Begin typing your search above and press return to search.
పార్లమెంటు-అంబేద్కర్-కేసీఆర్- కొన్ని రాజకీయాలు!
By: Tupaki Desk | 15 Sep 2022 4:33 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలే రాజకీయాలు. ఆయన ఎప్పుడు ఎలాంటి లైన్ తీసుకుంటా రో.. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో.. చెప్పడం కష్టం. నిన్నటి వరకు పొగిడిన నోటితోనే.. నేడు తెగిడేస్తారు.. అదేమంటే.. గదంతె భయ్!అని సమర్థించుకుంటున్నారు. తన విషయంలో ఏది చేసినా.. చేయకపోయినా.. ఇతరులు మాత్రం పక్కా రూల్స్ పాటించాలని అంటారు. దటీజ్ స్టయిల్ ఆఫ్ గులాబీ బాస్. సరే.. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే..
కేంద్రంలో మోడీ సర్కారును మన కేసీఆర్ సారు వ్యతిరేకిస్తున్నడు కదా.. ఆ ముచ్చట గిప్పుడు పీక్‌స్టేజ్ కి చేరిందన్న మాట. ఇప్పటి వరకు.. ఏదేదో.. కారణాలు.. చూపి మోడీని విమర్శించిన కేసీఆర్ సారు.. ఇప్పుడు.. ఆయనను మరింత ఇరుకున పెట్టేలా.. ఒక సరికొత్త డిమాండ్ తెరమీదికి తెచ్చిండు. కొత్తగా ఢిల్లీలో కడుతున్న పార్లమెంటు భవనానికి(సెంట్రల్ విస్టా- అని ఇప్పటికే పిలుస్తున్నరు) రాజ్యాంగ నిర్మాత భారతరత్న.. అంబేద్కర్ పేరు పెట్లాలనేది మన కేసీఆర్ సార్ డిమాండ్.
ముందు.. ఆయన కొడుకు.. మంత్రి.. కేటీఆర్ గీ.. ముచ్చట తెరమీదికి తెచ్చిండు. గిప్పుడు.. కేసీఆర్ అం దుకున్నరు. వరుస ట్వీట్లతో వేడెక్కించుడనుకోరి!! ఆ ట్వీట్ల ముచ్చట... మీరూ చదువుండ్రి..
``స్వయంపాలనలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్. అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి వున్నవి.
డా. బి.ఆర్. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరచడం వల్లనే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా తెలంగాణ ప్రభుత్వం మానవీయ పాలన అందిస్తున్నది.
అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలి. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, భారత సామాజిక తాత్వికవేత్త, రాజ్యాంగ నిర్మాతను మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి, సంబంధింత తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఇదే విషయమై భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖను రాసి పంపుతాను. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణనలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బి.ఆర్. అంబేద్కర్ పేరును పెట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను`` అని కేసీఆర్ సారు చేతికి ఎముకలేదన్నట్టు.. రాసుకొచ్చిండ్రు!!
గైతే.. మన నెటిజన్లు ఊరుకుంట్రా మరి.. అది సరే..కేసీఆర్ సారూ.. తెలంగాణ ఉద్యమం కెల్లి.. నువ్వు ఓ మాట చెప్పినవ్ గుర్తుందా? అని ప్రశ్నిస్తున్రు! ``తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్త`` అని గప్పట్లో నువ్వు అన్లే.. మరి గా మాట ఏమాయే? అని నిలదీస్తున్రు!!
అంతేనా.. మరికొందరు.. ఏమంటున్రొ తెలుసా.. కేంద్రంపై నీ పెత్తనమేంది.. నువ్వు అడుగు.. గమ్మున కూర్చొ.. మల్ల!! అని అంటున్నరు. గైనా.. ఎస్సీ పార్టీలు... ఎస్సీ సామాజిక వర్గానికి లేని.. బాధ గిప్పుడు. కేసీఆర్‌కు ఎందుకబ్బా.. అని మరికొందరు చెబుతున్నరు.. గేదేమైనా.. మన కేసీఆర్ సారు.. ఏంచేసినా.. రాజకీయం ఉంటదిలే.. అని బుగ్గలు నొక్కుకుంటున్నరు. మరి మోడీ సారు ఏమంటరో.. చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.