Begin typing your search above and press return to search.
బాబును భయపెడుతున్నది జగన్ మాత్రం కాదు....?
By: Tupaki Desk | 3 Sep 2022 11:30 PM GMTచంద్రబాబు రాజకీయ గండరగండడు అని చెప్పాలి. ఆయన బుర్ర నిండా వ్యూహాలే ఉంటాయి. అపరచాణక్యుడు అని ఆయనకు మరో పేరు. ఒక్కోసారి వ్యూహాలు బెడిసికొట్టవచ్చు కానీ దాని బాబు లాంటి మరో వ్యూహాన్ని కూడా చంద్రబాబు రెడీ చేసుకోవడంతోనే ఆయనలో టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఇక చంద్రబాబుకు ప్రజాకర్షణ లేదని, ఆయనను చూసి ఓటేయరని ప్రత్యర్ధులు అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం అంతా మరచిపోతున్నారు.
చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1 న అటు ముఖ్యమంత్రి సీటు తో పాటు పార్టీ అధ్యక్ష పదవిని కూడా తీసుకున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో పద్నాలుగేళ్ల పాటు మూడు విడతలుగా సీఎం గా చేశారు. కానీ టీడీపీ ప్రెసిడెంట్ గా గత ఇరవై ఏడేళ్ళుగా ఉంటున్నారు. బాబులో ప్రజాకర్షణ లేకపోయినా ఓట్లు సాధించే నైపుణ్యం లేకపోయినా జనాల మాట పక్కన పెడితే పార్టీ వారు అయినా ఇన్నేళ్ళ పాటు ఆయనను అట్టిపెట్టుకుని ఉంటారా అన్నది కూడా చూడాలి కదా.
అందువల్ల నిస్సందేహంగా బాబు గట్టి లీడరే. ఆ విషయంలో రెండవ మాటకు తావు లేదు. బాబు కూడా పాదయాత్రలు చేశారు, బస్సు యాత్రలు చేశారు. జిల్లాల టూర్లు చేశారు. నిరంతరం ప్రజలలో ఉంటూ వచ్చారు. అధికారం దక్కడం, పోవడం అన్నది ఎపుడూ జనాల చేతిలో ఉంటుంది. దానికి అనేక పరిస్థితులు దోహదపడతాయి. అవి ఒక్కోసారి ఎదురుతిగినపుడు ఎన్టీయార్ లాంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడే ఓడారు. ఇందిరాగాంధీ ఓడారు.
అందువల్ల బాబు ఓట్లు తెచ్చే నేత కాదు అన్న ప్రత్యర్ధుల విమర్శలు తప్పు అనే చెప్పాలి. చిత్రమేంటి అంటే బాబు ప్రత్యర్ధులు ఆయన్ని ఎపుడూ మెచ్చుకోరు. వారు అలాగే అంటారు. కానీ చంద్రబాబు బలాబలాలు అన్నీ తెలిసి దగ్గరుండి చూసిన వారు ఆయనకూ టీడీపీకి శ్రేయోభిలాషులుగా చెప్పుకునే వారే ఆయన్ని కడు బలహీనుడిగా వర్తమాన రాజకీయాల్లో నిలబెడుతున్నారు. బాబుకు, టీడీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్న కొన్ని తెలుగు చానళ్ళు అయితే ఇటీవల కాలంలో పొత్తుల విషయంలో చేసిన రచ్చ వల్ల టీడీపీకి బాబుకు చాలానే ఇబ్బందులే వచ్చాయని అంటున్నారు.
బీజేపీకి ఏపీలో పాయింట్ జీరో ఎయిట్ శాతం ఓట్లు ఉన్నాయి. అలాంటి పార్టీతో టీడీపీ పొత్తు ఉండాలని, లేకపోతే టీడీపీ గెలవలేదు అనే విధంగా వార్తలు వండి వార్చడం వల్ల బాబు ఇమేజ్ కే డ్యామేజ్ తెచ్చామని వారు అనుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే కొన్ని జిల్లాలలో ఇబ్బందులు వస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ విధంగా మస్తుగా ఉన్న టీడీపీని, జబర్దస్తుగా ఉన్న బాబుని పొత్తుల బాబుగా మార్చేస్తున్నారు అన్న చర్చ అయితే పార్టీలోనే సాగుతోంది.
బాబు కేంద్రంలోని బీజేపీ పెద్దల కరుణ కోసం చూస్తున్నారు అనిపించేలా వార్తా కధనాలు రావడం వల్ల టీడీపీకి ఏ మేరకు ఉపయోగం ఉంటుంది అన్నది కూడా ఆలోచించడంలేదు. నిజానికి జనాలు ఎపుడూ కరెక్ట్ గా అన్నీ ఆలోచించి తీర్పు ఇస్తారు. ఏపీలో వైసీపీని దించాలంటే వెంటనే ఉన్న ఆల్టర్నేషన్ టీడీపీ మాత్రమే. ఆ పార్టీకి గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా క్యాడర్ ఉంది.
ఎన్నో ఎన్నికలను చూసిన పార్టీ, బాబు కూడా ఎన్నో యుద్ధాలలో ఆరితేరిపోయారు. అలాంటి టీడీపీ ఒంటరిగా వెళ్తే పోటీ చేసి జగన్ మీద గెలవలేదు అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం వల్ల మరోవైపు వైసీపీ బలోపేతం అవుతోంది అన్న విషయాన్ని కూడా మరచిపోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఎన్టీయార్ ఇందిరలే జనాగ్రహానికి కొట్టుకుపోయారు. ప్రజలు వద్దు అనుకుంటే వైసీపీ గద్దె దిగిపోతుంది. దానికి పొత్తులే ఉండాలన్న రూల్ లేదు, ఇక పొత్తులు పెట్టుకున్నా వైసీపీ పట్ల జనాభిమానం ఉంటే కచ్చితంగా ఆ పార్టీయే గెలుస్తుంది.
ఇదీ రాజకీయాల్లో ఉన్న కామన్ సూత్రం, మరి దీన్ని పక్కన పెట్టి ఎంతసేపూ టీడీపీ ఇతర పార్టీలు అన్నీ కలసి వైసీపీని ఓడిస్తాయని పదే పదే ప్రచారం చేయడం వల్లనే జనాలలో ఒక భావనను పంపిస్తున్నారు అని అంటున్నారు. పొత్తులు లేకపోతే టీడీపీ గెలవలేదు వీక్ అన్న బ్రాండ్ ని కూడా వేసి మరీ పంపిస్తున్న వారు ప్రత్యర్ధులు కాదు అస్మదీయులే. దాని వల్లనే టీడీపీకి అసలైన డ్యామేజ్ జరుగుతోంది అంటున్నారు.
ఇపుడు కాలం మారింది. ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసే కాలం కాదు, ఓల్డ్ ట్రెండ్ మాదిరిగా మీడియాను పట్టుకుని వారి అండతో గెలుద్దామనుకున్నా కుదిరేది కానే కాదు, అందువల్ల ఇప్పటికైనా టీడీపీ ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలికేలా చూసుకుని తానేంటో తెలుసుకుని అడుగులు వేయడం మంచిది. పొత్తు కుదిరితే ఓకే. లేకపోయినా మొత్తం 175 సీట్లలో పోటీ చేయగల సత్తా ఆ పార్టీకే ఉంది అన్నది మరచిపోకూడదు. సో బాబును భయపెడుతున్న శక్తులు తమ వైపు ఉన్నా కూడా తీసి పక్కన పెట్టడమే ఇపుడు టీడీపీ అసలైన పని అని శ్రేయోభిలాషులు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.