Begin typing your search above and press return to search.
జగన్ స్లోగన్...బాబుకు గన్...?
By: Tupaki Desk | 4 May 2022 2:30 PM GMTశత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అని రాజకీయాల్లో చెబుతారు. అలాగే ప్రత్యర్ధి నోట వచ్చిన ఒక మాట కూడా తరువాత కాలంలో అవతల పక్షానికి బలమైన స్లోగన్ గా మారే చాన్స్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఒడిసిపట్టి గురిపెడితే గన్ షాట్ టార్గెట్ ని రీచ్ అవుతుంది. అలాంటిదే బాదుడే బాదుడు ప్రోగ్రాం.
అసలు ఈ మాట ఫస్ట్ వచ్చింది జగన్ నోట. ఆయన ఆనాడు పాదయాత్ర సందర్భంగా ప్రతీ చోటా పెట్టే మీటింగులో చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు అంటూ అటూ ఇటూ చేతులు గాల్లో ఊపుతూ గంభీరంగా ప్రకటించేవారు. అందులో అన్ని రకాల పన్నులు, చార్జీలను కూడా ప్రస్థావిస్తూ ఆయన బాబు ఏలుబడిలో బాదుడే బాదుడు అని గట్టిగా సౌండ్ చేసేవారు. ఒక విధంగా జనాలను ఆ మాటలు బాగా అట్రాక్ట్ చేశాయి. ఇక 2019ఎన్నికలలో ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే.
ఇపుడు జగన్ మూడేళ్ళ పాలనలో అన్ని రకాలైన పన్నులు పెంచేశారు, చివరాఖరుకు చెత్త పన్ను కూడా విధించారు, ఆర్టీసీ తో సహా కరెంట్ చార్జీలతో సహా అన్నీ ఆకాశాన్ని అంటాయి. మరి టీడీపీ ఊరుకుంటుందా. అందుకే జగన్ నోటి వెంట వచ్చిన బాదుడే బాదుడు అన్న మాటనే టైటిల్ గా పెట్టి మరీ ఊరూ వాడా నిరసనలు తెలియచేస్తోంది.
గత కొంతకాలంగా సాగుతున్న ఈ నిరసనలకు జనంలో ఎంతో కొంత అదరణ దక్కుతోంది. ఇపుడు దాన్ని మరింతగా పెంచేందుకు ఫోకస్ మొత్తం జగన్ కి యాంటీగా ఉండేలా చూసేందుకు చంద్రబాబు ఫీల్డ్ లోకి దిగిపోతున్నారు. ఆయన బాదుడే బాదుడు ప్రోగ్రాం లో ఫస్ట్ టైమ్ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అది కూడా తమకు అచ్చి వచ్చిన శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలెడుతున్నారు.
నాడు జగన్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో హావభావాలతో బాదుడే బాదుడు అంటూ జనాలను అట్రాక్ట్ చేశారు. ఇపుడు బాబు ఏ తీరున బాదుడే బాదుడు అంటూ జనాలను ఆకట్టుకుంటారో చూడాలి. ఏది ఏమైనా మూడేళ్ళుగా వైసీపీ సర్కార్ మీద టీడీపీ చేస్తున్న పోరాటాలు అన్నీ ఒక ఎత్తు అయితే బాదుడే బాదుడు మరో ఎత్తు. ఇందులో జనం బాధలు ఉన్నాయి. వారి కష్టాలు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి.
అయితే బాదుడే బాదుడు అంటూ జగన్ని విమర్శించి ఊరుకోకుండా చంద్రబాబు జనాలకు కాస్తా ఉపశమనం కలిగించే మాటలు చెప్పాలి. ఒక విధంగా ఆయన హామీ కూడా ఇవ్వాలి. రేపటి రోజున తమ ప్రభుత్వం వస్తే ఇంత పెద్ద ఎత్తున విధించిన చార్జీలను పన్నులను వెనక్కి తీసుకుంటామని చెబితేనే ఈ ఆందోళనకు అదరణ దక్కుతుంది అంటున్నారు. జగన్ని విమర్శించి పోతే మాత్రం అనుకున్న పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. చూడాలి మరి బాదుడే బాదుడు లో బాబు గారి జన భరోసా ఎలా ఉంటుందో.