Begin typing your search above and press return to search.

వాయిస్ ఏదీ : కురసాల ఫుల్ సైలెంట్.. మ్యాటరేంటో...?

By:  Tupaki Desk   |   17 July 2022 2:30 AM GMT
వాయిస్ ఏదీ : కురసాల ఫుల్ సైలెంట్.. మ్యాటరేంటో...?
X
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బలమైన గొంతుకగా వైసీపీకి ఉన్న వారిలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఒకరు. ఆయన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా అడుగుపెట్టింది చిరంజీవి చలవతోనే. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన 2014 నాటికి వైసీపీ రూట్ చూసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడినా 2019లో మాత్రం గెలుపు బావుటా ఎగరవేశారు.

అనూహ్యంగా ఆయన్ని కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి కూడా జగన్ తీసుకున్నారు. దానికి తగినట్లుగానే కురసాల తన శాఖ విషయంలో బాగా పనిచేశారు అన్న పేరు తెచ్చుకున్నారు.

ఇక విపక్షాలను చీల్చి చెండాడంతో ఆయన ముందు వరసలో ఉండేవారు. ప్రత్యేకించి జనసేనాని పవన్ కళ్యాణ్ణి విమర్శించేందుకు ఉబలాటపడేవారు. అలా పేర్ని నాని, కొడాలి నాని వంటి వారి సరసన చేరి వైసీపీలో టాప్ లీడర్స్ లో ఒకరిగా కనిపించేవారు.

అయితే మూడు నెలల క్రితం ఆయన మంత్రి పదవి పోయింది. దాంతో ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయారు. దాని కంటే ముందు ఆయన నియోజకవర్గంలో ఎదురుగాలి వీచడం వల్ల కూడా పెద్దగా ఏమీ మాట్లాడలేకపోతున్నారు అని అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలలో ఇపుడు జనసేనకు కొంత ఊపు కనిపిస్తోంది. దాంతో పవన్ కనుక పిఠాపురం ఎంచుకుని పోటీకి దిగితే కాకినాడ రూరల్, అర్బన్ అని కూడా చూడకుండా చాలా సీట్లు జనసేన వశం అవుతాయని అంటున్నారు.

దీంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల పవన్ మీద విమర్శలు చేయకుండా గమ్మున ఉన్నారు అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయనతో పాటు మాజీ ప్రజారాజ్యం బ్యాచ్ ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోందిట. ఏది ఏమైనా మంచి వాగ్దాటి ఉన్న కురసాల గోదావరి జిల్లాలలో తన గొంతు విప్పకపోవడం పట్ల సర్వత్రా చర్చ అయితే సాగుతోంది. మరి ఆయన ఆలోచనలు ఏంటో ఆయన వేసే స్టెప్ ఏంటో అన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది అంటున్నారు.