Begin typing your search above and press return to search.

టీడీపీ పై ప‌గ‌ ?.. గ‌త మూడేళ్ల‌లో జ‌గ‌న్ చేసింది ఇదే!?

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:00 PM IST
టీడీపీ పై ప‌గ‌ ?.. గ‌త మూడేళ్ల‌లో జ‌గ‌న్ చేసింది ఇదే!?
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పై ఏపీ అధికార పార్టీకి ప‌గ ఉంటే ఉండొచ్చు... ఈ వంక‌ తోటి ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్టొచ్చునా? ప్ర‌జ‌లు ఏం త‌ప్పు చేశార‌ని..? ఇదీ.. తాజాగా కేంద్ర మంత్రి సాక్షాత్తూ పార్ల‌మెంటులో చేసిన వ్యాఖ్య‌ల్లోని అంత‌రార్థం.(బిట్వీన్‌ది లైన్స్ అంటారుక‌దా!!). రాష్ట్రం లో గ‌త మూడేళ్ల‌ లో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింత ఎన్ని ఇళ్లు నిర్మించార‌న్న ప్ర‌శ్న‌కు ఇచ్చిన స‌మాధానంలో ఇదే విష‌యం స్ప‌ష్టంగా తెలిసింది అని టీడీపీ ఆరోపిస్తుంది .

ఏపీ లో గ‌త 2019-22 మ‌ధ్య గ‌డిచిన మూడేళ్ల లో నిర్మించింది 5 ఇళ్లు మాత్రమే నని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. లోక్‌సభ సాక్షిగా కేంద్రమంత్రి ఇలా చెప్ప‌డంతో.. అంద‌రూ నివ్వెర పోయారు. అదేంటి? అని ఆశ్చ‌ర్యం కూడా వ్య‌క్తం చేశారు.

2019 నుంచి మూడేళ్ల లో పీఎంఏ వై పథకం కింద ఏపీలో 5 ఇళ్లు మాత్రమే నిర్మించినట్లు మ‌రోసారి మంత్రి చెప్పారు. దీంతో ఆమె చెప్పిన‌ది నిజ‌మేన‌ని అంద‌రూ అనుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా పీఎంఏ వై కింద ఆయా రాష్ట్రాల్లో నిర్మించిన ఇళ్ల వివరాల పై లోక్‌సభ లో సభ్యుల ప్రశ్నకు కేంద్రమంత్రి నిరంజన్‌ జ్యోతి సమాధానం ఇచ్చారు.

పీఎంఏ వై ప‌థ‌కంలో ఏపీకి 2016 నుంచి 2022 దాకా 1,82,632 ఇళ్లను కేటాయించామని మంత్రి వివ‌రించారు. 2016 నుంచి ఏపీలో 46,726 ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. అంతేకాదు.. అప్ప‌ట్లో ఉన్న ప్ర‌భుత్వం నిర్మాణాల‌ను చేప‌ట్టింద‌ని కూడా వివ‌రించారు. అయితే.. ఇక్క‌డ ఎలాంటి పేరును ప్ర‌స్తావించ‌లేదు.

అయితే.. మిగిలిన వాటి నిర్మాణం చేయాల‌ని సూచించినా ప్ర‌భుత్వం చేప‌ట్ట‌లేద‌న్నారు. గత మూడేళ్ల లో కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని మంత్రి వివ‌రించారు. మొత్తానికి ఇది రాజ‌కీయ వ్య‌వ‌హారంతో ముడిప‌డిన విష‌యంగా తాము భావిస్తున్న‌ట్టు ఆమె తెలిపారు. ఇదీ సంగ‌తి.. పీఎంఏ వై కింద ఇళ్లు నిర్మించి.. పేద‌ల‌కు ఇవ్వాల్సిన ప్ర‌భుత్వం కేవ‌లం చంద్ర‌బాబు హ‌యాంలో మంజూర‌య్యాయ‌న్న కార‌ణంగా.. వాటిని నిలిపివేసింద‌నే వాద‌న ఏపీ ఎంపీల మ‌ధ్య చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.