Begin typing your search above and press return to search.

జస్ట్ ఇరవై సీట్లకే పవన్ పడిపోతారా... ?

By:  Tupaki Desk   |   28 Dec 2022 7:30 AM GMT
జస్ట్ ఇరవై సీట్లకే పవన్ పడిపోతారా... ?
X
పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్. నా పేరు లో పవర్ కాదు అసలు పవర్ మనకు దక్కాలి అని అనేకసార్లు పవన్ జనసైనికులతో అంటూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ పొత్తుల వైపు అడుగులు వేస్తున్నారు అని చర్చ అయితే సాగుతోంది. పొత్తులకు బీజం దాదాపు రెండు నెలల క్రితం పడిపోయింది అని అంటున్నారు.

అక్టోబర్ నెలలో విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్ తో ఒక హొటల్ లో భేటీ అయిన చంద్రబాబు పొత్తుల విషయం మీద చర్చించారని అంటున్నారు. ఇక నాటి నుంచి ఒక పద్ధతిలోనే రెండు పార్టీలు తెర వెనక కసరత్తుని సీరియస్ గా నడుపుతున్నాయని చెప్పుతున్నారు. ఇక లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కి ఇరవై సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని అని.

ఈ సీట్లలో పక్కాగా గెలుస్తామని జనసేన పవన్ కళ్యాణ్ గట్టి నమ్మకంతో ఉన్నారట. అందుకే ఎంచి మరీ ఈ సీట్లను జనసేన కోరుకుంటోందని అంటున్నారు. నిజానికి చంద్రబాబు ముప్పై సీట్ల దాకా జనసేనకు ఇవ్వాలని అనుకుంటునారుట. కానీ గెలిచే సీట్లు అని ఒక ఇరవై దాకా లిస్ట్ జనసేన దగ్గర ఉంది. దాన్ని వారు డిమాండ్ చేయడంతో తెలుగుదేశం కూడా ఓకే అని చెప్పేస్తోందిట.

నిజానికి ఆ సీట్లలో తెలుగుదేశానికి మంచి బలం ఉంది. అయితే ఆ సీట్లను జనసేన కోరుకోవడంతో ఇవ్వడానికే బాబు సమ్మతించారని చెబుతున్నారు. ఇక ఈ సీట్లలో సగానికి పైగా ఇప్పటికే జనసేన వర్క్ స్టార్ట్ చేసేసింది అని అంటున్నారు. మరో విషయం ఏంటి అంటే ఉత్తరాంధ్రా. ఉభయగోదావరి, క్రిష్ణా జిల్లాలోని విజయవాడ, తిరుపతి, గుంటూర్లలో సీట్లను జనసేన టిక్కు పెట్టి మరీ కోరినట్లుగా చెబుతుననరు. వీటిలో ఉమ్మడి విశాఖలో మూడు సీట్లను జనసేన పట్టుబట్టింది అని తెలుస్తోంది.

విశాఖలో జనసేన రుషికొండ విషయంలో గట్టి పోరాటం చేస్తూ వస్తఒంది. అలాగే వైసీపీ పాలన మీద దూకుడుగా ఉద్యమాలు చేస్తోంది. దాంతో విశాఖ నుంచి కచ్చితంగా గెలిచే మూడు సీట్లు జనసేన కోరుకుంటోంది అని అంటున్నారు. అదే విధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో చూస్తే జనసేన రెండు ఎస్సీ సెగ్మెంట్లను కోరుతోంది అని ప్రచారంలో ఉంది. ఇక విజయవాడ నగరంలో ఒక సీటును అడుగుతున్నారు. బహుశా అధి పోతిన మహేష్ కోసం అని అంటున్నారు.

పశ్చిమ నియోజకవర్గంలో ఆ సీటు ఉంది అని తెలుస్తోంది. అలాగే, గుంటూరు జిల్లాలో మరో మూడు సీట్లు జనసేన అడుగుతోంది.ఇందులో నాదెండ్ల మనొహర్ పోటీ చేయాల్సిన తెనాలి సీటుతో పాటు గుంటూర్ సిటీ కన్నా లక్ష్మీనారాయణ కోసం అని అంటున్నారు. ఆయన్ జనసేనలో చేరుతారని టాక్ ఉంది. ఇక మరో సీటు అయితే ఏకంగా మంత్రి అంబటి రాంబాబుని ఓడించడానికి అని అంటున్నారు. అంబటి పోటీ చేసే సత్తెనపల్లిలో ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారు. ఆయన్ని కాపుల గుండెల్లో కుంపటి అని కూడా నిందించారు.

అంబటి కూడా పవన్ మీద విమర్శలు ఘాటుగా చేస్తారు. దాంతో అంబటిని ఓడించే బాధ్యతను తామే తీసుకోవాలని జనసేన అనుకుంటోందిట. సో సత్తెనపల్లి కూడా జనసేన ఖాతా లోకి వెళ్తుంది అని అంటున్నారు ఇక తిరుపతి సీటు జనసేనకు ఒక సెంటిమెంట్. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పర్టీ అక్కడ నుంచి గెలిచింది. దాంతో ఆ సీటుని కోరుతున్నారు. అక్కడ సీటు తెచ్చుకుంటే కచ్చితంగా తమకు అనుకూలంగా ఉన్న బలిజ సామాజికవర్గం మద్దతుతో జనసేన విజయం సాధిస్తుందని జనసేన ధీమాగా ఉంది. ఈ సీటు కూడా ఇవ్వడానికి బాబు రెడీగా ఉన్నారు.

ఇక అనంతపురం, కడప జిల్లాల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తోంది. అక్కడ కూడా ఒకటో రెండో సీట్లను తీసుకుని ఏపీ అంతా తాము ఉన్నామని చెప్పడానికి చూస్తున్నారని అంటున్నారు. నిజానికి చూస్తే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అయితే టీడీపీతో కలసి వెళ్ళేందుకు పవన్ చూస్తున్నారు అని అంటునారు. ఈ మేరకు సీట్ల మీద అవగాహన దాకా రెండు పార్టీలు వచ్చాయి అంటే ఆలోచించాల్సిందే కదా.

మరో వైపు పవన్ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చను అని అంటున్నరు. జగన్ ఎట్టి పరిస్థితుల్లో మాజీ సీఎం కావాలని శపధం పట్టారు. దాంతో తెలుగుదేశంతో చేతులు కలుపుతున్నారు అని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశం ఉండగా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నాయి అని అర్ధమవుతోంది.

ఇవన్నీ ఎలా ఉన్నా పవన్ సీఎం అని జనసేన నాయకులు భావిస్తున్న నేపధ్యంలో ఆ పార్టీ జస్ట్ ఇరవై సీట్లకే టీడీపీతో పొత్తులోకి వెళ్తే జనసైనికుల మనోభావాలు ఎలా ఉంటాయో అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఏపీలో మాత్రం పాత పొత్తులు కొత్తగా పొడవడానికి రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.