Begin typing your search above and press return to search.
సముద్రంలో కాకి రెట్ట... సంక్షేమానికి ఓట్లు రాలెదెట్టా...?
By: Tupaki Desk | 24 Aug 2022 3:30 PM GMTసంక్షేమం ఒక్కటే ఏ పార్టీని గెలిపించిన దాఖలాలు చరిత్రలో లేవు. అదే కనుక నిజమైతే జనాలు వాటికే కనుక ఓటేస్తే ఎన్టీయార్ 1989లో ఘోరంగా ఓడిపోయేవారు కాదు. అంతేనా ఇందిరాగాంధీ కూడా తొట్టతొలిగా జాతీయ స్థాయిలో సంక్షేమానికి తెర తీశారు. అయినా చాలా సార్లు ఓడారు. ఏపీలో కూడా ఎన్టీయార్ రెండు రూపాయలకు కిలో బియ్యం, అంటే నాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి రూపాయి తొంబై పైసలకే ఇస్తున్నట్లుగా చెప్పడం కాదు 1982లోనే అమలు చేసి చూపారు. అయినా కాంగ్రెస్ 1983 ఎన్నికలలో ఓడి కుప్పకూలింది.
ఇక ఈ మధ్యన ఉదాహరణలు తీసుకుంటే రెండు రూపాయలకు కిలో బియ్యం రూపాయలకే అన్న స్కీమ్ ని తెచ్చినవారు అచ్చంగా కాంగ్రెస్ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన సీఎం గా ఉమ్మడి ఏపీని మూడేళ్ల పాటు పాలించారు. ఆయన హయాంలో రేషన్ దుకాణాలు కళకళలాడాయి. ఏకంగా బియ్యంతో పాటు నూనె, చింతపండు, కారం, పంచదార గోధుమ పిండి, గోధుమలు ఇలా తొమ్మిది రకాలైన వస్తువులు ఇచ్చి పేద మధ్యతరగతి జనాలను ఆదుకున్నారు. ఇక అనాడు రేషన్ కార్డు కావాలీ అంటే ఎలాంటి అనర్హత లేకుండా అందరికీ ఇచ్చేలా చూశారు.
కానీ కాంగ్రెస్ ఘోరంగా ఓడింది కదా. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన సంక్షేమానికి వ్యతిరేకం అని చెబుతారే కానీ ఆయన కూడా తన హయాంలో అనేక పధకాలు అమలు చేశారు. అయిదు రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం, టిఫిన్ అంటే అది ఆషామాషీ పధకం కాదు కదా, అలాగే నిరుద్యోగ భృతిని ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద నగదు పది వేల దాకా ఇచ్చారు. బాబు సీఎం గా ఉన్నపుడు రేషన్ దుకాణాల్లో అన్ని మతాల వారికి పండుగ కానుకలు ఇచ్చారు.
ఇన్ని చేసినా బాబుని కూడా జనాలు ఓడించారు. అంటే సంక్షేమం వల్ల ఓట్లు రాలుతాయేమో కానీ అవి మాత్రమే గెలిపించలేవు అని అర్ధమవుతున్న విషయం. ఇక ఏపీలో జనాభా చూస్తే నాలుగు కోట్ల 95 లక్షల మంది ఉన్నారు. మరి వీరందరికీ ప్రభుత్వం సంక్షేమ పధకాలు ఇస్తోందా అంటే లేదు అన్న జవాబే వస్తుంది.
ఇందులో రెండు కోట్ల మంది ఉద్యోగాలు చేసుకుంటున్న వారున్నారు. అలాగే ఇతర వృత్తి చేసుకునే వారు మరో 70 లక్షల మంది ఉన్నారు. మరి ఈ అతి పెద్ద జనాభాలో ఎంతమందికి ప్రభుత్వ పధకాలు అందుతున్నాయి అన్నది ఎవరికీ తెలియని విషయం. ఇంకో వైపు చూస్తే ప్రభుత్వం సంక్షేమ పధకాలు అంటోంది కానీ అవి అందాలంటే సవాలక్ష అర్హతలు సాధించాలి.
ఆఖరుకు పరిస్థితి ఎలా వచ్చింది అంటే ఒక కుటుంబంలో పెద్దావిడ కానీ పెద్దాయన కానీ ప్రభుత్వ పెన్షన్ అందుకుంటే కొడుకు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కూడా వారు సంక్షేమ పధకాలకు అనర్హులు అయిపోతున్నారు. అలాగే వాలంటీర్ పేరిట అయిదు వేల జీతం ఇస్తూ ఆ మాత్రం ఉపాధికే ఆ కుటుంబానికి సంక్షేమం కట్ అని కోత పెడుతున్నారు.
ఇలాంటి చిన్నెలు ఎన్నో చేసి చాలామందిని సంక్షేమానికి దూరం పెట్టిన ఘనత అచ్చంగా వైసీపీ ఏలికలదే అని విమర్శలు ఉన్నాయి. ఇలా అన్నీ కత్తింపులు పోగా సంక్షేమం అందుకుంటున్న వారు ఎంత మంది ఉంటారు. ఒకవేళ అందుకున్నా ముందే చెప్పుకున్నట్లుగా వారు కచ్చితంగా వైసీపీకే ఓటేస్తారు అన్న గ్యారంటీ ఏముంది అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇక కాసేపు సంక్షేమాన్ని పక్కన పెట్టి పాలన వైపు చూస్తే అన్ని ధరలూ పెంచేశారు. పన్నుల వడ్డన యమ దారుణంగా ఉంది. అన్నింటి కంటే అతి పెద్ద చెత్త వడ్డింపు చెత్తల మీద యూజర్ చార్జీలు. దీని మీద జనాలు ఎంత కోపంగా ఉన్నారంటే వారు సరైన టైమ్ లోనే అది చూపించాలని అనుకుంటున్నారుట. అలాగే ఇసుక పాలసీ అని ఎన్ని మార్చినా ఇసుక బంగారం అయిపోయింది, సిమెంట్ ధరలు పెరిగాయి.
దాంతో నిర్మాణ రంగం కుదేలై దాని మీద ఆధారపడిన వారి ఉపాధికి గండి పడింది. ఇంకో వైపు చూస్తే ఏపీలో అభివృద్ధి ఎక్కడా లేదు. జాబ్ క్యాలండర్ లేదు, యువతలు ఏపీలో ఉపాధి హామీ ఏదీ లేదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మండుతున్న పరిస్థితి. ఇలా చాలా కారణాలు మైనస్ అవుతున్న వేళ కేవలం సంక్షేమమే ఓట్లు రాలుస్తుంది అనుకుంటే అంతకంటే పొరపాటు వేరొకటి ఉండదని అంటున్నారు. ఇంతకీ ఇన్ని మైనస్ ల మధ్య వైసీపీ సంక్షేమం ఏపాటి అంటే సముద్రంలో కాకిరెట్ట అంత అన్న పోలిక తెస్తున్నారు. మరి ఎన్నికలు అనే ఆ సముద్రాన్ని ఈదడం వైసీపీ వల్ల అవుతుందా. వెయిట్ అండ్ సీ.