Begin typing your search above and press return to search.
టీడీపీ ప్లస్ జనసేనలకు 2024 ఎన్నికల్లో 5 వేల కోట్లు అవసరమా... ఇచ్చేవారు ఎవరు...?
By: Tupaki Desk | 26 Oct 2022 8:07 AM GMTఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మరో రెండు నెలల్లో 2023 కి అంతా వస్తారు. దాంతో ఇక ఎన్నికలు ఏడాదిలోకి వచ్చేసినట్లే. దాంతో అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేసుకుంటున్నాయి. టీడీపీ అయితే పొత్తులను జాగ్రత్తగా చూసుకుంటోంది. అది రాజకీయ సమీకరణ. ఆ తరువాత ఆర్ధిక సమీకరణలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. జనసేన పరిస్థితి కూడా దాదాపుగా అంతే. ఎన్నిక ఎన్నికలూ ధన ప్రవాహం వెల్లువగా సాగిపోతున్న రోజులు ఇవి. దాంతో 2024 ఎన్నికలు అంటే డబ్బు ఇబ్బడి ముబ్బడిగా తీయాల్సి ఉంటుంది.
ఈ విషయం రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న వారికి అర్ధం బాగా అవుతుంది. కానీ ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ. దాంతో అన్ని రకాల అడ్వాంటేజేస్ ఆ పార్టీకి ఉంటాయనడంలో సందేహం లేదు. ఆ పార్టీకి ప్రత్యక్ష నగదు బదిలీ పధకం కింద ఇప్పటిదాకా దాదాపు లక్షా యాభై వేల కోట్ల రూపాయాలను వివిధ పధకాల కింద జనాలకు పంచింది.
ఇది ప్రభుత్వ పరంగా చేస్తోంది. ఇంకా ఎన్నికల వేళకు మరింత సొమ్ము జనాలకు పధకాల ద్వారా అందుతుంది. ఇక పార్టీ పరంగా తీసుకుంటే వైసీపీకి పవర్ చేతిలో ఉంది కాబట్టి ఫండ్స్ కి కూడా ఎలాంటి ఢోకా లేకపోవచ్చు. అవి బాగానే వస్తాయని అంటున్నారు. సో ఆ విధంగా చూస్తే వైసీపీ సేఫ్ జోన్ లో ఉంది. మరి విపక్షాలకు ఈ విషయంలో ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తాయన్నది కీలకమైన ప్రశ్న.
అధికార పార్టీని తట్టుకుని ఫండ్స్ ని తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఇపుడు టీడీపీ జనసేనలకు ఉంది అంటున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 175 సీట్లలో అభ్యర్ధులకు పార్టీ నుంచి ఫండ్స్ కింద ఇవ్వాలీ అంటే ఈ రెండు పార్టీలకు కలిపి దాదాపుగా అయిదు వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందని ఒక అంచనాగా ఉంది.
ఇపుడు ఏపీలో టీడీపీకి గట్టి అభ్యర్ధులే ఇంచార్జులుగా ఉన్నారు. జనసేనలో ఉన్న వారిలో కూడా చాలా మంది దగ్గర అర్ధ బలం ఉంది అంటున్నారు. కానీ వారు తమ దగ్గర డబ్బు ఎందుకు తీస్తారు అన్నది మౌలికమైన ప్రశ్న. వారు తాము అధికారంలో లేము కాబట్టి పార్టీలే ఆదుకోవాలని కోరుతాయి. అది సహజం కూడా. ఆ విధంగా చూసుకుంటే అభ్యర్ధులకు ఫండింగ్ సమకూర్చాల్సిన పెద్ద బాధ్యత కచ్చితంగా టీడీపీ జనసేనలకు ఉంది అంటున్నారు.
ఇక అధికారంలో లేని అభ్యర్ధులకు వేరే విధంగా ఫండ్స్ రావు, సొంతంగా పలుకుబడి ఉన్నా అది పరిమితమైన స్థాయిలో ఉంటుంది. దాంతో నిధుల కోసం రెండు పార్టీల నుంచి ఉన్న అభ్యర్ధులు అధినాయకత్వం వైపే చూస్తారు అని అంటున్నారు. మరి ఈ విషయం కనుక ఆలోచిస్తే జనసేన టీడీపీలకు బిగ్ టాస్క్ అనే అంటున్నారు.
ఈ విషయంలోనే రెండు పార్టీల అధినాయకత్వాలు సమాలోచన చేస్తున్నాయి అని తెలుస్తోంది. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ అనేక రకాలుగా సొమ్ము తెచ్చుకునే వీలు ఉంటుంది. కానీ విపక్షంలో ఉంటే ఎన్నో రకాల ఆంక్షలు ఎన్నో చూపులు, మరెన్నో డేగ కళ్ళు వెంటాడే పరిస్థితి ఉంటుంది. అందుకే టీడీపీ కూడా ఇపుడు ఆలోచనలో పడుతోంది అంటున్నారు. నిజానికి వైసీపీ అధినాయకత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే టీడీపీ ఆధిక మూలాలను దెబ్బతీయడం మొదలెట్టింది.
ఆ విధంగా టీడీపీ సానుభూతిపరులను టార్గెట్ చేసింది అని ప్రచారంలో ఉంది. దీని వల్ల టీడీపీ వైపు చూడాలన్నా నిధులు సాయం చేయాలన్న వారీకి ఒక రకమైన బెంగ భయం పెట్టేశారు అని అంటున్నారు. దాంతో వారు దూరంగానే ఉంటున్నారు. ఐటీ దాడులు, ఈడీ దాడులు కూడా గండంగా పొంచి ఉంటాయి. అందుకే ఇపుడు టీడీపీ బీజేపీతో మైత్రి కోరుకుంటోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఐటీ, ఈడీ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి.
దాంతో కేంద్రంలోని ప్రభుత్వంతో దోస్తీ చేస్తే తమకు వెసులుబాటు ఉంటుంది అన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్. ఆ విధంగా కనుక భరోసా ఉంటే టీడీపీకి నిధులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఒకేసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆగడాలను తట్టుకుంటూ నిధులను సమకూర్చుకోవడం టీడీపీ లాంటి ఢక్కామెక్కీలు తిన్న పార్టీకి కూడా కష్టసాధ్యమే.
అందుకే వైసీపీ బీజేపీలను విడగొట్టడం రాజకీయ ఎత్తుగడ అయితే బీజేపీ మైత్రి ఆర్ధికంగా తమకు నిధుల సమీకరణకు ఉపయోగపడుతుంది అన్నదే పసుపు పార్టీ ఆలోచన అని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. బీజేపీ కనుక టీడీపీతో మైత్రి లేదు అంటే కనుక కచ్చితంగా టీడీపీ నిధుల సమీకరణకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇక జనసేనకు ఇదే రకమైన పరిస్థితి టీడీపీతో ఉంటే కలవచ్చు అని చెబుతున్నారు. సో ఇదీ ఫండింగ్ కి సంబంధించి ఈ రోజుకు ఉన్న మ్యాటర్ అన్న మాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.