Begin typing your search above and press return to search.

'ఉత్తమ్' రాజకీయ సన్యాసం శపథం.. నెరవేరడం కష్టం..

By:  Tupaki Desk   |   2 Jan 2023 1:37 PM GMT
ఉత్తమ్ రాజకీయ సన్యాసం శపథం.. నెరవేరడం కష్టం..
X
పీసీసీ చీఫ్ గా చేసి కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురాలేకపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయనకు ఇచ్చినన్ని చాన్సులు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ ఇవ్వలేదు. కానీ ఉత్తమ్ వల్లకాలేదు. పీసీసీ చీఫ్ గా ఉండి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాలేకపోయిన ఉత్తమ్ ఇప్పుడు మాత్రం ఆ నియోజకవర్గాల్లో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలు వదిలేస్తానని.. రాజకీయ సన్యాసం శపథం చేశారు. కోదాడలో ఉత్తమ్ తోపాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన ఈ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తమ్ మాట సారాంశం ఏంటయ్యా అంటే.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా పనిచేశానని చెప్పిన ఉత్తమ్.. తాము విలవలు, విశ్వసనీయతలతో రాజకీయాలు చేశామని పేర్కొన్నారు. 1994వ సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తున్నా కనీసం సొంత ఇల్లు కూడా తమకు లేదని ఉత్తమ్ వెల్లడించారు. తమకు పిల్లలు లేరని.. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలను తమ పిల్లలుగా భావిస్తూ వారికోసమే పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాలను వదిలేస్తానని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్న ఉత్తమ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీ వచ్చి తీరుతుందని..తాము గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

తాను చెప్పిన మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని.. తనకు పదవులు, ఆస్తులపై వ్యామోహం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాన్ని త్యాగం చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు.

అయితే ఉత్తమ్ ఎంతో ఆవేశంగా మాట్లాడినా కూడా తెలంగాణలో అయితే బీఆర్ఎస్ లేదంటే బీజేపీ గాలిమాత్రమే వీస్తోంది. మరో పార్టీ ఊసే లేకుండా ఉంది. కాంగ్రెస్ రోజురోజుకు చితికిపోతోంది. ఇలాంటి టైంలో ఏకంగా 50వేల మెజార్టీ .. అదీ కాంగ్రెస్ నుంచి ఆశించడం అత్యాశే అని విశ్లేషకులు చెబుతున్నారు. గెలవడం వరకూ ఓకే కానీ.. మెజార్టీనే అంత కష్టం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.