Begin typing your search above and press return to search.

ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌.. వైసీపీకి వాతేనా?

By:  Tupaki Desk   |   8 Oct 2022 11:30 PM GMT
ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌.. వైసీపీకి వాతేనా?
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో టెన్ష‌న్ పూరిత వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. త‌మ‌కు తిరుగులేద‌ని.. త‌మ‌కు ఎదురు లేద‌ని.. తాను ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల్లో త‌మ‌కు భారీగా మైలేజీ పెంచుతున్నాయ‌ని.. ప‌దే ప‌దే చెబుతున్న వైసీపీకి.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపు ద‌క్కింది.

తిరుప‌తి ఉప పోరు కావొచ్చు.. బద్వేల్‌, ఆత్మ‌కూరుల బైపోల్ కావొచ్చు.. లేదా.. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కావొచ్చు.. ఇలా ఏవైనా కూడా.. వైసీపీకి విజ‌యం ద‌క్కింది. దీంతోవైసీపీ నిజంగానే ఎదురు లేద‌ని భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఇప్పుడు కూడా ఎన్నిక రానుంది. అది.. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ సీటుకు జ‌రగ‌నున్న ఎన్నిక‌. అంటే .. కేవ‌లం ప‌ట్ట‌భ‌ద్రులైన వారు మాత్ర‌మే పాల్గొని ఓటేసే ఎన్నిక‌న్న‌మాట‌. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అన్ని వ‌ర్గాల్లోనూ.. త‌మ‌కు మ‌ద్ద‌తు ఉంద‌ని.. చెబుతున్నా.. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ విష‌యంలో ఆ పార్టీకి ఉన్న మైలేజీ.. ప్ర‌భుత్వం ప‌ట్ల వారికి ఉన్న సానుకూలత వంటివిస్ప‌ష్టంగా తెలిసిపోతాయ‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వ‌చ్చే ఏడాది ఎన్నిక జరగబో తోంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ గతంలో సాధించిన విజయాలనే సాధిస్తుందా..అన్న‌ది ఆస‌క్తిగా మారింది. కొత్త ఓట్ల నమోదుకు ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కొత్త ఓటర్లను చేర్పించడంలో బిజీగా ఉన్నాయి. కాగా వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా శ్యాంప్రసాద్‌రెడ్డిని ప్రకటించింది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇదిలావుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌లుఒక ఎత్త‌యితే.. ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నిక పూర్తిగా విద్యావంతులకు చెందిన ఎన్నిక కావడంతో వైసీపీ విష‌యంలో వీరు ఎలా ఆలోచ‌న చేస్తున్నారు..? జ‌గ‌న్ పాల‌న‌పై విద్యావంతుల అభిప్రాయం ఏంట‌నేది.. స్ప‌ష్టంగా తెలుస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ల‌స్సుల క‌న్నా..మైన‌స్‌లే ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. గ్రాడ్యుయేట్ల‌కు ఎలాంటి.. ఆద‌ర‌ణ ల‌బించ‌డం లేదు. నిరుద్యోగ స‌మ్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్న హామీ కూడా ప‌క్క‌న పెట్టారు.

ఏటా జాబ్ క్యాలండ‌ర్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని.. ఇచ్చిన హామీ కూడా.. ప‌క్క‌కు పోయింది. ఇక‌, వ‌లంటీర్ ఉద్యోగా లు.. ఇచ్చి స‌రిపుచ్చారు. డీఎస్సీ లేదు.. మెగా డీఎస్సీ వేస్తామ‌న్న హామీ కూడా ఎటో పోయింది. ఇక‌, ఏపీపీఎస్సీ ద్వారా.. క్ర‌మం త‌ప్ప‌కుండా.. ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌న్న హామీ కూడా ప‌క్క‌కు పోయింది. దీంతో .. నిరుద్యోగులైన‌గ్రాడ్యుయేట్లు జ‌గ‌న్ సర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు ఎలాంటి తీర్పు చెబుతార‌నేది ఆస‌క్తిగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.