Begin typing your search above and press return to search.
పని అయిపోయిందా... బాబు..జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ...?
By: Tupaki Desk | 10 Dec 2022 4:30 PM GMTఎక్కడైనా మనం గెలవాలని చూస్తారు. రాజకీయాల్లో మాత్రం అవతల వారు ఓడాలని చూస్తారు. రెండింటికీ తేడా ఏముంది అవతల వారు ఓడితే కదా గెలిచేది అన్న డౌట్ రావచ్చు. కానీ ముందు మన గెలుపుని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవతల వారిదే కదా ఓటమి. కానీ రివర్స్ లో పాలిటిక్స్ లో ఆలోచిస్తారు. అవతల పరిగెట్టే వాడి కాళ్ళలో కర్రలు పెడితే ఇవతల వారు పరిగెత్తకుండానే ముందుంటారు కదా.
ఇదే పాలిటిక్స్ లో ట్రిక్స్. దీన్ని చాలా కాలంగా చాలా మంది ఆచరిస్తున్నారు. అమలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న గుజరాత్ ఎన్నికలలో ఇవే ట్రిక్స్ మోడీ షా టీం అమలు చేసింది. కేసీయార్ తెలంగాణాలో ఈ ఫార్ములానే నమ్ముకున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత బాబు కూడా దీని మీదనే తమ రాజకీయాన్ని నడిపిస్తున్నారు.
విజయవాడ నడిబొడ్డున జయహో బీసీ సదస్సు పెట్టి మరీ జగన్ బాబు మీద చండ్ర నిప్పులు చెరిగారు. ఆయన టోటల్ రాజకీయ జీవితంలో ఏమీ చేయలేదని దుమ్మెత్తిపోశారు. బాబు తానుగా చెప్పుకున్నట్లుగా ఆయనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ తనదైన పంచ్ డైలాగులు చెప్పారు. ఈ ఎన్నికలు చాలు బాబు ఇక రాజకీయంగా ఇంటికే అని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అదే మాట పదే పదే ఆయన జిల్లా టూర్లలో అనేక సభల్లో చెబుతున్నారు.
జగన్ ది మూడు దశాబ్దాల సీఎం కల. దాంతో గ్రౌండ్ లెవెల్ ఓ బలంగా ఉన్న టీడీపీ అడ్డు తొలగిపోతే తన పని సులువు అవుతుందని ఆయన అంచనా కడుతున్నారు. కుప్పంలో బాబుని ఓడిస్తే సరి అని ఆయన ఇప్పటికే లెక్క వేసుకున్నారు. వై నాట్ 174 అని బిగ్ సౌండ్ చేస్తున్నారు. టీడీపీకి ఏపీ పాలిటిక్స్ లో నో ప్లేస్ అని గట్టిగా చెబుతున్నారు. ఒక విధంగా జగన్ కి ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం చాలా ముఖ్యం. అందుకే ఆయన చంద్రబాబు ఓడిపోతారు అని చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇక బాబు సంగతి చూస్తే ఆయన కర్నూల్ జిల్లా నుంచి మొదలెట్టి గోదావరి జిల్లాల్లో అడుగెట్టి ఇపుడు గుంటూర్ జిల్లాలలో చేస్తున్న టూర్లలో మొత్తం చూస్తే చెబుతున్నది ఒక్కటే మాట. అదే జగన్ పని అయిపోయింది అని. జగన్ ఎపుడు ఎన్నికలకు వచ్చినా ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని బాబు గర్జిస్తునారు. జగన్ చేసిన మోసాలు అన్నీ జనాలకు తెలిసిపోయాయని ఆయన అంటున్నారు.
చేతికి పది రూపాయలు ఇచ్చినట్లుగా ఇచ్చి వంద రూపాయలు వడ్డిస్తూ బాదుడే బాదుడు అంటూ నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించడమే జనాలు చేయాల్సింది అని ఆయన పిలుపు ఇస్తున్నారు. జగన్ ఒక్క మంచి పని చేశారా అని బాబు కూడా నిలదీస్తున్నారు. జగన్ కి ఒక్క చాన్స్ ఇచ్చారు. ఇక చాలు మరోసారి ఇవ్వాలనుకుంటే ఏపీ మిగలదు అని బాబు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. జగన్ ని ఎన్నుకుని తప్పు చేశామని ఇప్పటికే జనాలు అంటున్నారని, ఈసారి జగన్ మాజీ సీఎం అవడం ఖాయమని చెబుతున్నారు.
ఈ ఇద్దరు నేతల ప్రసంగాలు వింటే ఒక విషయం అర్ధమవుతుంది. ఈ ఇద్దరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అతిగా అయినా ఉండాలి. లేక ఓటమి బెంగ అయినా ఎక్కడో మారు మూల కలుక్కుమంటూ అయినా ఉండాలి. అందుకే తమ మాట జనం నోట పలికించాలని చూస్తున్నారు. జగన్ ఈసారికి ఓడిపోతే మరో పదేళ్ళ అధికారం తన సొంతం అని బాబు నమ్ముతున్నారు. బాబుని ఓడిస్తే ఇక ఏపీలో తిరుగేలేదని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఈ ఇద్దరూ కూడా పని అయిపోయింది అంటూ ప్రత్యర్ధుల మీద ప్రచారం మొదలెట్టేశారు.
కానీ ఎవరి పని అయిపోయిందో ఎవరికి పని పెట్టాలో చెప్పాల్సింది జనాలు. వారు ఏమనుకుంటున్నారు అన్నది అయితే తెలియదు. అందుకే లోలోపల భయంతో ఆంజనేయ దండకం చదువుకుంటూ తమలో తమకే ధైర్యం చెప్పుకుంటూ బాబు జగన్ ఇలా ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఒక్క ఎన్నికతోనో రెండు ఎన్నికలతోనో రాజకీయ పార్టీల పని అయిపోతుందా. జగన్ ఓడితే విపక్షంలో ఉన్నా 2029 నాటికి మరో చాన్స్ ఉంటుంది. అలాగే నాలుగున్నర దశాబ్దాలుగా క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం మళ్లీ ఓడినా కూడా లేచి నిలబడే సత్తా ఉంటుంది. మరి సంగతి తెలిసి కూడా ఎన్నికలకు ఆమడ దూరం ముందే పని అయిపోయింది అంటూ నినాదాలు ఇవ్వడం అంటే రాజకీయ అతిగానే చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.