Begin typing your search above and press return to search.
పవన్ పంట పండుతోందా.. వారంతా రెడీనా...?
By: Tupaki Desk | 24 Aug 2022 2:30 AM GMTమొత్తానికి పార్టీ పెట్టి ఎనిమిదేళ్ళ పాటు నడిపించిన తరువాత వెల్లువలా పవన్ పార్టీలోకి చేరికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయిట. ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితులే జనసేనకు కలసివస్తున్నాయని అంటున్నారు. దానికి కారణం అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూడా ఒకే విధమైన పద్ధతిని అనుసరించబోతున్నాయి. ఏపీలో చూస్తే జగన్ పనిచేయని ఎమ్మెల్యేలకు టికెట్లు లేవు అని చెప్పేస్తున్నారు. మరి ఆయన వద్ద నివేదికలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఈ రోజున పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జడుసుకునేలా వర్క్ షాప్ లో ముఖ్యామంత్రి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
దాంతో పనితీరుకు కొలమానం ఏంటో తెలియక చాలా మంది ఇక తమకు టికెట్ హుళక్కే అని డిసైడ్ అవుతున్నారుట. వారంతా ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు అని టాక్. వైసీపీలో ఈసారి కనీసంగా నలభై నుంచి యాభై మందికి టికెట్లు దక్కవని అంటున్నారు. దంతో అలా టికెట్లు తమకు రావు అని అనుమానం ఉన్న వారు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారు అని తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ తాకిడి ఎక్కువగా ఉంది అని అంటున్నారు.
వైసీపీ విషయం తీసుకున్నా పార్టీ పరిస్థితి కాస్తా నెమ్మదించినది కూడా గోదావరి కోస్తా జిల్లాలలో కావడంతో అక్కడే ఎక్కువ మందికి టికెట్లు రావు అని అంటున్నారు. దాంతో ముందు జాగ్రత్త పడుతున్న వారు కొత్త పార్టీగా జనసేన వైపు చూస్తున్నారుట. అదే విధంగా కోస్తా ప్రాంతాలలో అయితే టీడీపీని కూడా చాయిస్ గా తీసుకుంటున్నారు అని అంటున్నారు.
మరో వైపు టీడీపీలో కూడా ఇలాంటి పరిస్థితే కొన్ని చోట్ల ఉంది. సీనియర్ నేతలను కొన్ని చోట్ల పక్కన పెట్టాలని పార్టీ ఆలోచిస్తోంది. అదే విధంగా మూడేళ్ళుగా పార్టీ కోసం పనిచేయని వారు వద్దు అని కూడా చెబుతోంది. దాంతో వారు కూడా తట్టా బుట్టా సర్దుకోవడానికి రెడీ అవుతున్నారు. అలా కనుక చూస్తే ఉత్తరాంధ్రా రాయలసీమలలో ఎక్కువ మంది టీడీపీ నుంచి జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
అలా చిత్తూరు, కర్నూల్, కడప వంటి చోట్ల టీడీపీ మాజీలు చాలా మంది జనసేన వైపు చూస్తున్నారుట. అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ నేతలు జనసేన బెటర్ అని భావిస్తున్నారుట. ఈ పరిణామాల నేపధ్యంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో తాజాగా జరిగిన జనసేన రాజకీయ వ్యవాహరాల కమిటీ మీటింగులో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కూడా ఆలోచించారని అంటున్నారు. దాంతోనే పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న వారు కరెక్ట్ గా ఉండాలని, కోవర్టులు కాకూడదని పిలుపు ఇచ్చారని అంటున్నారు. అలాగే కొత్త వారికి చేరాలనుకుంటున్న వారికి వెల్ కమ్ చెబుతారని తెలుస్తోంది. చేరికలతోనే పార్టీకి బాగా ఊపు వస్తుందని, అపుడే గ్రాఫ్ పెరిగి పార్టీ పటిష్టం అవుతుంది అని కూడా భావిస్తున్నారుట.