Begin typing your search above and press return to search.

బీజేపీ బైట్ : కేజ్రీ వాల్ గారూ...మర్యాద మ‌ర్యాద !

By:  Tupaki Desk   |   28 April 2022 6:30 AM GMT
బీజేపీ బైట్ :  కేజ్రీ వాల్ గారూ...మర్యాద మ‌ర్యాద !
X
ఆయ‌నొక మాజీ ఐఆర్ఎస్. దేశ ప్ర‌ధానిని గౌర‌వించ‌డంలో ఎందుకు త‌న వైఖ‌రికి భిన్నంగా ఉన్నారు..? ఎందుక‌ని ఓ గొప్ప స్థాయినీ,స్థానాన్నీ గౌర‌వించ‌లేక‌పోతున్నారు. రాజ‌కీయ వైరం కార‌ణంగానే ఈ విధంగా ఉన్నారా? ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

అర‌వింద్ కేజ్రీవాల్ అనే సీఎం అమర్యాద‌గా న‌డుచుకున్నార‌ని ఢిల్లీ బీజేపీ కార్య‌వ‌ర్గం ఓ అభియోగం మోపింది. ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తి ఓ ముఖ్య‌మ‌యిన విష‌య‌మై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హిస్తుంటే క‌నీస స్థాయిలో కూడా ఆయ‌న‌కు గౌర‌వం ఇవ్వ‌కుండా, విభిన్న రీతిలో, విభిన్న స్థాయిలో ఆయ‌న విష‌య‌మై నిర్ల‌క్ష్య వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డం ఎంత మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని, కేజ్రీ వాల్ త‌న ప‌రువు తానే తీసుకుంటున్నార‌ని అంటున్నాయి. ఈ వ్యక్తికి ప్రధాని ముందు కూర్చుని మాట్లాడే మర్యాద లేదు. ఎంత సిగ్గులేని మనిషి అని కేజ్రీని ఉద్దేశిస్తూ తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డుతోంది.

దేశాన్ని గౌర‌వించండి. దేశ ప్ర‌ధానిని గౌర‌వించండి. గౌర‌వం అన్న‌ది ప‌ర‌స్ప‌ర అంగీకారంలో ఉండేలా చూడండి. విభిన్న నిర్ల‌క్ష్యాల కార‌ణంగా ఒక‌రంటే ఒక‌రికి చుల‌కన భావం పెరిగిపోవ‌డం ఖాయం. విభిన్న నిర్ల‌క్ష్యాల కార‌ణంగా రాష్ట్రాల‌కూ మ‌రియు కేంద్రానికీ మ‌ధ్య ఎడం పెరిగిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే ఫెడ‌ర‌ల్ స్ఫూర్తి కి భిన్నంగా కేంద్రం నడుస్తోంది అన్న వాద‌న‌లు ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే కేంద్రం కొన్ని సార్లు ఒంటెద్దు పోక‌డ‌ల‌కు పోతోంది అన్న వాద‌న కూడా ఉంది.

ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత కార్య‌క్ర‌మాల అమ‌లులో మోడీ బొమ్మ చూపించేందుకు కూడా ఆ రోజు చంద్ర‌బాబు కానీ ఇవాళ జ‌గ‌న్ కానీ ఇష్ట‌ప‌డ‌డం లేదు. జ‌గ‌న్ అయితే మ‌రీ అంత నిర్ల‌క్ష్యంతో లేరు కానీ, అవ‌స‌రం మేరకు కేంద్రంతో స్నేహ బంధాలు కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. అందుకు కార‌ణాలు ఏమ‌యినా అందుకు గ‌త ప‌రిణామాలే ప్రేర‌ణ అయినా జ‌గ‌న్ అనే నాయ‌కుడు మిగిలిన వారి క‌న్నా భిన్నంగానే కాస్త న‌డుచుకుంటున్నారు.

కానీ ఢిల్లీ ప్ర‌భుత్వ పెద్ద కేజ్రీవాల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. విభిన్న నిర్ల‌క్ష్యాల‌కు ఆన‌వాలుగా ఉన్నారు. నిన్న‌టి వేళ క‌రోనా సంద‌ర్భంగా ప్ర‌ధాని నిర్వ‌హించిన వీసీకి వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. ప్లీన‌రీ కార‌ణంగా కేసీఆర్ వీసీలోకి రాలేదు కానీ ప్ర‌ధానిని ఉద్దేశించి త‌న పార్టీ స‌భ‌లో మాట్లాడారు. చాలా ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసేందుకు కొంత ప్ర‌య‌త్నించారు. ఆ విధంగా ప్ర‌ధానికీ త‌న‌కూ మ‌ధ్య భేదాలు ఉన్నాయి అని చెప్ప‌క‌నే చెప్పారు.

ఆంధ్రా సీఎం జ‌గ‌న్ మాత్రం పీఎం చెప్పినవ‌న్నీ విన‌మ్రంగానే విన్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం పీఎం మాట్లాడుతుంటే క‌నీస గౌర‌వం లేకుండా న‌డుకున్నార‌ని, చేతులు పైకి లేపుతూ త‌ల వెన‌క్కు పెట్టుకుంటూ నిర్ల‌క్ష్య ధోర‌ణికి ఆన‌వాలుగా ఉన్నార‌ని ఢిల్లీ బీజేపీ మాట్లాడుతోంది. విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఎంతైనా ఓ దేశానికి ప్ర‌ధాని. ఆయ‌న మాట్లాడుతున్న‌ప్పుడు అంత‌టి నిర్ల‌క్ష్యం ఎందుక‌ని? క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌కుండా కేజ్రీ న‌డుచుకున్న తీరు ఏం బాలేద‌ని ఢిల్లీ బీజేపీ పెద‌వి విరుస్తోంది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో త‌మ‌కు మాట మాత్రంగా కూడా చెప్ప‌కుండా కేంద్ర స‌ర్కారు ఎన్నో నిర్ణ‌యాల‌ను ఢిల్లీ అమ‌లు చేసింద‌ని, అప్పుడు త‌మ సీఎంకు క‌నీస స్థాయిలో గౌర‌వం ఇవ్వాల‌ని గుర్తుకు రాలేదా అని ఆప్ ఎదురు ప్ర‌శ్న‌లు సంధిస్తోంది. అయితే ఈ దూరాల కార‌ణంగా కేంద్రం, రాష్ట్రాలు ఒకరినొక‌రు తిట్టుకోవ‌డం వ‌ల్ల సాధించిందేంటి.