Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు పెరుగుతున్న సెగ.. మునుగోడు ముందు.. ముప్పుతిప్పలేనా?
By: Tupaki Desk | 23 Aug 2022 2:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయంగా సెగ పెరుగుతోందా? కీలకమైన మునుగోడు ఉప ఎన్నికకు ముందు.. ముప్పే ట దాడులు జరిగే అవకాశం ఉందా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నవారు ఔననే అంటు న్నారు. మునుగోడు ఉప పోరును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక్కడ గెలిచి తీరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ ఉప ఎన్నికకు ముందు.. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె.. ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావడం.. బీజేపీ నేతల నుంచి పదునైన విమర్శలు రావడం వంటివి కేసీఆర్‌కు సహజంగానే ఇబ్బందిగా మారాయి.
తాజాగా లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. హైదరాబాద్లో కవిత ఇంటి ముట్టడికి నేతలు యత్నించారు. ఈ సంఘటనలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. పోలీసుల తోపులాటలో బీజేపీ కార్యకర్తలు కొందరు స్పృహతప్పి పడిపోయారు. కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన నేతలను అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల ప్రకటన దృష్ట్యా కవిత ఇంటి వద్దకు టీఆర్ ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.
మరోవైపు.. కవిత రాజీనామాకు రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. లిక్కర్ స్కామ్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అంటున్న కవిత రాజీనామా చేసి విచారణకు సహకరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కేటీఆర్, కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవితతో రాజీమానా చేయించాలని డిమాండ్ చేశారు.
మునుగోడుపై ప్రభావం..
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక పైనా.. కవిత ప్రభావం ఎక్కువగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకం టే.. ఇప్పుడున్న ప్రధాన పోరు.. బీజేపీ-టీఆర్ ఎస్ మధ్యేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సమయంలో బీజేపీ ఖచ్చితంగా లిక్కర్ స్కాంను మునుగోడు ప్రచారానికి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. దీంతో టీఆర్ ఎస్ నేతలు.. దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ.. మరికొద్ది రోజుల్లోనేకవితకు కూడా సీబీఐ నోటీసులు అందుతా యనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో టీఆర్ ఎస్‌కు ముప్పుతిప్పలు తప్పవనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.