Begin typing your search above and press return to search.
నాగబాబు ఎంపీగా...అక్కడ ఫోకస్...?
By: Tupaki Desk | 16 April 2023 6:00 AM GMTజనసేనకు నూతన ప్రధాన కార్యదర్శిగా మెగా బ్రదర్ నాగబాబు నియమితులయ్యారు. ఆయన తనకు ఈ పదవిలో నియమించినందుకుగానూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడు ఎలాంటి బాధ్యతను అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే నాగబాబు ఇప్పటికే జనసేనలో పీఏసీ మెంబర్ గా ఉన్నారు. ఆ హోదాలో ఆయన అనేక జిల్లాలను చుట్టి వచ్చారు. ఇక నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. రెండు కీలకమైన సబ్ రీజియన్ల మీద పట్టు కోసం జనసేన చూస్తోంది. జనసేనకు అవి ఆయువు పట్టుగా ఉంటాయని కూడా నమ్మకంగా పెట్టుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలోని ఉమ్మడి మూడు జిల్లాల మీద జనసేన పూర్తి ఫోకస్ పెట్టింది అని తెలుస్తోంది. ఈ రెండు కలపి 68 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అదే విధంగా పది దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక్కడే పొత్తులు ఉన్నా మెజారిటీ సీట్లను జనసేన తీసుకోవాలని చూస్తోంది. కనీసంగా ముప్పయి అయిదు సీట్లు ఇక్కడే జనసేన కోరనుంది అంటున్నారు. అంటే సగానికి సగం అన్న మాట.
అలాగే ఎంపీలు కూడా నాలుగు ఇక్కడే ఆ పార్టీ తీసుకుంటుంది అని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది తెలియచేయలేదు. అయితే పవన్ ఈసారి కచ్చితంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి కానీ కాకినాడ రూరల్ కానీ లేక పిఠాపురం నుంచి కానీ పోటీలో ఉండవచ్చు అని చెబుతున్నారు.
అదే సమయంలో జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబుని ఎంపీగా పంపిస్తారు అని అంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెట్టి అక్కడ నుంచి ఆయన పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే విషయం కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. అనకాపల్లిలో జనసేన గట్టిగానే పుంజుకుందని ఆంటున్నారు.
ఇక్కడ ఒక బలమైన సామాజికవర్గం గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. దాంతో జనసేన ఆ సామాజికవర్గంలో పూర్తి మద్దతు ఉండడంతో నాగబాబుని కనుక నిలబెడితే గెలుపు ఖాయమని ఆలోచిస్తోంది అని అంటున్నారు. నాగబాబుని ఢిల్లీ స్థాయిలో ఎంపీగా పంపించి రాష్ట్ర రాజకీయాల్లో తాను కీలకం కావాలని పవన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అందుకే లోక్ సభకు నాగబాబు అని అంటున్నారు. మరో వైపు చూస్తే అనకాపల్లి నుంచి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు అదే సీటు నుంచి నాగబాబు పోటీ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇంకో వైపు నాగబాబు త్వరలోనే ఉత్తరాంధ్ర సహా కీలక జిల్లాలలో పర్యటనలు స్టార్ట్ చేస్తారని అంటున్నారు.
తాను జనసైనికులలో ఒకరిని అని ఆయన చెప్పుకున్నారు. తాను జనసైనికులను కలుస్తాను అని అలాగే వారు కూడా తనను స్వేచ్చగా కలవవచ్చు అన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఆయన త్యాగనిరతిని ప్రజలలో ప్రచారం చేస్తామని జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు వెల్లడించారు. ఏపీలో మంచి పరిపాలనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందిస్తారు అని ఆయన తెలిపారు.
మొత్తం మీద చూస్తే జనసేన ఒక ప్లాన్ ప్రకారమే రంగంలోకి వస్తోంది అని అంటున్నారు. తమకు బలమున్న సీట్లు, తాము ఫోకస్ పెట్టిన సబ్ రీజియన్స్ ని దృష్టిలో పెట్టుకుని అక్కడే తమ రాజకీయానికి పదును పెడుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో తొందరలో జిల్లాల టూర్లకు నాగబాబు ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీకి వస్తారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.