Begin typing your search above and press return to search.
సుర్రెక్కుతున్న సూరి వర్గీయులు.. ధర్మవరం కాక..!
By: Tupaki Desk | 30 Dec 2022 11:30 PM GMTఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా హిడెన్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో టీడీపీ హయాంలో ఎప్పుడూ గన్‌మెన్లు, మందీమార్బలంతో కనిపించిన వరదాపురం సూరి ఉరఫ్ సూర్యనారాయణ.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత.. అనూహ్యంగా అన్నీ సర్దుకుని బీజేపీలోకి వలసపోయారు. తీవ్రమైన భూ ఆక్రమణల ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన బీజేపీలోకి జంప్ చేశారనే వాదన ఉంది.
పోనీ.. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆ పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారంటే అదీ లేదట. తన మానాన తాను ఉంటున్నారు. ఎంతైనా నాయకుడు కదా.. ఆయనకు కూడా.. కార్యకర్తలు ఉంటారు కదా! అదీగాక గత ఎన్నికల్లో ఇంకేముంది.. మనం గెలిచేస్తున్నాం.. అంటే.. పాపం వారంతా కూడా.. అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. మరి నాయకుడు.. అంటే.. తమకు ఎన్నో హామీలుఇచ్చిన(కార్యకర్తలకు) నాయకుడుఇప్పుడు ఏం చేస్తున్నారంటూ.. గత నాలుగేళ్లుగా ఆయన అసలు అందుబాటులో లేరట.
దీంతో కార్యకర్తల ఒకవైపు పత్తాలేకుండాపోవడం.. ఖర్చు పెట్టి రెండో స్థాయి నాయకులు ఖర్చయిపోవడంతో ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరి మాటే వినిపించడం లేదని అంటున్నారు.
అయితే.. సూరికి ఉన్న ఇద్దరు ప్రధాన అనుచరులు మాత్రం.. `మా నాయకుడి పేరు ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపిస్తోంది!`` అని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే.. చంద్రబాబు దగ్గరో.. లేక నారా లోకేష్ దగ్గరో వినిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి ఆయన తెరచాటున చక్రం తిప్పుతున్నారా? అనే సందేహాలు లేకపోలేదు.
ఇదిలావుంటే.. 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. దీంతో టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వరదాపురంసూరికి సన్నిహితంగా ఉన్న వారు సైతం ఏ కండువా వేసుకోవాలో తెలియక ఆయనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ధర్మవరం.. ఇప్పుడు హిడెన్ పాలిటిక్స్‌తో హాట్ టాపిక్‌గా మారిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.