Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్

By:  Tupaki Desk   |   6 Sep 2022 3:56 PM GMT
మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్
X
ఆయన వృత్తిపరంగా విద్యా సంస్థల అధినేత. కానీ యాక్సిడెంటల్ గా పాలిటిక్స్ లోకి వచ్చి ఏకంగా మంత్రి కూడా అయిపోయారు. చంద్రబాబు టైంలో అయిదేళ్ల పాటు కీలకమైన పురపాలక శాఖ మంత్రిగా నారాయణ ఒక వెలుగు వెలిగారు.

ఆ టైం లో అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ లో అక్రమాలు చేశారని ఆరోపణలతో ఏపీ సీఐడీ విభాగం ఆయన మీద కొన్నాళ్ళ వెనక కేసు పెట్టింది. ఇక నారాయణ అరెస్ట్ చేస్తారు అని ఆ మధ్యన వార్తలు కూడా వినిపించాయి. మీడియాలో ఆయన అప్పట్లో బాగా ఫోకస్ అయ్యారు.

అయితే ఇపుడు నారాయణకు అరెస్ట్ బాధ తప్పింది. ఆయన్ని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ని హై కోర్టు మంజూరు చేసింది. దాంతో ఈ మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్ లభించింది. నారాయణ మంత్రిగా ఉన్న టైం లో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మొత్తం మార్చేశారు అని సీఐడీ అధికారులు కేసు పెట్టారు. ఈ మొత్తం వ్యవ‌హారాలలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారు అని సీఐడీ గట్టిగానే కేసు పెట్టినా కోర్టులో మాత్రం ప్రాసిక్యూషన్ తరఫున తన వాదనలు వినిపించడంలో విఫలం అయింది.

దాంతో నారాయణకు ముందుస్త్ బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇదిలా ఉంటే తనను అరెస్ట్ చేస్తారు అన్న భయంతో నారాయణ్ హై కోర్టులో బెయిల్ కోసం ఆశ్రయించారు. ఇక ఆయనతో పాటు లింగమనేని లింగమనేని ఎస్టేట్స్ అధినేత లింగమనేని రమేష్, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీకుమార్ లకు కూడా బెయిల్ లభించింది.

ఇదిలా ఉంటే కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే నారాయణ తదితరుల మీద సీఐడీ కేసు పెట్టిందన్న వారి వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించడంతో ముందస్తు బెయిల్ లభించింది. దీంతో మాజీ మంత్రి ఇక ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. అయితే అమరావతి రాజధాని విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న సీఐడీ కానీ ఇతర వ్యవస్థలు కానీ వాటిని నిరూపించడంలో మాత్రం ఎందుకో వైఫల్యం చెందుతున్నారు. దీంతోనే ఇవన్నీ రాజకీయ దురుద్దేశ పూరితమైన కేసులుగా కనిపిస్తున్నాయి అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.