనే ఐవైఆర్ మంచి సూచనే చేశారనుకోవాలి.

కానీ అధికారం అనేది ఒక మత్తు. పైగా ఏణ్ణర్ధం కాలం ఉంది. ఎన్నికలకు వెళ్లినా గెలుస్తారా లేదా అన్నది అతి పెద్ద డౌట్. అందువల్ల వైసీపీ ఏలికలు ముందస్తుకు వెళ్తారా. ఏమో ఐవైఆర్ చెప్పినది మాత్రం ముందస్తు అంటే అటు ఏపీకి ఇటు జగన్ కి కూడా మేలు చేసేదిట. చూడాలి మరి.  ఇంకో మాట కూడా ఆయన అంటున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలనుకున్నా కూడా ఎంతో కొంత ఆశ ముందస్తు వల్లనే నట. వైసీపీ పెద్దలూ నోట్ దిస్ పాయింట్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.