Begin typing your search above and press return to search.

జగన్ మీద టోన్ పెంచిన నంబర్ టూ..పవనే కారణం...?

By:  Tupaki Desk   |   24 Nov 2022 12:30 AM GMT
జగన్ మీద టోన్ పెంచిన నంబర్ టూ..పవనే కారణం...?
X
ఆయన కాంగ్రెస్ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా ఆ తరువాత స్పీకర్ గా పనిచేశారు. ఆయన పెద్దగా మాట్లాడే వక్త కాదు, అయినా జనసేనలో చేరాక స్టేట్ లీడర్ అయిపోయారు. పవన్ లేని సమయంలో ఆయనకు కాని సమయంలో నాదెండ్ల మనోహర్ పెదవి విప్పుతారు. ఆయనకు సబ్జెక్ట్ మీద బాగానే పట్టుంది. దాంతో జగన్ సర్కార్ మీద గట్టిగానే విరుచుకుపడుతున్నారు.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదామా జగన్ అంటూ కవ్విస్తున్నారు. మీ చరిత్ర ఒక్కసారి చూసుకోండి అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటిదాకా జనసేన తరఫున పవన్ కళ్యాణే అన్నీ అయి చూసేవారు. ఇపుడు ఆయన కాస్తా విరామం ఇచ్చి నంబర్ టూ ని జనంలోకి పంపించారు. వారం రోజుల పాటు విజయనగరం జిల్లలో మకాం వేసి మొత్తం నియోజకవర్గాల వారీగా సమీక్షలను నాదెండ్ల చేస్తున్నారు.

ఇది నిజంగా ఆయనకు పెద్ద బాధ్యత. దాంతో ఆయన విలువ జనసేనలో ఏమిటి అన్నది అర్ధం చేసుకోవాల్సిందే. ఇక నాదెండ్ల విశాఖకు వస్తూనే జగన్ మీద ఘాటైన విమర్శలతో దాడి మొదలెట్టారు. రౌడీ సేన అని జనసేనను అనడానికి సీఎం ఎవరని నిలదీశారు. ఆయన ప్రజావ్యతిరేక పాలన మీద పోరాటం చేస్తూంటే ఇలా అక్కసుతో కామెంట్స్ చేస్తున్నారు తప్పితే మరేమీ కాదని అంటున్నారు.

అయినా జగన్ కాండక్ట్ సర్టిఫికేట్ తమ పార్టీకి అసలు అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. తమకు ప్రజల ఆశీర్వాదం ఉందని అందుకే తాము జనంతోనే ఉంటామని చెప్పుకొచ్చారు. జనసేన గ్రాఫ్ బాగా పెరగడం వల్లనే జగన్ ఇలా తమ మీద విమర్శలు చేస్తున్నారు అని కూడా నాదెండ్ల విమర్శించారు. ఇదిలా ఉండగా గజపతినగరంతో నాదెండ్ల సమీక్షను మొదలెట్టారు.

అక్కడ కూడా ఆయన గట్టిగానే జగన్ సర్కార్ మీద విమర్శలు చేసారు. పెన్నులకు చున్నీలకు భయపడే అసమర్ధ ముఖ్యమంత్రి అంటూ జగన్ మీద బాణాలు బగానే వేశారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా ఈ అసమర్ధ సీఎం ని జనాలు ఇంటికి పంపించాలని చూస్తున్నారని నాదెండ్ల విమర్శలు చేయడం విశేషం. ఎపుడు ఎన్నికలు వచ్చినా జనసేన వైపు జనాలు ఉంటారని ఆయన అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే జగన్ తన సొంత సంపాదనలో ఎవరికీ ఏమీ పెట్టని వారు అని అలాంటి వ్యక్తి తమ మీద విమర్శలు చేయడమేంటి అని కూడా నాదెండ్ల కౌంటర్లేశారు. మొత్తానికి జనసేన అంటే ఇప్పటిదాకా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే వైసీపీ మీద జగన్ మీద విరుచుకుపడేవారు.

ఇపుడు నాదెండ్ల ఫీల్డ్ లోకి వచ్చారు. ఆయన్ని వ్యూహాత్మకంగానే పవన్ పంపించారు. అలా అటూ ఇటూ చెడుగుడు ఆడుతూ ఏపీలో వైసీపీకి ఏ మాత్రం రెస్ట్ లేకుండా చేయాలని జనసేన బాగానే ప్లాన్ వేస్తోంది. పవన్ని అన్నట్లుగానే నాదెండ్లను కూడా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారా లేకపోతే ఆయనతో పనిలేదని గమ్మున ఉంటారా చూడాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.