Begin typing your search above and press return to search.
మర్రి శశిధర్ రెడ్డికి గవర్నర్ గిరీ.. కానీ షరతు పెట్టారా?!
By: Tupaki Desk | 19 Nov 2022 1:30 PM GMTదివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి కుమారుడు.. తాజాగా బీజేపీలో చేరేందుకు సిద్ధమై న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కేంద్ర పెద్దలు, అమిత్‌షాతో చర్చలు జరిపారు. ఇక, ఈ విషయం తెలిసిన వెంటనే కాదు.. కాదు.. కాంగ్రెస్ కూడా నిర్దారించుకున్నాకే మర్రిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్క రించింది. తాజాగా ఈ నిర్ణయం కాంగ్రెస్ తీసుకుంది.
ఇదిలావుంటే, అసలు మర్రి శశిధర్ రెడ్డి ఏం ఆశించి బీజేపీలోకి జంప్ చేశారు? ఏఆశించి ఆయన తన తండ్రి మర్రి చెన్నారెడ్డి ఇమేజ్‌ను సైతం పక్కన పెట్టారు? ఇదీ రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న మాట. ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు చెబుతున్న మాటలు, ఢిల్లీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం వంటివి పరిశీలిస్తే, మర్రి శశిధర్ రెడ్డి మనసులో కోరిక తన తండ్రి మాదిరిగా గవర్నర్ అవ్వాలనే.
ఇదే విషయాన్ని ఆయన అమిత్ షాకు చెప్పినట్టు సమాచారం. దీనికి వెంటనే ఒప్పుకోని అమిత్ షా, ముం దు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రయత్నాలు చేయాలని సూచించారట. అంతేకాదు, ఒక షరతు కూడా పెట్టారని గుసగుస వినిపిస్తోంది. కాంగ్రెస్‌ను బలహీన పరిచేలా రెడ్డి సామాజిక వర్గాన్ని సాధ్యమైనంతగా బీజేపీ బాటపట్టించాలని కూడా ఆయన టార్గెట్ పెట్టారని అంటున్నారు.
అయితే, షాతో మాత్రం మర్రి తనకు గవర్నర్ గిరీ ఇప్పించాలనే డిమాండ్ మాత్రం పదే పదే చెప్పుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని పైస్థాయిలో చర్చించిన తర్వాత చెబుతామన్నారని సమాచారం. ఇక త్వరలోనే మర్రి బీజేపీ చేరిక ఖాయమని తేలిపోయింది. అయితే, ఐదేళ్లగాంధీ గిరీ కోసం, అంత పెద్ద ఇమేజ్ ఉన్న మర్రి చెన్నారెడ్డికి అపకీర్తి తీసుకువచ్చేలా చేయడంపై మాత్రం ఆయన అభిమానులు మండిపడుతున్నా రు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.