Begin typing your search above and press return to search.
గంటాకు తమ్ముళ్ల మంట : ఉత్తరం సీటుకు ఎసరు పెడుతున్నదెవరు...?
By: Tupaki Desk | 24 July 2022 3:30 AM GMTఆయన మామూలు లీడర్ కాదు, రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం గడించిన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేసిన నాయకుడు. అయనే గంటా శ్రీనివాసరావు. ఇక ఆయనకు రాష్ట్ర నాయకుడు అన్న పేరు ఉంది. ఆయన టీడీపీలో గత మూడేళ్ళుగా సైలెంట్ గా ఉండడమే ఇపుడు కొంప ముంచుతోంది. తాను టీడీపీలోనే ఉన్నాను అని ఆయన చెబుతున్నా కూడా తమ్ముళ్ళు ఎవరూ పట్టించుకోవడంలేదు.
గంటా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తరం నుంచి ఆయన మళ్ళీ పోటీ చేయరు, చేయనీయమంతే అన్నట్లుగా చాలా మంది మాజీలు తాజాలు రెడీ అయిపోతున్నారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గాన్ని గంటా తన మేనల్లుడు విజయ్ బాబుకు అప్పగించారు. గంటా ఈ మూడేళ్ళ కాలంలో వెళ్ళింది కూడా తక్కువే. దాంతో పాటు హై కమాండ్ కి ఎడం పాటించడంతో గంటా మీద ఉత్తరం టీడీపీ నేతలు మండుతున్నారు.
ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వరు, ఇచ్చినా ఆయన ఇక్కడ పోటీ చేయరు అంటూ ముందే నిర్ధారణకు వచ్చేసిన తమ్ముళ్లు ఎవరికి వారు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు క్యూ కడుతున్నారు. వారిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఒకరు. ఆయన సీనియర్ నేత. బీసీ నాయకుడు. చంద్రబాబుకు బాగా ఇష్టమైన నేత. ఆయన తనకు టికెట్ ఇస్తే గెలిచి వస్తానని హై కమాండ్ కి చెప్పి ఉంచారట.
ఆయనతో పాటు లోకల్ లీడర్స్ కూడా కొంతమంది రేసులో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసైనా ఉత్తరం సీటుని దక్కించుకోవాలని చూస్తున్న వారూ ఉన్నారు. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యే మాజీ టీడీపీ నేత పంచకర్ల రమేష్ బాబు అగ్ర భాగాన ఉన్నారుట. ఆయన తనకు ఉత్తరం టికెట్ ఇస్తే కనుక టీడీపీలోకి వస్తానని చెబుతున్నారుట
ఆయన మాదిరిగానే ఉత్తరం మీద కన్నేసిన మరో వైసీపీ నేత కూడా ఉన్నారుట. ఈయన కూడా సామాజిక వర్గాల సమీకరణలు తనకు అనుకూలిస్తాయని టికెట్ ఇవ్వాలని బాబును కోరుతున్నారుట. ఇక మరో బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ ఉన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఆయన టికెట్ ఇస్తే టీడీపీలో చేరి అయినా పోటీకి తయారుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు. ఇక గంటా విషయానికి వస్తే ఆయన టీడీపీలోనే ఉన్నారు. తాను నియోజకవర్గం మారుతాను అని ఎక్కడా చెప్పలేదు.
అయినా సరే తమ్ముళ్ళు క్యూ కడుతున్నారు అంటే కచ్చితంగా గంటా విషయంలో హై కమాండ్ వేరేగా ఆలోచిస్తుంది అన్న ధైర్యంతోనే అంటున్నారు. మొత్తానికి మునుపటి పరపతి టీడీపీలో గంటాకు తగ్గిందా అన్న డౌట్లు వస్తున్నాయి. లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే మేము రెడీ అని తమ్ముళ్ళు అనడమేంటి అన్న చర్చ వస్తోంది.