Begin typing your search above and press return to search.
'మునుగోడు' తర్వాత భారీ ఆపరేషన్.. ఢిల్లీ వర్గాల గుసగుస
By: Tupaki Desk | 20 Aug 2022 2:30 AM GMTతెలంగాణలో భారీ ఆపరేషన్ జరగనుందా? ఇక్కడి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించేలా.. కేంద్రం వ్యూహాత్మక అడుగులు వేస్తోందా? ఇప్పటి వరకు కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న సీఎం కేసీఆర్‌ను లైన్‌లో పెట్టుకునేందుకు.. లేదా.. సైలెంట్ చేసేందు కు..కేంద్రంలోని పెద్దలు దృష్టి పెట్టారా? దీనికి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత.. ముహూర్తం ఫిక్స్ చేశారా? అంటే.. ఔననే అంటున్నాయి.. ఢిల్లీ వర్గాలు. అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం మేరకు తెలంగాణపై ఆపరేషన్ ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. అయితే.. ఇది ఎప్పుడనేదే ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెబుతున్నాయి.
గత కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్ కేంద్రంపై భోగి మంట మాదిరిగా ఎగిసిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన టార్గెట్ చేస్తున్నారు. బీజేపీని తీవ్రస్థాయిలో దూషిస్తున్నారు. అయితే.. వీటిపై ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు స్పందించలేదు.
దీంతో కేసీఆర్ మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని నేతలు.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. `ఏదో ఒకటి చేసి.. కేసీఆర్‌ను అదుపు చేయాల్సిందే`` అని బీజేపీ తెలంగాణ నాయకులు కేంద్రానికి ఇప్పటికే పదే పదే విజ్ఞప్తులు చేశారు. దీనికి తోడు.. కేంద్రం కూడా కేసీఆర్ వైఖరిపై గుస్సాగా ఉంది.
రైతుల ధాన్యం కొనుగోలు సహా.. మూడో ఫ్రంట్ ఏర్పాటు.. మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడం వంటి పరిణామాలను కేంద్రంలోని పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే అదును చూసుకుని విరుచుకుపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని.. ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ బంధువు.. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసుకుని.. ఈడీ దాడులు జరిగే అవకాశం లేకపోలేదని.. తద్వారా.. గట్టి సంకేతాలు పంపించి.. కేసీఆర్‌ను సైలెంట్ చేయొచ్చని ఆ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే కేంద్రంపై విరుచుకుపడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కేంద్రం తనవైపు తిప్పుకొంది. ఆ రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీపై కేసు నమోదు చేయడంతోపాటు.. ఇతర నేతలను కూడా దీనిలో ఇరికించిందనే వవిమర్శలు ఉన్నాయి. దీంతో అప్పటి వరకు నిప్పులు చెరిగిన మమత.. మోడీతో మైత్రికి రెడీ అయ్యారు.
మోడీ, అమిత్ షాల మొహం చూడడని చెప్పిన ఆమె.. నేరుగా ఢిల్లీకి వెళ్లి మోడీతో భేటీ కావడం గమనార్హం. ఇలానే తెలంగాణలోనూ ఆపరేషన్ జరిగే అవకాశం తథ్యమని ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలుత చిన్నగా ప్రారంభించి.. తర్వాత.. దీనిని పెద్దది చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నాయి.
అంతేకాదు.. ఎన్నికల సమయానికి కేసీఆర్‌కు ఊపిరి ఆడకుండా చేసి.. ఆ గ్యాప్‌లో తాము విస్తరించే వ్యూహం వేసే అవకాశం కూడా ఉందని అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను బట్టి మోడీ సర్కారు ఎంత వరకైనా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి ఇలాంటిది ఏదైనా జరిగితే.. కేసీఆర్ ఎలా తట్టుకుంటారు? ఏం చేస్తారు? అనేది ఆసపక్తిగా మారింది.