Begin typing your search above and press return to search.
పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజకీయ తుపానే..?
By: Tupaki Desk | 24 Oct 2022 11:58 AM GMTజనసేనకు ఏకైక ఆకర్షణ పవన్ కళ్యాణ్. వన్ టూ హండ్రెడ్ ఆ మాటకు వస్తే ధౌజండ్ నంబర్ కూడా పార్టీలో ఆయనదే. జనసేన మీద ఎవరైనా విమర్శలు చేసేటపుడు అనేది ఒక్కటే మాట. ఆ పార్టీకి దిగ్గజ నాయకులు లేరు, సంస్థాగతంగా బలహీనం అని. అయితే దేశంలో ఏ పార్టీకైనా నాయకులు అన్న వారు కొందరు మాత్రమే తయారవుతారు. మరి కొందరు ఇతర పార్టీల నుంచి వస్తారు. అలా రెండిందాల పార్టీ బాగుపడుతుంది. జనసేన విషయం తీసుకుంటే సొంతంగా పవన్ మీద ప్రేమతో జనసేన సిద్ధాంతాలను అభిమానించి చేరిన వారు అలాగే ఉన్నారు.
వరితోనే ప్రస్తుతం పార్టీ నడుస్తోంది. అదే టైంలో జనసేన బలం ఇపుడు రెట్టింపు కాబోతోంది అని లెక్క వేస్తున్నారు. అదెలా అంటే ఏపీలో పొత్తులకు తెర లేచింది. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలసి పోటీ చేయడం ఖాయమని అంతా అంటున్నారు. దాదాపుగా అది కన్ ఫర్మ్ అనే చెబుతున్నారు. ఈ పొత్తులు ఉభయ కుశలోపరిగా ఉంటాయని కూడా రెండు పార్టీలలో నేతలు భావిస్తున్నారు. దాంతో ఎన్నికల ముందు పొత్తుల ప్రకటన ఉంటుంది.
ఈ లోగా చేయాల్సిన పనులు అన్నీ లోపాయికారిగా జరిగిపోతాయని అంటున్నారు. అదెలా అంటే టీడీపీ జనసేన కోసం ఏపీలో చాలా స్థానాలు గుర్తించి అట్టేపెట్టింది అని అంటున్నారు. వాటిని పార్టీలో చురుకుగా ఉన్న నాయకులు ముందే అంచనా కడుతూ అవకాశాలను వెతుక్కునే పనిలో పడ్డారని అంటున్నారు. ఇపుడు జనసేనలోకి జంపింగ్స్ పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉంటాయని కూడా ఊహిస్తున్నారు. టీడీపీలో సీటు దక్కదని భావించేవారు, లేకపోతే తమకు ప్రాధాన్యత దక్కదని ఊహించేవారు అంతా జనసేనలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని అంటున్నారు.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ జంపింగుల గోల ఎక్కువగా ఉందని అంటున్నారు. జనసేనలో చేరితే టికెట్ తో పాటు మంత్రి పదవి కూడా దక్కే చాన్స్ ఉంటుందని రాజకీయంగా ముందు చూపు ఉన్న వారు లెక్కలు కడుతున్నారుట. ఎటూ పొత్తులలో భాగంగా మంచి నంబర్ లో సీట్లు ఇవ్వడమే కాకుండా రేపటి రోజున జనసేన టీడీపీ కూటమి గెలిస్తే కనుక కచ్చితంగా ఆ పార్టీకి మంత్రి పదవులు కూడా నిష్పత్తిలో భాగంగా బాగానే ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు.
దాంతో టీడీపీకి ఆ విధంగా ఉభయ గోదావరి జిల్లా సహా విశాఖ వంటి చోట్ల మంత్రి పదవుల విషయంలో అవకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్న వారు కూడా జనసేన నుంచి పోటీ చేసి మంత్రి కుర్చీ అందుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారుట. దాంతో ఇపుడు అందరి చూపూ జనసేన మీదనే ఉంది అంటున్నారు. ఈ జంపింగ్స్ చేయాలనుకునే వారిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. ఇక కేవలం టీడీపీ నుంచే కాకుండా బీజేపీ కాంగ్రెస్ సహా వైసీపీ నుంచి కూడా జనసేన లోకి వెళ్లడానికి చాలా మంది బడా నేతలు ఇపుడు క్యూ కడుతున్నారని అంటున్నారు.
దాంతో ఎన్నడూ లేని విధంగా జనసేనాని పవన్ కి డిమాండ్ పెరిగింది. ఆయనతో టచ్ లోకి వెళ్ళేందుకు రాజకీయ నాయకులు పలువురు ఉత్సాహపడుతున్నారు అని అంటున్నారు. మంత్రులుగా గతంలో పనిచేసిన దిగ్గజ నేతలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. మరి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఏపీలో రాజకీయ తుపానే అని అంటున్నారు. అయితే పవన్ కూడా ఆషామాషీగా తన పార్టీ గేట్లు తీయరని అంటున్నారు. అన్నీ ఆలోచించి అవసరం అయిన వారికి మాత్రమే ఓకే చెబుతారు అని అంటున్నారు. మొత్తానికి జనసేన అంటే లైట్ తీసుకున్న వారు కూడా ఇపుడు సీరియస్ గా ఆ వైపు చూడాల్సిన అవసరం అయితే పడింది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.