Begin typing your search above and press return to search.

కేసీయార్ వైఖరి చూస్తే ఏపీకి గుండు సున్నా...?

By:  Tupaki Desk   |   12 Sep 2022 5:30 PM GMT
కేసీయార్ వైఖరి చూస్తే ఏపీకి గుండు సున్నా...?
X
ముంగింట్లో జాతీయ పార్టీని పెడతాను అంటూ హడావుడి చేస్తున్న కేసీయార్ కేంద్రం మీద కోపం తో సాటి తెలుగు రాష్ట్రం ఏపీ మీద తెలియంకుండానే ఆగ్రహం ప్రదర్శిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. అసెంబ్లీలో కేసీయార్ మాట్లాడుతూ ఏపీకి ఏమీ తెలంగాణా బాకీ లేదని చెప్పేశారు. పైగా ఏపీయే ఏకంగా 17 వేల కోట్ల రూపాయల పై చిలుకు నిధులు ఇవ్వాలని, అతి పెద్ద బాకీ అదేనని కూడా అన్నారు.

ఇక ఏపీలో ఏడు పోలవరం మండలాలను విలీనం చేయడం పట్ల కూడా ఆయన గుస్సా అయ్యారు. ఈ అంశం మీద ఇప్పటికి అనేసార్లు ఆయనతో పాటు టీయారెస్ నేతలు సమయం వచ్చినపుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక పోలవరం ఎత్తు మీద సుప్రీం కోర్టులో తెలంగాణా కేసు కూడా వేసింది. ఇవన్నీ కూడా ఏపీ ప్రజలకు ప్రయోజనాలకు ఇబ్బందిని కలిగించే చర్యలే.

మరి కేసీయార్ రేపటి రోజున జాతీయ పార్టీ అంటున్నారు. ఏపీలో కూడా ఆయన గారి పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది. కేవలం తెలంగాణా పక్షపాతిగా ఉంటూ ఇప్పటికీ సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగిందని విమర్శలు చేస్తూ ఏపీకి వస్తే రేపటి రోజున ఓట్లు ఎలా పడతాయి గులాబీ బాసూఅన్న చర్చ అయితే మొదలైంది.

అంతే కాదు ఏపీ తెలంగాణా ఉమ్మడి ఆస్తులు అన్నీ కూడా తెలంగాణాలో ఉన్నాయి. వాటి విలువ కట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా లెక్క కట్టి ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాలి. ఈ విషయంలో తొమ్మిది పదవ షెడ్యూల్ లో ఉన్న అంశాలను బట్టి ఏపీకి పూర్తి న్యాయం జరగాలి. మరి ఆస్తుల విభజన విషయంలో కూడా తెలంగాణా ఇదే విధమైన సాచివేత ధోరణిని ప్రదర్శిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు ఇప్పటికి ఆరేడేళ్ళుగా మొత్తుకుంటే ఆరు వేల కోట్ల తెలంగాణా బకాయిల విషయంలో కేంద్రం టీయారెస్ సర్కార్ కి ఉత్తరం రాసి వాటిని క్లియర్ చేయడానికి నెల రోజుల టైం కూడా విధించింది. మరి ఈ అంశం మీద ఏకంగా సీఎం పదవికే రాజీనామా చేస్తాను తప్ప ఒక్క పైసా ఇచ్చేది లేదు అని కేసీయార్ అంటున్నారు. పైగా తమకే దానికి మూడింతలు సొమ్ము ఏపీ నుంచి రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

రేపటి రోజున ఉమ్మడి ఆస్తుల విభజన కధ కూడా ఇలాగే సాగుతుందా అన్న డౌట్ అయితే ఉంది. ఇప్పటికైతే ఆస్తుల కధ ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ కష్టంతో సమకూరిన ఆస్తులలో ఆంధ్రా వాటాను తేల్చే విషయంలో కేంద్రం ఉదాశీనత అలాగే కంటిన్యూ అవుతూండగా ఆదిలోనే విద్యుత్ బకాయిన విషయంలో కరెంట్ షాక్ ఇచ్చేసి కేసీయార్ సార్ బస్తీ మే సవాల్ అంటున్నారు.

ఈ లెక్కన చూస్తే ఏపీకి విభజన తరువాత ఆస్తులు లేవు. పాస్తులు రావు, వాటి లెక్కలు తేలవు. బకాయిలు అంతకంటే అడగవద్దు అన్నట్లుగా సీన్ ఉంది. సో మొత్తంగా చూస్తే ఏపీకి గుండు సున్నావేనా సారూ కారు వారూ అంటే అదే నిజమని అంటున్నారు. ఈ విధంగా ఏపీ విషయంలో కేసీయార్ రాజకీయం చేస్తూ మోడీ మీద ఫైర్ అవుతునన్ వేళ రేపటి రోజున ఆయన జాతీయ పార్టీకి ఏపీ ఓటర్ల నుంచి ఎలా అదరణ ఉంటుంది అన్నదైతే అతి పెద్ద డౌట్ గా ఉంది.

కేసీయార్ చెప్పే వాటిలో కొన్ని సత్యాలు ఉన్నా ఆయన జాతీయ నాయకుడిగా మారాలనుకున్నపుడు సాటి తెలుగు రాష్ట్రం పట్ల కొంత ఉదారతతో ఉండాలని అంటున్నారు. కేంద్రం మీద మోడీ మీద ఆయన దూకుడు చేయవచ్చు కాక కానీ ఏపీ మీద మాత్రం ఇచ్చిపుచ్చుకునే వైఖరితో ఉంటేనే మంచిదన్న మాట కూడా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.