Begin typing your search above and press return to search.
దేశాన్ని కొలవనున్న రాహుల్ : కాంగ్రెస్ కి వైఎస్సార్ విజయ సూత్రం....?
By: Tupaki Desk | 14 July 2022 3:30 PM GMTపాదయాత్ర అంటే ఈ దేశంలో గుర్తుకువచ్చే మొదటి పేరు వినోబాబావే. ఆయన చేసినది సేవా యాత్ర. సామాజ హితం కోసం యాత్ర. భూదానం కోసం జరిపిన యాత్ర. ఇక రాజకీయ యాత్రలను తీసుకుంటే దివంగత నేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్ 1980 దశకంలో దేశమంతా పాదయాత్ర చేపట్టారు. ఇక ఆ తరువాత మళ్లీ మిలీనియం యుగంలో పాదయాత్రలకు ప్రాచుర్యం కల్పించినది మాత్రం వైఎస్సార్ మాత్రమే. ఆయన 2003లో పాదయాత్ర ఉమ్మడి ఏపీలో చేపట్టి బ్రహ్మాండమైన సక్సెస్ తో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువచ్చారు.
ఆయన విజయసూత్రాన్ని తరువాత రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వంటబట్టించుకున్నారు. 2013లో ఆయన కూడా పాదయాత్ర చేశారు. ఇక అదే టైమ్ లో వైఎస్ షర్మిల పాదయాత్ర చేసింది. వైసీపీని పటిష్టం చేసింది. ఇక 2017లో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. దేశంలో ఎవరూ నడవనంత దూరం నడచి రికార్డు సృష్టించారు. ఆయన ఆ విధంగా అధికారం అందుకున్నారు. ఇపుడు మళ్ళీ పాదయాత్రలకు రంగం సిద్ధం అవుతోంది. తెలంగాణాలో వైఎస్ షర్మిల పాదయాత్రన్ మొదలెట్టి చాలా నెలలు గడచింది.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా పాదయాత్ర బాకీ ఉన్నారు. ఏపీలో చూసుకుంటే లోకేష్ ది పాదయాత్ర లేక సైకిల్ యాత్ర అన్నది తెలియడంలేదు. దేశంలో చూస్తే రాహుల్ గాంధీ భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ భారీ పాదయాత్ర అక్టోబర్ 2న గాంధీ జయంతి వేళ మొదలుకాబోతోంది.
కాశ్మీర్ టూ కన్యాకుమారి దాకా మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా ఈ పాదయాత్ర సాగనుంది. ఏకంగా 3,500 కిలోమీటర్ల దూరంలో ఈ యాత్ర సాగనుంది. భారత్ జోడో పేరు మీద సాగే ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ నేరుగా ప్రజలను కలవనున్నారు. వారితో ముచ్చటించనున్నారు. వారి సాధకబాధకాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. అదే విధంగా రాహుల్ గాంధీ తన రాజకీయ జీవితం మొదలెట్టాక చేపట్టనున్న అతి పెద్ద ప్రజా కార్యక్రమంగా దీన్ని చూడాలి.
రోజుకు పాతిక కిలోమీటర్ల వంతున మొత్తం 148 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్ర మీద కాంగ్రెస్ అన్ని ఆశలు పెట్టుకుంది. ఇప్పటికి రెండు పర్యాయాలు అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ కి 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయి.
అదే టైమ్ లో కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ బీజేపీ దూకుడు చేస్తోంది. ఇంకో వైపు ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ ని లైట్ తీసుకుంటున్న వేళ ఆ పార్టీ సారధి రాహుల్ గాంధీ తన పాదాలను పని చెప్పారు. నాడు కాంగ్రెస్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వేళ వైఎస్సార్ మండుటెండలో మొదలెట్టిన పాదయాత్ర ఆ పార్టీని పునర్జ్జీవాన్ని ప్రసాదించింది. ఇపుడు రాహుల్ గాంధీ పాదయాత్ర దేశాన్ని కీలక రాజకీయ మలుపు తిప్పుతుంది అని అంతా భావిస్తున్నారు.