Begin typing your search above and press return to search.
ప్రజారాజ్యానికి ఒక్క ఎంపీ రాలేదుగా పవనూ...?
By: Tupaki Desk | 16 Aug 2022 12:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను తలచుకుంటే అంటూ మొదలుపెడతారు. నేను అలా అనుకుంటే అంటూ చాలా చెబుతారు. నిజానికి ఆయన్ని తలచుకోవద్దని ఎవరు అన్నారో మాత్రం ఎక్కడా చెప్పరు. ఇదిలా ఉంటే పవన్ స్వాతంత్ర వేడుకల వేళ పార్టీ సమావేశాన మాట్లాడుతూ కొన్ని రాజకీయ విమర్శలు కూడా చేశారు. తన గతాన్ని కూడా బాగానే తలచుకున్నారు. నేను తలచుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని అంటూ లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ని జనసైనికులకు ఆయన గుర్తు చేశారు.
నిజానికి పవన్ చెప్పినది 2009 నాటి ముచ్చట. అంటే అన్న చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో తాను యువరాజ్యం అధినేతగా ఉన్నప్పటి సంగతి అన్న మాట. నిజంగా పవన్ ఆనాడు ఎందుకు పోటీ చేయాలనుకోలేదో తెలియదు కానీ ఉమ్మడి ఏపీలో మొత్తం 42 సీట్లలో చాలా మంది అభ్యర్ధులు ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. చిత్రమేంటి అంటే నాడు ఏ ఒక్కరూ కూడా ఎంపీగా గెలవలేదు. అయితే ప్రజారాజ్యానికి 70 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి.
అంతే కాదు 18 దాకా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఇక్కడ మరో ముచ్చట కూడా జరిగింది. చిరంజీవి రెండు సీట్లకు పోటీ చేస్తే సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో పాలకొల్లులో ఓడిపోయారు, తిరుపతిలో మాత్రం గెలిచారు. ఇదీ ప్రజారాజ్యం నాటి రాజకీయ చరిత్ర. మరి పవన్ తాను 2009లోనే ఎంపీ అయ్యేవాడిని అంటున్నారు.
నాడు బలమైన అభ్యర్ధులు ఇంకా చెప్పాలీ అంటే చిరంజీవి ఊపుని చూసి పీయార్పీ తప్పక అధికారంలోకి వస్తుందని భావించి నాటి టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కూడా అనేక చోట్ల నేతలు పార్టీ మారి పోటీ చేశారు.
అంటే నాయకుల బలానికి ఏమీ లోటు లేదు, చిరంజీవి గ్లామర్ కి తిరుగులేదు, కానీ ఒక్క ఎంపీ కూడా ఆనాడు గెలవలేదు అన్నది ఒక చేదు నిజం. మరి పవన్ కళ్యాణ్ నాడు ఎంపీగా పోటీ చేస్తే గెలిచేవాడిని అని ఎలా అంటున్నారో అని ప్రత్యర్ధులు విమర్శలు మొదలెట్టారు. మరో వైపు చూస్తే 2019 ఎన్నికల ఫలితాలు కళ్ళ ముందే ఉన్నాయి. రెండు చోట్లలో పవన్ పోటీ చేసి రెండూ ఓడిపోయారు.
అంటే ఎంపీ కంటే ఎమ్మెల్యేగా గెలవడం సులువు. పైగా జనసేన తొలిసారి బరిలోకి దిగింది. పవన్ ఊపు కూడా నాడు కనిపించింది. అయినా సరే ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా పవన్ గెలవలేదు కదా అని ప్రత్యర్ధులు అంటున్నారు. ఇక ఏడు అసెంబ్లీ సీట్లు కలిస్తే ఒక ఎంపీ సీటు అవుతుంది. మరి ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పవన్ తాను ఎపుడో ఎంపీ అయ్యేవాడిని అని చెప్పడం ఏంటి అని సెటైర్లు పడుతున్నాయి. పైగా ప్రజారాజ్యం ఆ ఎన్నికల్లో ఫ్లాప్ షో చేసింది. దాన్ని మళ్ళీ మళ్లీ తలచుకుంటే జనసేనకే ఇబ్బంది అన్న సంగతిని కూడా పవన్ మరచిపోతున్నారా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి మరి.