Begin typing your search above and press return to search.
దుంపతెగ ఎలన్ మస్క్.. మళ్లీ నాలుక మడతట్టేశాడు!
By: Tupaki Desk | 18 Aug 2022 2:30 AM GMTటెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ మధ్య తుంటరి పనులు చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్ర సోషల్ మీడియా ట్విట్టర్ ను కొంటానని సాంతం వాడేసుకొని మోసం చేసిన ఆయన చూపు తాజాగా మరో సంస్థపై పడింది. ఈసారి ఫుట్ బాల్ ఫ్రాంచైజీని కొంటానంటూ బయలు దేరాడు.
ప్రపంచంలోనే ధనవంతుడైన ఎలాన్ మస్క్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇంగ్లిష్ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడమే అందరిలో అనుమానాలకు తావిస్తోంది. ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని నమ్మొచ్చా లేదా అని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గతంలోనే ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని చెప్పి అకస్మాత్తుగా ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిలో అపోహలు వచ్చేలా చేయడం గమనార్హం.
ఇంగ్లిష్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ప్రస్తుతం అమెరికన్ గ్లేజర్ కుటుంబం నియంత్రణలో ఉంది. మస్క్ చేసిన ట్వీట్ కు ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మస్క్ కొనుగోలు చేయాలని అనుకున్నా ఎందుకు అనేది స్పష్టం చేయలేదు. ఫుట్ బాల్ టీం అయినా కొంటాడా? లేక బిడ్ వేసి వదిలేస్తాడా? అన్నది డౌట్ కొడుతోంది.
దీనిపై అందరూ ప్రశ్నించడంతో కొన్ని గంటల్లోనే మళ్లీ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. మాంచెస్టర్ ను కొంటున్నారా? ఇది నిజమా? అని ఓ నెటిజన్ అడగగా.. ‘లేదు.. ట్విట్టర్ లో ఈ జోక్ చాలాకాలంగా ప్రాచుర్యంలో ఉంది. నేను ఏ స్పోర్ట్స్ టీంను కొనడం లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు కొందరు షాకైనట్లు కామెంట్లు పెట్టారు. మరికొందరు ఇలాంటి జోకులు అవసరమా? అని మండిపడుతున్నారు.
ఈ ఉదయం ట్వీట్ చేసిన మస్క్ తాను అమెరికాలోని రిపబ్లిక్, డెమ్రోకాట్లకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ‘మాంచెస్టర్ యూనైటెడ్’ను కొనబోతున్నానని షాకిచ్చాడు. కొన్ని గంటల్లోనే అదంతా ఫేక్ అని కొట్టిపారేశాడు.