Begin typing your search above and press return to search.

గంటా రూట్ క్లియర్...పవన్ తో షేక్ హ్యాండ్ ...?

By:  Tupaki Desk   |   12 Nov 2022 3:32 PM GMT
గంటా రూట్ క్లియర్...పవన్ తో షేక్ హ్యాండ్ ...?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. విశాఖ సాగర తీరాన ఉన్న ఒక హొటల్ లో పవన్ బస చేశారు. అదే హొటల్ లో మోడీ కోసం మీటింగ్ కి వచ్చిన ఇతర జిల్లాల బీజేపీ నాయకులు కూడా విడిది చేశారు. వారిలో మాజీ ఎంపీ, ఒకనాటి టీడీపీ నేత అయిన టీజీ వెంకటెష్ ని కలవడానికి గంటా వచ్చారు అని బయట ప్రచారం జరిగింది.

కానీ నిజానికి గంటా వచ్చినది పవన్ కళ్యాణ్ తో భేటీ కావడానికే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సీక్రెట్ గా గంటా పవన్ని కలిశారా కలిస్తే ఎందుకు కలిశారు. ఆ మ్యాటరేంటి అంటే చాలా ఇంపార్టంటే అని అంటున్నారు. ఏపీలో రాజకీయం మారుతోంది. దానిని అందరి కంటే ముందు ఎపుడూ గంటా శ్రీనివాసరావు లాంటి వారే గమనిస్తారు. ఇపుడు కూడా అదే జరుగుతోంది అని అంటున్నారు.

గంటా టీడీపీలో ఉన్నా అలికిడి అయితే పెద్దగా లేదు. తాను ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా సైలెంట్ గా ఉంటూ గత ఏడాది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపధ్యంలో రాజీనామా చేశారు. అది స్పీకర్ వద్ద పెండింగులో ఉంది. ఆమోదం అయితే పొందలేదు. ఇక గంటా ఏ పార్టీలోకి వెళ్తారు అని చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ చేస్తున్న ఏ ఉద్యమంలోనూ పెద్దగా కనిపించలేదు.

అయితే అదే టైం లో ఆయన ఆ పార్టీని వీడినట్లుగా చెప్పడంలేదు. లేకపోతే టైం కోసం చూస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు ఆ టైం వచ్చేసిందా అన్న చర్చ నడుస్తోంది. ఏపీలో చంద్రబాబు పవన్ కలుసుకోవడం, రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయని వార్తలు రావడం గత నెలలో జరిగితే ఇపుడు ఏకంగా ప్రధాని మోడీ పవన్ని పిలిపించుకుని ముచ్చటించారు. దాంతో బీజేపీ వైపు నుంచి కూడా సిగ్నల్స్ వస్తున్నాయి అని అంతా గ్రహించారు.

దీంతో గంటా వంటి వారు తెలివిగా తమ వైపు నుంచి పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. మెగా ఫ్యామిలీతో గంటాకు అనుబంధం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెడితే ఉత్తరాంధ్రా ఆ పార్టీ కొమ్ము కాసింది గంటావే. అనాడు పవన్ తోనూ ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే కాలక్రమంలో చిరంజీవితో రిలేషన్స్ బాగున్నా పవన్ తో మాత్రం గ్యాప్ వచ్చింది అని వినిపించింది. దానిని పూడ్చుకునే క్రమంలో గంటా ఆ మధ్య గాడ్ ఫాదర్ మూవీ హిట్ అయిన సందర్భంగా చిరంజీవిని అభినందించే క్రమంలో ఆయన ఇంటికి వెళ్ళి కలసి వచ్చారు.

నాడే గంటా రూట్ జనసేన వైపు అని అంతా అనుకున్నారు. ఇపుడు మరింత వేగంగా ఆయన అడుగులు పడుతున్నాయని అంటున్నారు. అయితే గంటా తెలివిగానే పవన్ని కలిశారు అని అంటున్నారు. రేపటి రోజుల టీడీపీతో పొత్తులు ఉంటే కనుక తనతో పాటు తన టీం కి ఎక్కడ టికెట్ల సమస్య రాకుండా సర్దుబాటు చేసుకోవడం కోసం కలిశారు అని అంటున్నారు.

అలా కాకపోతే ఏకంగా పొత్తులకే ఇబ్బంది వచ్చి కలవకపోతే అపుడు గంటా ఏం చేస్తారు అంటే దానికి కూడా రూట్ క్లియర్ చేసుకోవడానికే ముందుగా గంటా పవన్ని కలిశారు అని అంటున్నారు. ఏది ఏమైనా గంటా పవన్ తో భేటీ అంటే ఉత్తరాంధ్రా రాజకీయాల్లో అది సంచలనం అనే చెప్పాలి. అలాగే వైసీపీ లాంటి పార్టీలకు బిగ్ షాక్ అని కూడా చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.