Begin typing your search above and press return to search.
రాహుల్ ప్రధాని కాకూడదా...విపక్ష కూటమిలో ప్రాంతీయ పెత్తనం....?
By: Tupaki Desk | 1 Jan 2023 12:30 AM GMTకాంగ్రెస్ పెద్ద పార్టీ. దేశానికి దశాబ్దాల పాటు సేవ చేసిన పార్టీ. అధికారంలో కాంగ్రెస్ ప్రధానులు అనేక మంది ఉండి దేశాన్ని కీలకమైన అభివృద్ధి దిశగా మలుపు తిప్పారు. తప్పులు కాంగ్రెస్ కొన్ని చేసి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు కూడా ఎవరూ కాదనలేనివి. ఈ రోజు భారత్ ఒక రూపుతో ఉంది అంటే అది కాంగ్రెస్ పాలకుల విజన్ అనే చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం నుంచి చిట్ట చివరి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఆయన 1989లో దిగిపోయారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల కాలం అయింది గాంధీ ఫ్యామిలీ నుంచి మళ్ళీ ప్రధాని అయిన వారు లేరు. ఈ మధ్యలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి వారు పదిహేనేళ్ళ పాటు ప్రధానులుగా దేశాన్ని ఏలారు.1991లో 2004, 2009లలో మూడు సార్లు ప్రధానమంత్రి పదవి గాంధీ ఇంటి తలుపు తట్టినా కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వద్దు అనే చెప్పారు.
ఇక అన్నీ కలసి వచ్చి 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అంతా భావిస్తున్నారు. కాళ్ళకు బలపాలు కట్టుకుని భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ కన్యాకుమారి టూ కాశ్మీర్ దాకా చేస్తున్నది కూడా కాంగ్రెస్ అధికారం కోసమే. రాజకీయాలలో ఉన్న వారు ఎవరూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకోరు.
ఎవరైనా పదవి కోసమే ఉంటారు. ఇక ఈసారి కచ్చితంగా యూపీయే త్రీ పవర్ లోకి వస్తే రాహుల్ ప్రధాని అని ఫిక్స్ అయిపోయారు యూపీయే మిత్రులు. అయితే విపక్ష కూటమి మొత్తం నుంచి రాహుల్ గాంధీకి ఈ మేరకు మద్దతు దక్కుతోందా అంటే అక్కడే పేచీలు వస్తున్నాయి. మళ్ళీ మోడీ ప్రధాని కాకూడదు అన్న పట్టుదలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. అయితే ఆమె తాను ప్రధాని కావాలని ఆలోచిస్తున్నారు. ఆ దిశగా ఆమె పావులు కదుపుతున్నారు.
ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా పుష్కర కాలంలో తన పార్టీని జాతీయ స్థాయిలో ఎదిగేలా చేశారు. పంజాబ్ లో అధికారం అందుకున్నారు. మిగిలిన రాష్ట్రాలలో ఉనికిని చాటుకుంటున్నారు. ప్రధాని చాన్స్ కోసం విపక్ష కూటమి నుంచి ఆయన చూస్తున్నారు. అదే విధంగా అందరూ ఒకే అంటే నేనే ప్రధాని అని సీనియర్ నేత వృద్ధ నాయకుడు శరద్ పవార్ ఆశపడుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో కొత్తగా తెలంగాణా నుంచి కేసీయార్ ఉన్నారు. ఆయన బీయారెస్ పెట్టింది కూడా అందుకే.
ఇక కొద్ది నెలల క్రితం బీజేపీతో కటీఫ్ చేసుకుని బయటకు వచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలివితేటలను ఎవరూ తక్కువ అంచనా కట్టడం లేదు. ఆయన సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకున్నారనే అంటున్నారు. ఆయనకు రాజకీయ వారసులు లేరు. దాంతో బీహార్ పీఠాన్ని ఆర్జేడీకి వదిలేసి తన పార్టీని కూడా అందులో విలీనం చేసి బలమైన పోటీదారుగా ప్రధాని రేసులోకి రావాలని చూస్తున్నారు. ఆయనకు లాలూ ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు.
ఇలా చాలా మంది ప్రధాని పీఠం కోసం చూస్తున్నారు. చిత్రమేంటి అంటే వీరంతా ప్రాంతీయ పార్టీల నాయకులు. ఎవరికీ గట్టిగా యాభై పైన సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ కాంగ్రెస్ తమకు మద్దతు ఇచ్చి తోక పార్టీగా ఉంటే చక్రం తిప్పాలని చూస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ ఏం చేయాలి అంటే జస్ట్ సపోర్ట్ చేస్తూ పక్కన కూర్చోవాలి అన్న మాట.
ఇక అనేక సర్వేలు చూస్తే కాంగ్రెస్ కి బలం వచ్చే ఎన్నికల్లో ఇపుడున్న 52 సీట్ల నుంచి కచ్చితంగా 140 దాకా పెరుగుతాయని అంటున్నారు. మరి అన్ని సీట్లు తెచ్చుకుని బీజేపీతో పోటీ పడే స్థాయిలో కాంగ్రెస్ ఉంటే ధర్మంగా న్యాయంగా విపక్ష కూటమికి అదే పెద్దన్న అవుతుంది. అలాగే రాహుల్ ని ప్రధాని చేయడానికే అందరూ మద్దతుగా నిలవాలి. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అవనీ ఆ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకోనీ కానీ తామే ప్రధాని పీఠం ఎక్కాలని ఉవ్విళ్ళూరుతున్నారు ప్రాంతీయ పార్టీల నేతలు.
రాహుల్ ని విపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్ధిగా చేసేందుకు ఏమంటారు అంటే నితీష్ కుమార్ మాత్రం సూటిగా సమాధానం చెప్పకపోవడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పక్క వాయిద్యంగా ఉండాలనే ఉందని అంటున్నారు. ఆయనే కాదు మమత అయినా కేజ్రీవాల్ అయినా కేసీయార్ అయినా ఇలాగే చెబుతారు. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే పెద్ద పార్టీకే నాయకత్వం అప్పచెబితేనే సుస్థిర పాలన సాగుతుంది అన్నది జనాలు కూడా ఒప్పుకునే సత్యం.
కానీ ప్రధాని పీఠం మీద కన్నేసిన విపక్షాలు ప్రాంతీయ పెత్తనం చేస్తూ పోతే మాత్రం మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి తప్పక వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే మాత్రం దేశంలో మోడీని విమర్శించే హక్కు విపక్షాలకు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.