Begin typing your search above and press return to search.
టీడీపీతోనే పయనం...పవన్ క్లారిటీ...మోడీ షా ఏం చేయబోతున్నారు....?
By: Tupaki Desk | 20 Dec 2022 3:32 AM GMTఏపీ రాజకీయాలు ఇపుడు కీలక మలుపు దిశగా సాగనున్నాయి. 2019 ఎప్పటికీ 2024 కానే కాదు అని పవన్ సత్తెనపల్లి మీటింగ్ సాక్షిగా సత్యమే చెప్పారు. పైగా ఆయన చాలా క్లారిటీతో మాట్లాడారు. జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం వల్లనే వైసీపీ గెలిచిందని కొత్త అర్ధం వినిపించారు. తాము విడిగా ఉండడం వల్లనే సీఎం కుర్చీ జగన్ కి దక్కింది తప్ప జనాదరణతో ఏ మాత్రం కాదు సుమా అని ఇండైరెక్ట్ గా సెటైరూ వేశారు.
మళ్లీ ఆ అవకాశం వస్తుందనో ఇస్తామనో అనుకుంటో పొరపాటే సుమా అని గట్టి హెచ్చరికను పంపించారు. ఇలా పవన్ చాలా స్పష్టంగా మాట్లాడారు. వైసీపీని ఎలా దించాలో వ్యూహం తన దగ్గర ఉందని పవన్ చెప్పాక ఇక జనసైనికులకు కంగారు ఏమి ఉంటుంది. అదే టైంలో టీడీపీ ఆయాసపడాల్సిన అవసరం కూడా ఉండదు.
ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ అంటున్నారు. మరి అది ఎలా సాధ్యం అంటే ఏపీలో బలమైన టీడీపీని కలుపుకుంటేనే తప్ప అది సాధ్యపడదు. పవన్ చాలా స్ట్రాంగ్ ఆ మాట అంటున్నారు అంటే కచ్చితంగా పసుపు పార్టీతో చెలిమి కోసమే అని అంటున్నారు. జనసేన అంతర్గత సమావేశాల్లో కూడా ఇదే విషయం చర్చకు వచ్చిందని చెబుతున్నారు.
ఏపీలో వైసీపీని ఓడించడం జనసేనకు అవసరం. అలాగే టీడీపీకి అవసరం. కానీ బీజేపీ అజెండా వేరుగా ఉంది. ఆ సంగతి పవన్ గ్రహించారు అని అంటున్నారు. ఈ మధ్యన విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ తో అరగంట పాటు మాట్లాడారు. ఆ సందర్భంగా బీజేపీ రోడ్ మ్యాప్ పవన్ కి ఇచ్చారు అని అంటున్నారు.అయితే ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన పవన్ ముఖకవలికలు చూసిన వారికి అర్ధమైంది ఏంటి అంటే ఆ రోడ్ మ్యాప్ అన్నది పవన్ కి పెద్దగా ఇష్టపడలేదని.
ఇక ఏపీలో సొంతంగా ఎదగాలన్నది బీజేపీ ఆలోచన అని చెబుతున్నారు. దాని కోసం మరో ఎన్నిక వరకూ వేచి ఉండే ఓపిక బీజేపీకి ఉంది. బీజేపీ జాతీయ పార్టీ. పైగా ఏపీలో వైసీపీ మళ్ళీ పవర్ లోకి వచ్చినా ఆ పార్టీకి ఏమీ పోయేది లేదు. పైగా రాజకీయ లాభమే. ఎందుకంటే పరోక్ష మిత్రునిగా జగన్ ఆ పార్టీతో ఉన్నారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఏ మాత్రం తగ్గినా కూడా సర్దేసేందుకు వైసీపీ ఉంటుంది అన్న భరోసా ఉంది.
అదే టైం లో టీడీపీ ఏపీలో 2024 ఎన్నికల్లో ఓడిపోతే కనుక తమకు ఏపీలో దూసుకుపోయేందుకు కావాల్సినంత స్పేస్ ఏర్పడుతుంది అన్నది బీజేపీ మరో దూరాలోచన. ఆ సంగతే పవన్ కి చెప్పి ఉంటారని అంటున్నారు. ఇక పవన్ వైఖరి చూస్తే ఆయనకు అర్జంటుగా జగన్ గద్దే దిగిపోవాలని ఉంది. తాను సీఎం అవుతానా కాదా అన్నది కూడా పక్కన పెట్టి మాజీ సీఎం గా జగన్ని చూడాలనుకుంటున్నారు అని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.
దాంతో పాటు జనసేనకు మరిన్ని ఇబ్బందుకు కూడా ఉన్నాయి. 2014లో పార్టీని పెట్టారు. పోటీ చేయలేదు, 2019లో పోటీ చేస్తే దారుణమైన ఫలితం వచ్చింది. 2024లో కూడా ఉనికిని చాటుకోకపోతే 2029 దాకా పార్టీని కొనసాగించడం కష్టమన్న వాదన ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కి కూడా 2024 ఎన్నికలు ఇంపార్టెంట్. టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో పాలు పంచుకుంటే జనసేన స్ట్రాంగ్ అవుతుంది. మరో అయిదేళ్ళలో పార్టీ బేస్ ని బాగా పెంచుకుని 2029లో కావాల్సి వస్తే ఒంటరిగా బరిలోకి దిగడమో లేక బీజేపీతో పొత్తు పెట్టుకోవడమో చేయవచ్చు.
ఇలా పవన్ ఆలోచనలు ఉన్నాయని, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వంటి వారు కూడా అదే చెబుతున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీని కూడా తమతో కలసి రమ్మని పవన్ చివరి దాకా కోరుతారని, అది కనుక కుదరకపోతే మాత్రం టీడీపీతో పొత్తుకే చూస్తారని అంటున్నారు. మరి ఏపీలో ఈ విధంగా రాజకీయ పరిణామాలు మారితే బీజేపీ వ్యూహాలు తేలిపోతున్న వేళ ఢిల్లీలోని కాషాయం పెద్దలు ఏం చేస్తారు అన్న చర్చ అయితే వస్తోంది.
ఏపీలో టీడీపీకి పవన్ ఊపిరి ఊదితే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము దూరంగా ఉంటే కచ్చితంగా కేంద్రంలో సీట్లు రాకపోతే అక్కరకు ఎవరు ఆదుకుంటారు అన్నది అతి పెద్ద ప్రశ్న. ఇక బీజేపీ కూడా 2029 లో సొంతంగా అధికారంలోకి రావడం, ఏపీలో టీడీపీని వీక్ చేయడం వంటి ఆలోచనలు మానేసి పవన్ తో పాటే టీడీపీకి షేక్ హ్యాండ్ ఇచ్చి 2014 పొత్తులను రిపీట్ చేయాల్సి ఉంటుంది. అలా కేంద్రంలో మరోమారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చూసుకోవచ్చు.
అంటే పవన్ రూట్ మ్యాప్ లోకే బీజేపీ రావాలి అన్న మాట. దానికి రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న మోడీ అమిత్ షా ఏమి చేస్తారు ఏమాలోచిస్తారు అన్నది కూడా చూడాలి. తాము టీడీపీకి వైసీపీకి దూరం అంటూ తటస్థంగా ఉంటూ 2024 ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే వారి వైపు తిరగడం మరో వ్యూహం. మరి బీజేపీ ఏమి చేస్తుంది. మోడీ అమిత్ షాలు పవన్ బాటలో నడచి సర్దుకుపోతారా లేక తాము తగ్గేదే లే అంటూ నిలబడతారా అన్నది చూడాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.