Begin typing your search above and press return to search.
ఏపీలో యాపారం లేదు...బతుకు లేదు.. ఒకనాటి చెల్లెమ్మ గుచ్చేసిందిగా...
By: Tupaki Desk | 31 Dec 2022 2:30 AM GMTఏపీలో యాపారం లేదు బతుకు అంతకంటే లేదు అంటున్నారు జగన్ ఒకనాటి చెల్లెమ్మ. ఆళ్ళగడ్డ అఖిలమ్మ. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి వైసీపీలో కీలకంగా ఉన్న రోజులలో ఫ్యాన్ నీడనే ఆ ఫ్యామిలీ అంతా ఉండేది. ఆమె మరణం తరువాత భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో తన కుమార్తె అఖిలప్రియతో సహా వచ్చేశారు. అలా వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ ఫిరాయించి టీడీపీ మంత్రిగా చేసిన అఖిలప్రియ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.
మూడేళ్ళ పాటు తెలుగుదేశం పార్టీని తాను ఉన్న ఆళ్ళగడ్డను పట్టించుకోకుండా వివాదాలలోనే మునిగితేలిన అఖిలప్రియ ఇపుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఆమె టికెట్ల కోసం తెలుగుదేశం పార్టీ పెద్దల వద్ద పట్టుపడుతున్నారు. మరి దగ్గర దారి ఏంటి అన్నది చూసుకున్నారో ఏమో తెలియదు కానీ జగన్ సర్కార్ మీద ఘాటు అయిన విమర్శలు చేసి పసుపు పార్టీ పెద్దల దృష్టిని ఆకట్టుకోవాలనుకుంటున్నారు అని అంటున్నారు.
జగన్ ఏలుబడిలో ఉద్యోగాలూ లేవు యాపారాలూ లేవు. ఇదేమి సర్కార్ అంటూ ఆమె నిప్పులే చెరుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ లేదు జాబు లేదు, అభివృద్ధి లేదు అంటూ అఖిలప్రియ ఏ టూ జెడ్ అన్నట్లుగా కడిగేశారు పక్క రాష్ట్రంలో వెళ్లి చిన్నపాటి వ్యాపారం పెట్టుకున్నా బతికేయవచ్చు అని ఆమె అంటున్నారు.
ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తోందని, అసలు విషయం పక్కన పెట్టి ప్రాంతీయ చిచ్చును రేపుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పెన్షన్లు పెంచుతున్నట్లుగా చెప్పి మరో వైపు ఉన్న వాటిని ఊడగొడితే వారి మనసు ఎంతలా క్షోభ చెందుతుందో ఆలోచించారా అని ఆమె ప్రశ్నించారు.
జగన్ సర్కార్‌ని నిలదీస్తూ లోకేష్ కుప్పం నుంచి చేపడుతున్న పాదయాత్ర యువగళానికి యువత అంతా మద్దతు ఇవ్వాలని అఖిలప్రియ పిలుపు ఇచ్చారు. ఆళ్లగడ్డతో పాటు నంద్యాల టికెట్ కూడా తమ ఫ్యామిలీకే ఇవ్వాలని అఖిలప్రియ చంద్రబాబుని కోరుతున్నారు. కానీ ఆమె వివాదాస్పద చర్యలు పార్టీని పట్టించుకోకపోవడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు టికెట్ విషయంలో భరోసా ఇవ్వడంలేదు అని అంటున్నారు. మరి అఖిలప్రియ ఇపుడు బిగ్ సౌండ్ జగన్ మీద చేస్తున్నారు ఇదేమైనా వర్కౌట్ అయి టీడీపీ పెద్దలు ఆమె వైపు చూస్తారా అన్నదే టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.