Begin typing your search above and press return to search.
గంటా వారి మాస్టర్ ప్లాన్. వర్కౌట్ అయితే సూపర్ హిట్టే... ?
By: Tupaki Desk | 21 March 2022 9:34 AM GMTఆయన ప్లాన్స్ ఎపుడూ అదుర్స్. వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గంటా మాస్టార్ గత రెండు దశాబ్దాలుగా పొలిటికల్ గా నాటౌట్ అనే అంటున్నారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఉన్నారు. ఆయన ఎన్ని పార్టీలు మార్చినా ఎన్ని నియోజకవర్గాలను మార్చినా కూడా విజయం మాత్రం ఆయనకు దక్కుతోంది అంటే గంటా టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవాల్సిందే.
గంటా ప్రస్తుతం విశాఖ సిటీలోని నార్త్ సీటు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడేళ్ళు గడచినా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ పెద్దగా తిరగడంలేదు. మరో వైపు గంటా మీద ఓడిన కేకే రాజు అక్కడ ఇంచార్జిగా ఉన్నారు. ఒక విధంగా ఆయనే అనధికార వైసీపీ ఎమ్మెల్యే అన్న మాట. దాంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన పాత్ర పెద్దగా లేదని గ్రహించిన గంటా గత ఏడాది ఇదే సమయానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం ప్రకటించడంతో స్టీల్ ప్లాంట్ కి మద్దతుగా అంటూ రాజీనామా చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ రోజు వరకూ చూస్తే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యేగా గంటా ఉన్నారు. అయితే ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటిదాకా ఆమోదించలేదు.
ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా గంటా ఆయనకు మరోసారి లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదించాలని అందులో గట్టిగా కోరారు. గంటా పదే పదే రాజీనామా ఆమోదించాలని కోరడం వెనక మాస్టర్ ప్లాన్ ఉందని అంటుననరు. గంటా కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఉత్తరాంధ్రాలో పట్టున్న నేత. ఆ మాటకు వస్తే ఏపీవ్యాప్తంగా బలమైన కాపు సామాజికవర్గంలో ముఖ్య నేత.
అంగబలం, అర్ధబలం దండీగా కలిగిన గంటా భారీ స్కెచ్ తోనే రాజీనామా విషయంలో వత్తిడి తెస్తున్నారు అని అంటున్నారు. తన రాజీనామాను ఆమోదించమని కోరడం ద్వారా ఆయన స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసిన వారిగా గుర్తింపు పొందాలనుకుంటున్నారు. అదే టైంలో విపక్ష ఎమ్మెల్యేగా ఎందుకు కానీ పదవిని వదిలించుకుని ఫ్రీ బర్డ్ కావాలని చూస్తున్నారు. ఇక గంటా చూపు అంతా వచ్చే ఎన్నికల మీద ఉంది.
ఆయన ఈ మధ్య తరచుగా కాపుల మీటింగులను నిర్వహిస్తున్నారు. మేధావులను, ఉన్నతాధికారులను, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఒక చోట చేర్చి కాపులను ఏకత్రాటి మీదకు తేవాలని అనుకుంటున్నారు. ఆ విధంగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉంటే ఏ పార్టీలోకి వెళ్లినా తనకూ తన వర్గానికి పెద్ద ఎత్తున సీట్లను దక్కించుకోవడం అన్నది ఆయన టార్గెట్ అని చెబుతున్నారు.
అదే విధంగా తాను ఉండే పార్టీలో తన మాట చలామణీ కావాలన్న కోరిక కూడా గంటాకు ఉందని చెబుతున్నారు. ఆయన ఇప్పటిదాకా ఏ పార్టీలో ఉన్నా కూడా అధినాయకుడికి అతి సన్నిహితంగా ఉంటూ తన హవాను చాటుకున్నారు. ఇపుడు గంటా టీడీపీలో అంతగా యాక్టివ్ గా లేరు. ఆయన వైసీపీ వైపు వెళ్లాలని ఆ మధ్య దాకా చూసినా ఇపుడు ఆ ఆలోచనలను విరమించుకున్నారు అని అంటున్నారు.
ఆయన జనసేన వైపుగా ఇపుడు చూస్తున్నట్లుగా ప్రచారం అవుతోంది. తనకున్న బలాన్ని బలగాన్ని చూపించడం ద్వారా ఉత్తరాంధ్రా జిల్లాల్లో జనసేనకు పెద్ద దిక్కు కావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక జనసేనలో గంటా వంటి బిగ్ షాట్ వస్తే నో అనే సీన్ ఉండదు, ఆయన మీద బాధ్యతలు పెడితే మూడు జిల్లాల్లో జనసేనకు గణనీయమైన సీట్లను సంపాదించిపెడతారు. మొత్తానికి గంటా మాస్టర్ స్ట్రాటజీతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
ఎంత తొందరగా మాజీ ఎమ్మెల్యే అయితే అంత తొందరగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టవచ్చు అన్నదే గంటా వారి లేటెస్ట్ థాత్శ్ అని అంటున్నారు. మొత్తానికి గంటా రాజీనామాను ఆమోదించకుండా స్పీకర్ తమ్మినేని లేట్ చేస్తున్నారు. మరి దీని మీద గంటా ఏం చేస్తారో చూడాలి